MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • హౌస్లో నామినేషన్ హీట్! కంటెస్టెంట్స్ మధ్య వాడివేడిగా ఆర్గ్యుమెంట్స్!

హౌస్లో నామినేషన్ హీట్! కంటెస్టెంట్స్ మధ్య వాడివేడిగా ఆర్గ్యుమెంట్స్!

రెండవ వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. లిస్ట్ లో టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 09 2024, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా మొదటివారం పూర్తి చేసుకుంది. సోషల్ మీడియా స్టార్ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. శేఖర్ బాషా, నాగ మణికంఠ, విష్ణుప్రియ, పృథ్విరాజ్, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క నామినేట్ అయ్యారు. వీరిలో బేబక్కకు అత్యల్పంగా ఓట్లు పోల్ అయ్యాయి. దాంతో ఆమె ఎలిమినేట్ అయ్యారని నాగార్జున వెల్లడించాడు. 

ఇక హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈసారి పెద్దగా పేరున్న సెలెబ్స్ షోకి రాలేదు. బిగ్ బాస్ వలన పాజిటివిటీ కంటే నెగిటివిటీకి ఎక్కువ అవకాశం ఉంది. అనవసరంగా కెరీర్ రిస్క్ లో పడుతుందని టాప్ సెలెబ్స్ ఈ షోకి దూరంగా ఉంటున్నారు. సీజన్ 8 కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు కొంత నిరాశకు గురయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మొదటి వారం ముగియగా కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ కి ఒక అభిప్రాయం వచ్చింది. ఎవరు ఎలా ఆడుతున్నారో... ఒక అంచనాకు వచ్చారు. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయంలో శేఖర్ బాషా కంటెంట్ ఇస్తున్నాడు. ఎంటర్టైన్ చేస్తున్నాడు. అతడి జోక్స్ కొన్ని సార్లు చిరాకు తెప్పించినా మరికొన్ని సందర్భాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. 

శేఖర్ బాషాతో పాటు ప్రేరణ, నైనిక ల గేమ్ పై సోషల్ మీడియా జనాలు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నాగ మణికంఠ, సోనియా ఆకుల, యాష్మి గౌడపై నెగిటివిటీ నడుస్తుంది. మిగిలిన 7 గురు కంటెస్టెంట్స్ మీద ఆడియన్స్ లో స్ట్రాంగ్ ఒపీనియన్స్ కలగలేదు. అందుకు వారు ఎలాంటి కంటెంట్ ఇవ్వకపోవడం కారణం. 

35

సోమవారం సెకండ్ వీక్ నామినేషన్స్ మొదలయ్యాయి. హౌస్ మేట్స్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. సీతతో ప్రేరణ, సోనియా ఆకుల వాగ్వాదానికి దిగారు. కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన కంటెస్టెంట్ పై రంగు నీళ్లు పోయాల్సి ఉంటుంది. 

నామినేషన్స్ ప్రోమో హీటెక్కిస్తోంది. మరి రెండో వారానికి ఎవరు నామినేట్ అయ్యారు అనేది ప్రక్రియ ముగిస్తే కానీ తెలియదు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ రెండు రోజులకు పైగా జరిగాయి. మరి సెకండ్ వీక్ నామినేషన్స్ లిస్ట్ లో ఉంది ఎవరు అనేది సోమవారం ఎపిసోడ్ తో క్లారిటీ వస్తుందా? లేదా? అనేది చూడాలి. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 

45


ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే ఓ లిస్ట్ వైరల్ అవుతుంది. పృథ్విరాజ్, నిఖిల్, సీత, శేఖర్ బాషా, ఆదిత్య ఓం, మణికంఠ, నైనిక, నాగ మణికంఠ నామినేట్ అయ్యారట. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని సమాచారం. ఈసారి లిస్ట్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయినా సంచలనమే అని చెప్పొచ్చు. 

 

55

విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నిఖిల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ. మిగతా 5 మంది కంటెస్టెంట్స్ లో ఒకరు ఎలిమినేట్ కావచ్చు. ప్రస్తుతానికి విష్ణుప్రియ టైటిల్ ఫేవరెట్ గా ఉంది. పాపులారిటీ రీత్యా ఆమె టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్లో ఏమైనా జరగొచ్చు. గేమ్ ఆధారంగా కంటెస్టెంట్స్ ఫాలోయింగ్ మారిపోతూ ఉంటుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Recommended image2
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Recommended image3
Suma Kanakala: కారు దిగి నడిరోడ్డు మీద పరిగెత్తిన యాంకర్ సుమ, కారణం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved