బంగారం లాంటి అవకాశం చేజార్చుకున్న నబీల్, సెకండ్ రన్నరప్ తో సరి
నబీల్ గోల్డెన్ ఆఫర్ చేజార్చుకున్నాడు. సూట్ కేస్ తీసుకోకుండా తప్పు చేశాడు. వట్టి చేతులతో ఎలిమినేటై వెళ్ళిపోయాడు.
నబీల్ అఫ్రిది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న సంగతి తెలిసిందే. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, అవినాష్ మిగతా కంటెస్టెంట్స్. అవినాష్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు. నటుడు ఉపేంద్ర బిగ్ బాస్ హౌస్ నుండి అవినాష్ ని వేదికపైకి తీసుకొచ్చాడు.
అఖండ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ టాప్ 4 కంటెస్టెంట్ ని వేదికపైకి తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. అనంతరం ప్రేరణ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దాంతో ప్రేరణ, ప్రగ్యా జైస్వాల్ వేదిక మీదకు వచ్చారు. నబీల్, గౌతమ్, నిఖిల్.. టాప్ 3 కంటెస్టెంట్స్ గా మిగిలారు.
Bigg boss telugu 8 grand finale
ఈ దశలో నాగార్జున కంటెస్టెంట్స్ కి సూట్ కేస్ ఆఫర్ చేశాడు. ఈ సూట్ కేసులో ఎంత ఉందో తెలియదు, మీ ముగ్గురిలో టైటిల్ కొట్టేది ఒకరే. అలాగే ఒకరు ఎలిమినేట్ కానున్నారు. కాబట్టి సూట్ కేసు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకోవచ్చని నాగార్జున సలహా ఇచ్చాడు. నిఖిల్, గౌతమ్, నబీల్ లను నాగార్జున ఒక్కొక్కరిగా అడిగారు. ఎవరూ ఆఫర్ ని తీసుకోలేదు.
Bigg boss telugu 8
విజయ్ సేతుపతి, మంజు వారియర్ తమ లేటెస్ట్ మూవీ 'విడుదల 2' ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ షోకి వచ్చారు. ఎలిమినేటైన కంటెస్టెంట్ ని వేదిక మీదకు తెచ్చేందుకు వీరిద్దరూ హౌస్లోకి వెళ్లారు. నిఖిల్, గౌతమ్ లను టాప్ టు కంటెస్టెంట్స్ గా నాగార్జున ప్రకటించాడు. నబీల్ ఎలిమినేటైనట్లు వెల్లడించారు. దాంతో నబీల్, విజయ్ సేతుపతి, మంజు వారియర్ వేదిక మీదకు వచ్చారు.
ఎలిమినేటైనందుకు ఎలాంటి బాధ లేదని నబీల్ అన్నారు. అలాగే డబ్బు కోసం షోకి రాలేదని చెప్పారు. తాను చాలా సంతోషంగా ఉన్నానని నబీల్ అన్నారు. విజయ్ సేతుపతి, మంజు వారియర్ బిగ్ బాస్ వేదిక వీడారు. వెళ్లబోయే ముందు విజయ్ సేతుపతి ఒక ముద్దు పెట్టాలని నబీల్ కోరారు. విజయ్ సేతుపతి నబీల్ కి కిస్ ఇచ్చాడు. పరుగున వచ్చిన రోహిణి కూడా తన ముచ్చట తీర్చుకుంది.