- Home
- Entertainment
- TV
- బిగ్ బాస్ తెలుగు 9 లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన కంటెస్టెంట్ ఎవరో తెలుసా? షాక్ అవుతారు?
బిగ్ బాస్ తెలుగు 9 లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన కంటెస్టెంట్ ఎవరో తెలుసా? షాక్ అవుతారు?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఒకరు ఉన్నారని మీకు తెలుసా? వరల్డ్ రికార్డు ఉన్నా కూడా.. కామ్ గా చెప్పకుండా ఉన్న ఆ కంటెస్టెంట్ ఎవరు? ఇంతకీ ఏ విభాగంలో వారికి వరల్డ్ రికార్డు వచ్చిందంటే?

రసవత్తరంగా బిగ్ బాస్ తెలుగు 9
ప్రస్తుతం బిగ్ బాస్ 9 ఎంతో ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ మొదట్లో కాస్త బోరనిపించినా.. ఆ బోర్ కొట్టించే కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసి, పంపించేయడంతో.. ప్రస్తుతం బిగ్ బాస్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. వైల్డ్ కార్డులు వచ్చిన తరువాత ఆట ఇంకాస్త రసవత్తరంగా మారిపోయింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు ఆడియన్స్ కు బాగా ఎక్కువగా కనెక్ట్ అయిన వారే ఉన్నారు. అటువంటి వారిలో సంజన కూడా ఒకరు.
అందరి దృష్టిని ఆకర్షించిన సంజన
బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నుంచి కొంత మంది కంటెస్టెంట్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. అలా అయిన వారిలో ఒకరు సంజన. ప్రారంభంలో కొంతమంది ఆమెను నెగటివ్‌గా భావించినా, గేమ్‌లో తన ప్రదర్శనతో “గేమర్ సంజన”గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది.మొదటి రెండు వారాల్లోనే సంజన క్రియేట్ చేసుకున్న ఫ్యాన్‌బేస్ వల్ల.. ఇప్పటికీ.. ప్రతీ వారం నామినేట్ అవుతున్నా.. ఎలిమినేషన్ నుంచి మాత్రం సేఫ్‌గా బయటపడుతూ ముందుకు సాగుతోంది. టాస్క్‌ల విషయంలో తన శక్తినంతా ఉపయోగిస్తూ, గేమ్‌లో అద్భుతమైన ఫైటర్‌గా నిలుస్తోంది. ఈ వారం కూడా నామినేషన్‌లో ఉన్నప్పటికీ, ఆమె సేఫ్ అవుతుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉంది.
సంజన కు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
ఇదంతా పక్కన పెడితే, సంజన కు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉందని మీకు తెలుసా? ఈ విషయం బయట చెప్పకుండా. .హౌస్ ల్ సింపుల్ గా తన పని తాను చేసుకుపోతోంది సంజన. ఇక సంజన గురించిన ఈ విషయం సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. 2015లో ఆమె 104 గంటలు నిరవధికంగా సైక్లింగ్ చేస్తూ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంపాదించింది. ఈ అద్భుతమైన ఫీట్ గురించి ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్‌లో ఎవరికి తెలియదు.హౌస్‌లో కొంతమంది ఆమెను టాస్కుల్లో సీరియస్‌గా తీసుకోకుండా.. అసలు టాస్క్ లలో, అవకాశాలు ఇవ్వకుండా సైడ్ చేస్తున్నారు. కానీ సంజనాకు అవకాశం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వారికి తెలియదు. ఆమె లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని తెలిస్తే మాత్రం కథ వేరే ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్.
నటిగా మంచి గుర్తుంపు పొందిన సంజన
బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందే సంజన మంచి నటిగా గుర్తింపు సాధించింది. 2008లో విడుదలైన ‘బుజ్జిగాడు’ సినిమాలో త్రిష చెల్లెలు పాత్రలో నటించింది సంజన. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో సంజన నటనకు మంచి గుర్తింపే వచ్చింది. అయితే ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఆమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో టాలీవుడ్ వదిలి కన్నడ సినీ పరిశ్రమలోనే సెటిల్ అయ్యింది బ్యూటీ. అక్కడ మాత్రం వరుస సినిమాలు చేసి మంచి పేరు సంపాదించింది.అంతే కాకుండా సంజన కన్నడ బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే అక్కడ ఆమె కేవలం రెండు వారాలు మాత్రమే హౌస్‌లో కొనసాగింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ 9లో మాత్రం గేమ్స్ అద్భుతంగా ఆడుతూ.. పక్కా ప్లానింగ్ తో.. పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది.