MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆదిత్య ఓం ఎంత తీసుకున్నాడో తెలుసు?

మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆదిత్య ఓం ఎంత తీసుకున్నాడో తెలుసు?

నామినేషన్స్ లో ఉన్న నటుడు ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అతడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో చూద్దాం  

3 Min read
Author : Sambi Reddy
Published : Oct 04 2024, 10:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలో అడుగుపెట్టింది. 14మంది సెలెబ్స్ తో మొదలైన షోలో ప్రస్తుతం పది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. మొదటి వారం సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. వరుసగా శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఇంటి బాట పట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

సోనియా గత వారం ఎలిమినేటైన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యంత నెగిటివిటీ నడిచింది. మేల్ కంటెస్టెంట్స్ తో సోనియా ప్రవర్తన విమర్శలపాలైంది. తోటి కంటెస్టెంట్స్ పై ఆమె చేసిన కామెంట్స్, యాటిట్యూడ్ ఆడియన్స్ కి నచ్చలేదు. ఈ క్రమంలో సోనియాకు ఓట్లు పడలేదు. సోనియా తిరిగి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. 


ఆదివారం సోనియా ఎలిమినేట్ కాగా... సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. తగు కారణాలు చెప్పి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ఫోటోను మంటల్లో కాల్చి వేయాలి. ఎప్పటిలానే కంటెస్టెంట్స్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు ఫైర్ అయ్యారు. 

36

ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం విష్ణుప్రియ, నిఖిల్, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, నైనిక, నబీల్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఓటింగ్ లైన్స్ శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓపెన్ గా ఉంటాయి. 

అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ తో పాటు ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని నాగార్జున చెప్పారు. మరి నామినేషన్స్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారా లేక ఒక్కరే ఈ వారం బయటకు వెళతారా అనేది తెలియాల్సి ఉంది. 

46

ఈ సీజన్ కి బిగ్ బాస్ హౌస్లో ఉన్న టాప్ సెలెబ్ ఎవరంటే విష్ణుప్రియ అని చెప్పొచ్చు. ఆమెను మినహాయిస్తే... కనీసం ఫేమ్ ఉన్న సెలెబ్స్ హౌస్లో లేరు. ఆదిత్య ఓం ఒకప్పటి హీరో. ఈ జనరేషన్ యూత్ కి ఆదిత్య ఓం గురించి తెలిసింది తక్కువే. అభయ్ నవీన్ సైతం ఫేమ్ ఉన్న నటుడు కాదు. ప్రేరణ, యష్మి. నిఖిల్, పృథ్విరాజ్.. పాపులారిటీ లేని సీరియల్ నటులు. 

విష్ణుప్రియ ఏమాత్రం పెర్ఫార్మన్స్ ఇచ్చినా.. టైటిల్ ఎగరేసుకుపోవచ్చు. అయితే విష్ణప్రియ గేమ్ టైటిల్ కొట్టే స్థాయిలో లేదు. ఆమె ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఆడియన్స్ విష్ణుప్రియ గేమ్ పట్ల సంతృప్తిగా లేరని తాజా ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. అనూహ్యంగా ఆమెకు తక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయట. 

56
Aditya om Bigg Boss8

Aditya om Bigg Boss8


విష్ణుప్రియతో పోల్చుకుంటే నబీల్ ఒక సామాన్యుడు. అతడికి సోషల్ మీడియాలో ఓ మోస్తరు పాపులారిటీ ఉంది. బుల్లితెర ఆడియన్స్ కి నబీల్ ఎవరో తెలియదు. కేవలం తన ఆట తీరుతో నబీల్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడట. నిఖిల్ ని కూడా వెనక్కి నెట్టి టాప్ లో ట్రెండ్ అవుతున్నాడట. నబీల్ తర్వాత నిఖిల్ కి ఓట్లు పడుతున్నాయట. అతడు రెండో స్థానంలో ఉన్నాడట. 


గతంలో నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి విష్ణుప్రియ టాప్ లో ట్రెండ్ అయ్యింది. 40 శాతానికి పైగా ఓట్లు ఆమె ఒక్కదానికే పోల్ అయ్యేవి. ఈసారి ఆమె మూడో స్థానానికి పడిపోయిందట. నబీల్, నిఖిల్ తర్వాత విష్ణుప్రియకు ఓట్లు పడుతున్నాయట. ఇది ఊహించని పరిణామమే అని చెప్పొచ్చు. 

విష్ణుప్రియ పై నెగిటివిటీ రావడానికి ప్రేరణతో గొడవలు కూడా కారణం. వీరిద్దరూ దారుణమైన పదజాలంతో ఒకరినొకరు దూషించుకున్నారు. నాగార్జున ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. క్లాస్ పీకాడు. ఈ గొడవల అనంతరం విష్ణుప్రియపై ప్రేక్షకుల అభిప్రాయం మారి ఉండొచ్చు. అందుకే ఆమెకు తక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. 
 

66
Aditya om

Aditya om


నబీల్, నిఖిల్, విష్ణుప్రియ.. మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారట. ఇక నాలుగో స్థానంలో మణికంఠ ఉన్నాడట. మణికంఠకు ఆడియన్స్ లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ప్రతిసారి నామినేట్ అవుతున్నప్పటికీ ఆడియన్స్ ఓట్లు వేసి సేవ్ చేస్తున్నారు. 

కాగా ఆదిత్య ఓం, నైనిక చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. వీరిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కాగా నాలుగు వారాలు ఆదిత్యం ఓం హౌస్లో ఉన్నాడు. వారానికి రూ. 3 లక్షల రెమ్యూనరేషన్ ఒప్పందం పై అతడు హౌస్లో అడుగుపెట్టాడట. ఆ లెక్కన రూ. 12 లక్షలు ఆయన  తీసుకున్నారట. ఆయన ఉన్న ఇప్పటి ఫార్మ్ కి అదే ఎక్కువ అటుంటున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved