- Home
- Entertainment
- TV
- హీరోగా పల్లవి ప్రశాంత్... ఇక సిల్వర్ స్క్రీన్ పై దున్నుడే! డిటైల్స్ లీక్ చేసిన ఆ కంటెస్టెంట్
హీరోగా పల్లవి ప్రశాంత్... ఇక సిల్వర్ స్క్రీన్ పై దున్నుడే! డిటైల్స్ లీక్ చేసిన ఆ కంటెస్టెంట్
తెలుగు రాష్ట్రాల్లో పల్లవి ప్రశాంత్ సెన్సేషన్ గా అవతరించాడు. బుల్లితెర మీద సంచలనాలు చేసిన రైతుబిడ్డ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయనున్నాడనే న్యూస్ మరో కంటెస్టెంట్ లీక్ చేశాడు.

Pallavi Prashanth
సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి పల్లవి ప్రశాంత్ జర్నీ నిదర్శనం. పల్లవి ప్రశాంత్ ఒక మామూలు పల్లెటూరు యువకుడు. తన సొంత ఊరిలో కూడా అందరికి తెలిసి ఉండడు. ఏదో సాధించాలనే తపనతో వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. విమర్శించినా, జనాలు నవ్వినా, వద్దని హెచ్చరించినా వినకుండా రీల్స్ చేసి ఫేమస్ అయ్యాడు.
Pallavi Prashanth
సోషల్ మీడియా ద్వారా ఫేమ్ రాబట్టిన పల్లవి ప్రశాంత్... ఎలాగైనా బిగ్ బాస్ షోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. ఆ షో అంటే తనకు ఇష్టం. మనం కూడా ఒక కంటెస్టెంట్ గా వెళ్లాలని చేయని ప్రయత్నం లేదు. ఫలితంగా బిగ్ బాస్ సీజన్ 7 లో ఛాన్స్ లభించింది.
Pallavi Prashanth
ఎలాంటి అంచనాలు లేకుండా రైతుబిడ్డ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. మొదటివారం పల్లవి ప్రశాంత్ పై జనాల్లో ఎలాంటి అంచనాలు లేవు. అతన్ని ఒక సాధారణ కంటెస్టెంట్ గానే చూశారు. అమర్ దీప్ టార్గెట్ చేశాక... పల్లవి ప్రశాంత్ పై సింపథీ పెరిగింది. టైటిల్ రేసులో ఉన్న అమర్ నెగిటివ్ అయ్యాడు.
జనాల్లో తనపై ఉన్న సింపథీని అభిమానంగా మార్చుకున్నాడు పల్లవి ప్రశాంత్. మంచి ప్రవర్తనతో టాస్క్ లలో రాణిస్తూ... టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి సెలెబ్రిటీ అయ్యాడు. అంచనాలు తలక్రిందులు చేస్తూ టైటిల్ విన్నర్ అయ్యాడు.
అయితే పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన ఫ్యాన్స్ అత్యుత్సాహం జైలుపాలు అయ్యేలా చేసింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పబ్లిక్, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్ పోలీసుల మాట పెడచెవిన పెట్టి ర్యాలీ చేసి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు. అరెస్టై రిమాండ్ కి వెళ్లిన పల్లవి ప్రశాంత్, బెయిల్ పై విడుదలయ్యాడు.
కాగా పల్లవి ప్రశాంత్ కి సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. అతడు ఓకే అంటే హీరోగా చిత్రాలు నిర్మించడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారన్న విషయం భోలే షావలి బయటపెట్టాడు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న భోలే... హౌస్లో ఉన్నప్పుడే పల్లవి ప్రశాంత్ కి సినిమా ఆఫర్స్ వచ్చాయి. బయటకు రాగానే ఇదే విషయం చెప్పాలి అనుకున్నాను.
అనూహ్యంగా అతడు అరెస్ట్ అయ్యాడు. రైతుబిడ్డ హీరోగా పాట బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా చేయమని అడుగుతున్నారు. అయితే అది పల్లవి ప్రశాంత్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అతడు అవును అంటే... త్వరలో సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తాడన్న షాకింగ్ మేటర్ లీక్ చేశాడు. భోలే షావలి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.