MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్ బాస్ మేకర్స్ కి భారీ షాక్! ఇది ఊహించని పరిణామం

బిగ్ బాస్ మేకర్స్ కి భారీ షాక్! ఇది ఊహించని పరిణామం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆశించిన స్థాయిలో టీఆర్పీ రాబట్టలేకపోతుందని సమాచారం. రెండోవారం రేటింగ్ బాగా పడిపోయిందట.  

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 24 2024, 07:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైంది. 14 మంది సెలెబ్స్ హౌస్లోకి కంటెస్టెంట్స్ గా ప్రవేశించారు. ఈసారి పెద్దగా పేరున్న నటులు లేరు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, అభయ్ నవీన్... ఇలా ఒకరిద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు. సీరియల్ బ్యాచ్ ని ఎక్కువగా హౌస్లోకి తోశారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్విరాజ్... వీరంతా స్టార్ మా సీరియల్ నటులు. అందులోనూ కన్నడ బ్యాచ్. తెలుగు బిగ్ బాస్ షోలో ఇతర బాషల వారు ఎక్కువగా కంటెస్ట్ చేశారు. సీజన్ 7 స్థాయిలో సీజన్ 8 లేదనేది గట్టిగా వినిపిస్తున్న మాట. అందుకు కంటెస్టెంట్స్ ఎంపిక కూడా కారణం. 

బిగ్ బాస్ మేకర్స్ కి కంటెస్టెంట్స్ కొరత ఉందనిపిస్తుంది. లక్షలు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నా... కొందరు సెలబ్రిటీలు ముందుకు రావడం లేదు. బిగ్ బాస్ షో వలన పాజిటివ్ కంటే నెగిటివ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని భావిస్తున్నారు. 
 

36
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

 బిగ్ బాస్ కెరీర్ కి ఉపయోగపడకపోగా ఉన్న కెరీర్ ని కూడా నాశనం చేస్తుందని భయపడుతున్నారు. చాలా మంది సెలెబ్స్ విషయంలో ఇది నిజమైంది. పెద్దగా నేమ్ ఫేమ్ లేని నటులు, బుల్లితెర సెలబ్రిటీలకు బిగ్ బాస్ కరెక్ట్. దాని వలన వారి గురించి ప్రేక్షకులకు తెలిసే అవకాశం ఉంది. 

ఫార్మ్ లో ఉన్న నటులు, సెలెబ్రిటీలు బిగ్ బాస్ షోపై ఆసక్తి చూపడం లేదనేది నిజం. అందుకే గతంలో మాదిరి హౌస్లో స్టార్స్ పార్టిసిపేషన్ లేకుండా పోతుంది. సీజన్ 8లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇది రేటింగ్ పై ప్రభావం చూపినట్లు సమాచారం.  
 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ కి రికార్డు స్థాయి రేటింగ్ వచ్చింది. 18.9 రేటింగ్ రాబట్టింది. ఇది బిగ్ బాస్ తెలుగు హైయెస్ట్ రేటింగ్ అని సమాచారం. అయితే వీక్ డేస్ లో రేటింగ్ పడిపోయింది. సెకండ్ వీకెండ్ ఇది మరింత క్రిందకు పడిపోయిందట. 

వీకెండ్ 5.55 రేటింగ్ రాబట్టగా, వీక్ డేస్ లో ఇది 4.09 గా ఉన్నట్లు సమాచారం. కాకపోతే అర్బన్ ఏరియాల్లో కొంత మెరుగైన రేటింగ్ బిగ్ బాస్ తెలుగు 8 రాబట్టింది. రెండో వారానికి అర్బన్ ఏరియాల్లో వీకెండ్ 7.01, వీక్ డేస్ లో 4.92 రేటింగ్ వచ్చిందట. . 
 

56


వైల్డ్ కార్డు ఎంట్రీస్ అనంతరం ఇది ఒకింత మెరుగయ్యే అవకాశం ఉంది. అది కూడా పేరున్న నటులు, సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా హౌస్లో అడుగుపెడితే. కొత్తవాళ్లను కాకుండా మాజీ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. 

సీజన్ వన్ కంటెస్టెంట్ హరితేజ, సీజన్ ఫోర్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయం అంటున్నారు. వీరితో పాటు శోభా శెట్టి, టేస్టీ తేజ, రోహిణి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మరో రెండు వారాల్లో క్లారిటీ రానుంది.     
 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8

మొదటి మూడు వారాల్లో బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. నాలుగో వారానికి నామినేషన్స్ ముగియగా... ప్రేరణ, సోనియా, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, పృథ్విరాజ్, నబీల్ లిస్ట్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Recommended image2
Trisha Krishnan: విజయ్ ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: నిజం బయటపెట్టిన కల్పన, ప్రభావతి విశ్వరూపం...రోహిణీని చావబాదేసింది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved