Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • TV
  • Pallavi Prashanth: త్వరలో రైతుబిడ్డ పెళ్లి... అమ్మాయి ఎవరంటే?

Pallavi Prashanth: త్వరలో రైతుబిడ్డ పెళ్లి... అమ్మాయి ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి త్వరలో పెళ్లి అని తెలుస్తుంది. సోషల్ మీడియాను ఈ న్యూస్ షేక్ చేస్తుంది. పేరెంట్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారట.   

Sambi Reddy | Updated : Dec 18 2023, 02:44 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తి. ఒక బిగ్ బాస్ విన్నర్ గురించి ఇంత గొప్పగా చెప్పాలా? అంటే... చెప్పడంలో తప్పులేదు. కోట్ల మంది అభిమానించే ఆ షోలో పాల్గొనే ఛాన్స్ అందరికీ రాదు. అందులోనూ టైటిల్ గెలవడం గొప్ప విషయం. పల్లవి ప్రశాంత్ అంటే కూడా ఎవరో తెలియదు అతడు ఇగ్గ బాస్ హౌస్లో అడుపెట్టే నాటికి. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ కైవశం చేసుకున్నాడు. 

 

26
Asianet Image

బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అతడు పెరిగిన వాతావరణానికి బిగ్ బాస్ వేరే ప్రపంచం వంటిది. కొత్త మనుషులు, అది కూడా సెలెబ్రిటీలతో కలిసి పోయి, యుద్ధం చేసి విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రశాంత్ అవమానాలు కూడా ఎదుర్కున్నాడు. ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలని చూసినా వెనకాడలేదు. టైటిల్ కొట్టి విమర్శించిన వాళ్ళ నోళ్లు మూయించాడు. 

36
Asianet Image

బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారట. త్వరలో పల్లవి ప్రశాంత్ ఓ ఇంటివాడు కానున్నాడట. 
 

46
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

గతంలో పల్లవి ప్రశాంత్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తమకు 60 ఎకరాల పొలం, బంగ్లా, నాలుగు కార్లు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అబద్దాలు. అంత సంపద ఉంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్కి వెళ్లాల్సిన పనిలేదని ఆయన చెప్పారు. 

56
Asianet Image

పల్లవి ప్రశాంత్ చాలా మంచోడు. అందరినీ గౌరవిస్తాడు. వాడిని కొందరు అరేయ్ ఒరేయ్ అంటుంటే నచ్చడం లేదు. రైతు అంటే అందరికీ లోకువే. తక్కువ భావనతో చూస్తారు. అమ్మాయిలను అక్క అనిపిలుస్తాడు. వాడి మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం ఉండదు అన్నాడు. 

 

66
Asianet Image

పల్లవి ప్రశాంత్ హౌస్ నుండి బయటకు రాగానే పెళ్లి చేస్తాము అని అన్నాడు. గతంలో పల్లవి ప్రశాంత్ తండ్రి కొడుకు పెళ్లిపై క్లారిటీ  ఇచ్చాడు. ఈ క్రమంలో త్వరలో పల్లవి ప్రశాంత్ పెళ్లి అంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి. మరి అమ్మాయి ఎవరు? ఏంటనేది తెలియాల్సి ఉంది. సంబంధాలు చూసే పనిలో ఉన్నారట. మనోడు క్రేజ్ చూసి పెళ్లి చేసుకుంటాను అంటే ఎగిరి గంతేయడం ఖాయం. పేరెంట్స్ నిర్ణయం ప్రకారం పల్లవి ప్రశాంత్ వెంటనే పెళ్లి చేసుకంటాడా లేక కెరీర్ పై ఫోకస్ పెడతాడా అనేది చూడాలి.... 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories