MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • ఓటింగ్ లో లవ్ బర్డ్స్ కి ఊహించని దెబ్బ, అనూహ్యంగా దూసుకొచ్చిన టేస్టీ తేజ!

ఓటింగ్ లో లవ్ బర్డ్స్ కి ఊహించని దెబ్బ, అనూహ్యంగా దూసుకొచ్చిన టేస్టీ తేజ!

ఓటింగ్ ట్రెండ్ రోజు రోజుకు మారిపోతుంది. మొదటి రోజు వెనకబడ్డ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఓటింగ్ పెంచుకుని రేసులోకి దూసుకొచ్చారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 13 2024, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గత వారం గంగవ్వ ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఎలిమినేట్ కాకుండానే గంగవ్వ షోకి గుడ్ బై చెప్పింది. వ్యక్తిగత కారణాలతో గంగవ్వ బయటకు వచ్చేశారు. ఇక నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. చివరికి యష్మి-హరితేజ మిగిలారు. వీరిద్దరిలో హరితేజ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 

గంగవ్వ, హరితేజ నిష్క్రమణతో బిగ్ బాస్ హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. యష్మి, గౌతమ్, విష్ణుప్రియ, టేస్టీ తేజ, పృథ్వి, అవినాష్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్ లో అనూహ్య ఫలితాలు నమోదు అయ్యాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26


గౌతమ్ టాప్ లో ట్రెండ్ అవుతున్నాడట. గౌతమ్ కి ఏకంగా ఇరవై ఐదు శాతం ఓట్లు పోల్ అయ్యాయట. గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడు సీజన్ 7 కంటెస్టెంట్ అన్న విషయం తెలిసిందే. గౌతమ్ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. అయినప్పటికీ వారందరినీ వెనక్కి నెట్టి ఓటింగ్ లో దూసుకుపోతున్నాడని సమాచారం.

36

గౌతమ్ తర్వాత రెండో స్థానంలో టేస్టీ తేజ ఉన్నాడని తెలుస్తుంది. ఒక్క రోజులో టేస్టీ తేజ రెండు స్థానాలు  మెరుగుపరుచుకున్నాడు. యష్మి, పృథ్విరాజ్ లను వెనక్కి నెట్టి రేసులో ముందుకు దూసుకొచ్చాడట. టేస్టీ తేజ ప్రస్తుతంకంఫర్ట్ జోన్లో ఉన్నాడని తెలుస్తుంది. ఇక మూడో స్థానంలో యష్మి ఉన్నారట. నిన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న యష్మి మూడో స్థానానికి పడిపోయింది.

46

గౌతమ్, టేస్టీ తేజ, యష్మి మొదటి మూడు స్థానాల్లో ఉన్నారట. ఇక నాలుగో స్థానంలో అవినాష్ కొనసాగుతున్నాడట. అవినాష్ సైతం తన స్థానాలు మెరుగు పరుచుకున్నాడు. అతడు చివరి స్థానం నుండి నాలుగో స్థానానికి ఎగబాకాడు. డేంజర్ జోన్ నుండి తప్పించుకున్నాడు. ప్రస్తుతానికి అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు.

56

చివరి రెండు స్థానాల్లో పృథ్విరాజ్, విష్ణుప్రియ ఉన్నారట. విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా పరిచయమైన 14 మంది కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ. ఆమెకున్న ఫేమ్ మరొకరికి లేదు. ఆ హోదా విష్ణుప్రియ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఆమె దృష్టి ఆటపై కంటే పృథ్విరాజ్ పైనే ఎక్కువ ఉంది. 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8

విష్ణుప్రియ ఏ విధంగా తన మార్కు చూపించడం లేదు. టైటిల్ ఫేవరెట్ కాస్తా ఎలిమినేట్ అయ్యే స్థాయికి పడిపోయింది. ఈ వారం ఆమె డేంజర్ జోన్లో ఉంది. ఇంటిని వీడినా ఆశ్చర్యం లేదు. విష్ణుప్రియ గోల్డెన్ ఛాన్స్ కోల్పోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీలకు టైటిల్ కొట్టే ఛాన్స్ ఎలాగూ ఉండదు. ఏ మాత్రం గేమ్ చూపించినా విష్ణుప్రియ టైటిల్ రేసులో ఉండేది.

 ఐదారు స్థానాల్లో పృథ్విరాజ్, విష్ణుప్రియ ఉన్న నేపథ్యంలో లవ్ బర్డ్స్ కి బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా.. మరొకరు తీవ్ర వేదనకు గురి అవుతారు. ముఖ్యంగా పృథ్విరాజ్ ఎలిమినేటైతే విష్ణుప్రియ తట్టుకోలేదు. అందులో సందేహం లేదు. మరి ప్రేమ పక్షులను ప్రేక్షకులు విడదీస్తారో లేక కొనసాగిస్తారో చూడాలి. ఓటింగ్ ముగియడానికి ఇంకా సమయం ఉంది. సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Recommended image2
Trisha Krishnan: విజయ్ ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: నిజం బయటపెట్టిన కల్పన, ప్రభావతి విశ్వరూపం...రోహిణీని చావబాదేసింది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved