MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • సోనియా-విష్ణుప్రియలలో ఎవరు బెస్ట్? ఎవరు వరస్ట్? సోషల్ మీడియాను ఊపేస్తున్న టాపిక్!

సోనియా-విష్ణుప్రియలలో ఎవరు బెస్ట్? ఎవరు వరస్ట్? సోషల్ మీడియాను ఊపేస్తున్న టాపిక్!

నామినేషన్స్  లో కంటెస్టెంట్స్ సోనియా ఆకుల-విష్ణుప్రియల మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. సోషల్ మీడియాలో ఇద్దరిలో ఎవరు బెస్ట్? ఎవరు వరస్ట్? అనే డిస్కషన్ నడుస్తుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 10 2024, 07:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు 8 రెండోవారంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. బెజవాడ బేబక్క గత ఆదివారం ఇంటిని వీడింది. బిగ్ బాస్  తెలుగు 8కి గాను ఎలిమినేటైన ఫస్ట్ కంటెస్టెంట్ బేబక్క. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు సేఫ్ అవుతూ వచ్చారు. చివరికి నాగ మణికంఠ, బేబక్క మిగిలారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నడిచింది. బేబక్క ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బేబక్క నిష్క్రమణ నేపథ్యంలో హౌస్లో  13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని తగు కారణాలు చెప్పి నామినేట్ చేయాలని ఆదేశించాడు. యాష్మి గౌడకు మినహాయింపు లభించింది. ఆమెను ఎవరూ నామినేట్ చెయ్యడానికి వీలు లేదని బిగ్ బాస్ ఆదేశించాడు. 

కాగా సోనియా ఆకుల, విష్ణుప్రియ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మొదట సోనియా ఆకుల... విష్ణుప్రియను నామినేట్ చేసింది. అనంతరం విష్ణుప్రియ తిరిగి సోనియాను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

సోనియా ఆకుల పూర్తిగా విష్ణుప్రియ మీద పర్సనల్ అటాక్ చేసిందని ఆడియన్స్ అభిప్రాయం. విష్ణుప్రియ జోక్స్, డ్రెస్సింగ్, ఫ్యామిలీ అంశాలను లేవనెత్తుతూ సోనియా ఆకుల విమర్శలు చేసింది. నువ్వు అడల్ట్ జోక్స్ వేస్తావు. బట్టలు సరిగా ధరించవు. నీ చేష్టలు అసభ్యకరంగా ఉంటాయి అనే అర్థంలో సోనియా ఆరోపణలు గుప్పించింది. 

నీతో సన్నిహితంగా ఉండే వాళ్ళ మీద మాత్రమే నువ్వు జోక్స్ వేయవు. మిగతా అందరి మీద అడల్ట్ జోక్స్ వేస్తావు. బట్టలు ఎలా ధరించాలో నేర్చుకో. నీ పక్కన నిల్చొనే వ్యక్తి కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. నీ మైండ్ లో ఎప్పుడూ అడల్ట్రీ కంటెంట్ రన్ అవుతుందంటూ... విష్ణుప్రియని ఉద్దేశిస్తూ కఠినంగా సోనియా మాట్లాడింది. 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

అలాగే విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదన్న విషయాన్ని కూడా ఆమె లేవనెత్తింది. నువ్వు హౌస్లో ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడదు. కానీ నా ఫ్యామిలీ చూస్తుందంటూ.. విష్ణుప్రియకు అమ్మానాన్న లేరన్న విషయాన్ని ఆమె లేవనెత్తింది. దాంతో విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యింది. అయినప్పటికీ సోనియా పై విష్ణుప్రియ పర్సనల్ కామెంట్స్ చేయలేదు. 

 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

సోనియా-విష్ణుప్రియ వాగ్వాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో వాదోపవాదాలు మొదలయ్యాయి. విష్ణుప్రియ ఈ సందర్భాన్ని సింపతీగా మలచుకునే ప్రయత్నం చేసిందని కొందరు నెటిజెన్స్, సోనియా ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. విష్ణుప్రియ ఫ్యాన్స్ మాత్రం సోనియా వరస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. 

 

66

సోనియా తీవ్ర స్థాయిలో పర్సనల్ అటాక్ చేసినా... విష్ణుప్రియ టెంపర్ కోల్పోలేదు. తన పాయింట్ సూటిగా చెప్పిందని ఆమెను సమర్థిస్తున్నారు. మరోవైపు సోనియా ఆకుల మీద నెగిటివిటీ నడుస్తుంది. ఆమె గేమ్, మాట తీరు పై విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ కావాలంటే సోనియా వంటి కంటెస్టెంట్ అవసరం అంటున్నారు.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved