MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • టాప్ సెలబ్స్ కి షాక్ ఇస్తూ టైటిల్ రేసులో దూసుకొచ్చిన సామాన్యుడు! నిఖిల్ కి గట్టి పోటీ

టాప్ సెలబ్స్ కి షాక్ ఇస్తూ టైటిల్ రేసులో దూసుకొచ్చిన సామాన్యుడు! నిఖిల్ కి గట్టి పోటీ

ప్రస్తుతానికి టైటిల్ రేసులో నిఖిల్ ఉన్నాడు. అతడికి పోటీ ఇస్తున్నాడు ఓ సామాన్యుడు. సోషల్ మీడియాలో ఆ కంటెస్టెంట్ కి ఆదరణ పెరుగుతుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 23 2024, 07:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మూడు వారాలు పూర్తి చేసుకుంది. ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. 14 మందితో లేటెస్ట్ సీజన్ లాంచ్ చేశారు. పెద్దగా పేరున్న సెలెబ్స్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో లేరు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, అభయ్ నవీన్ వంటి ఒకరిద్దరు పాప్యులర్ సెలెబ్స్ హౌస్లో అడుగుపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

మెజారిటీ కంటెస్టెంట్స్ సీరియల్ నటులు ఉన్నారు. అనూహ్యంగా ఈ సీజన్లో నలుగురు కన్నడ నటులు పార్టిసిపేట్ చేస్తున్నారు. యష్మి, ప్రేరణ, నిఖిల్ తో పాటు పృథ్విరాజ్ కర్ణాటకకు చెందిన సీరియల్ నటులు. వీరందరూ స్టార్ మాలో పని చేశారు. 

ఇక మొదటి వారం సోషల్ మీడియా స్టార్ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. అనంతరం శేఖర్ బాషా ఇంటిని వీడాడు. ఇతడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. శేఖర్ బాషా ఎలిమినేషన్ ఊహించనిది. అనూహ్యంగా తోటి కంటెస్టెంట్స్ శేఖర్ బాషాను ఇంటికి పంపారు. శేఖర్ బాషా ఇటీవల ప్రసవించిన నేపథ్యంలో హౌస్ మేట్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ ఇంటిని వీడిన మూడో కంటెస్టెంట్ అభయ్ నవీన్. ఇతడు సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు. నిఖిల్, అభయ్ క్లాన్స్ చీఫ్స్ గా ఉన్నారు. వీరిద్దరూ చర్చించుకుని ఒకరు నామినేట్ కావాలని బిగ్ బాస్ ఆదేశించాడు. గత రెండు వారాలు నిఖిల్ నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి, నేను నామినేట్ అవుతానని అభయ్ నిర్ణయం తీసుకున్నాడు. 

అభయ్ బిగ్ బాస్ పై చేసిన అనుచిత కామెంట్స్ పై నాగార్జున ఫైర్ అయ్యాడు. రెడ్ కార్డు ఇచ్చి వెంటనే బయటకు పో అన్నాడు. అనంతరం క్షమించాడు. అయితే ప్రేక్షకులే అభయ్ నవీన్ ని ఇంటికి పంపారు. పృథ్విరాజ్, అభయ్ డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిద్దరిలో తక్కువ ఓట్లు వచ్చిన అభయ్ నవీన్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలిపారు. 
 

46

ఇక గత మూడు వారాల గేమ్ గమనిస్తే నిఖిల్ టైటిల్ రేసులో ముందున్నాడు. అతడు టాస్క్ లలో సత్తా చాటుతున్నాడు. చీఫ్ కంటెండర్ అయ్యాడు. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చితే నిఖిల్ మెరుగైన ఆట కనబరుస్తున్నాడు. కాగా నిఖిల్ కి ఒక సామాన్యుడు పోటీ ఇస్తున్నాడు. సోషల్ మీడియా సెలెబ్ నబీల్ కి ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అతడి గేమ్ పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 

నబీల్ అఫ్రిది పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. అలాగే ఈ సోషల్ మీడియా స్టార్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు తెలిసింది కూడా తక్కువే. అయితే తన గేమ్ తో నబీల్ ఆకట్టుకుంటున్నాడు. సంచాలక్ గా సక్సెస్ అయ్యాడు. మూడో వారం నామినేషన్స్ లో నబీల్ వ్యాలిడ్ పాయింట్స్ తో హౌస్ మేట్స్ ని నామినేట్ చేశాడట. 

56
Nabeel Afridi Bigg Boss8

Nabeel Afridi Bigg Boss8

సోషల్ మీడియా జనాల కామెంట్స్ పరిశీలిస్తే నబీల్ కి ఆదరణ పెరుగుతుంది. మెల్లగా అతడు టైటిల్ రేసులోకి వస్తున్నాడు. అయితే అప్పుడే ఒక అంచనాకు రాలేము. షో మొదలై మూడు వారాలు మాత్రమే గడుస్తుంది. ఇంకా 12 వారాల సమయం ఉంది. బిగ్ బాస్ హౌస్లో సమీకరణాలు ఎప్పుడు? ఎలా మారిపోతాయో? చెప్పలేం.

66

ప్రస్తుతం హౌస్లో 11 మంది ఉన్నారు. 5వ వారం మినీ లాంచ్ ఈవెంట్ ఉంటుందని సమాచారం. సీజన్ 7 నుండి ఈ విధానం అమలులోకి తెచ్చారు. మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి వైల్డ్ కార్డ్ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపుతున్నారు. గత సీజన్లో అర్జున్ అంబటి, నయని పావని, పూజ, భోలే, అశ్విని శ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. 

ఈసారి అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి వస్తున్నారని టాక్. జబర్దస్త్ అవినాష్, నటి హరితేజ, రోహిణి ఈ లిస్ట్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. రెండు వారాల్లో దీనిపై క్లారిటీ రానుంది. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు
Recommended image2
Rohit Re Entry: బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ నాయుడు రీ ఎంట్రీ..? అభిజిత్ ట్వీట్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి?
Recommended image3
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved