MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • TV
  • అప్పుడు పల్లవి ప్రశాంత్-ఇప్పుడు విష్ణుప్రియ, దెబ్బకు గేమ్ మారిపోయిందిగా!

అప్పుడు పల్లవి ప్రశాంత్-ఇప్పుడు విష్ణుప్రియ, దెబ్బకు గేమ్ మారిపోయిందిగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ కి జరిగిందే ఇప్పుడు విష్ణుప్రియకు కూడా జరిగింది. దెబ్బకు గేమ్ మారిపోయింది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 11 2024, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg boss telugu 8

Bigg boss telugu 8

వాడి వేడి వాగ్వాదాల నడుమ సెకండ్ వీక్ నామినేషన్స్ ముగిశాయి.విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక, కిరాక్ సీత, నిఖిల్ ఉన్నారు. టాప్ సెలెబ్స్ నామినేషన్స్ లో ఉండగా ఎవరు ఇంటిని వీడినా సంచలనమే. విష్ణుప్రియ వరుసగా రెండో వారం కూడా నామినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. విష్ణుప్రియకు ప్రేక్షకుల్లో పాజిటివిటీ పెరిగింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Bigg boss telugu 8

Bigg boss telugu 8

సోనియా ఆకుల చేసిన నెగిటివ్ కామెంట్స్ విష్ణుప్రియకు ప్లస్ అయ్యాయి. సోనియా ఆకుల-విష్ణుప్రియ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. విష్ణుప్రియపై సోనియా ఆకుల వ్యక్తిగత ఆరోపణలు చేయడం వివాదాస్పదం అయ్యింది. సోనియా ఆకులను నెటిజెన్స్ విపరీతంగా తిట్టిపోస్తున్నారు. ఆమె వరస్ట్ కంటెస్టెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
 

37
Bigg boss telugu 8

Bigg boss telugu 8

గతంలో అత్యంత నెగిటివిటీ మూటగట్టుకున్న శ్రీసత్య, శోభా శెట్టి వంటి లేడీ కంటెస్టెంట్స్ తో సోనియా ఆకులను పోల్చుతున్నారు. విష్ణుప్రియను ఉద్దేశిస్తూ... అడల్ట్స్ జోక్స్ వేస్తావు. సరిగ్గా బట్టలు ధరించడం రాదు. నీ మైండ్ లో అడల్ట్ కంటెంట్ రన్ అవుతూ ఉంటుందని సోనియా ఆకుల అన్నారు. విష్ణుప్రియ ఫ్యామిలీని కూడా  సోనియా వివాదంలోకి లాగింది. 
 

47
Vishnupriya Bhimeneni

Vishnupriya Bhimeneni

విష్ణప్రియకు పేరెంట్స్ లేరన్న అర్థంలో... నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడరు. కానీ నాకు ఫ్యామిలీ ఉంది. వారు నా చర్యలను గమనిస్తారని, అన్నారు. విష్ణుప్రియపై సోనియా చేసిన వ్యక్తిగత ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ మధ్య చర్చ నడిచింది. ఈ పరిణామం సోనియాకు మైనస్, విష్ణుప్రియకు ప్లస్ అయ్యింది. 
 

57

సీజన్ 7లో కూడా ఇదే జరిగింది. సామాన్యుడైన పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి అమర్ దీప్, రతికా రోజ్ నెగిటివ్ అయ్యారు. నామినేషన్స్ లో అమర్ దీప్, రతికా రోజ్ ఘాటైన పదాలతో పల్లవి ప్రశాంత్ ని విమర్శించారు. అది పల్లవి ప్రశాంత్ కి మరింత సింపథీ తెచ్చిపెట్టింది. రతికా రోజ్ 4వ వారమే ఎలిమినేట్ అయ్యింది. అమర్ దీప్ కి పాపులారిటీ ఉన్న నేపథ్యంలో అతడు ఫినాలేకి వెళ్ళాడు. రతికా రోజ్ కి బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

67

పల్లవి ప్రశాంత్ సింపతీ గేమ్ ఆడుతున్నడని నిరూపించే ప్రయత్నంలో...  అమర్ దీప్, రతికా రోజ్ పరోక్షంగా పల్లవి ప్రశాంత్ కి మేలు చేశారు. విష్ణుప్రియ విషయంలో కూడా అదే జరిగింది. మొదటి వారం గేమ్ పరంగా పెద్దగా ప్రభావం చూపని విష్ణుప్రియ గురించి చర్చించుకునేలా సోనియా ఆకుల కామెంట్స్ చేశాయి. విష్ణుప్రియ పట్ల ఆడియన్స్ లో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నామినేషన్స్ లో ఉన్నప్పటికీ విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువే. 

77

సోనియా ఆకుల ఉదంతం నేపథ్యంలో విష్ణుప్రియకు పెద్ద మొత్తంలో ఓట్లు పోల్ కానున్నాయని అంచనా. అలాగే బిగ్ బాస్ హౌస్లో లో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ. ఆమె ఫేమ్ తో పోల్చుకుంటే మిగతా వాళ్లకు తక్కువ ఉంది. సీజన్ 8కి గాను విష్ణుప్రియ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఆమెకు వారానికి రూ. 4 లక్షలు చెల్లిస్తున్నారట.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved