- Home
- Entertainment
- TV
- చిరంజీవిని ఇంప్రెస్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతని కోసం రోజూ చూసేవాడట!
చిరంజీవిని ఇంప్రెస్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతని కోసం రోజూ చూసేవాడట!
బిగ్ బాస్ తెలుగు 7 ఇటీవల గ్రాండ్ గా ముగిసింది. కాగా మెగాస్టార్ చిరంజీవి సైతం బిగ్ బాస్ షో చూసేవారట. ప్రత్యేకంగా ఒక కంటెస్టెంట్ గేమ్ నచ్చిన చిరంజీవి సతీసమేతంగా షో ఎంజాయ్ చేసేవారట.

Bigg Boss Telugu 7
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. డిసెంబర్ 17న షో ముగిసింది. అమర్ దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్ అంబటి ఫైనల్ కి వెళ్లారు. అర్జున్ అంబటికి 6వ స్థానం దక్కింది. ప్రియాంక 5వ స్థానం పొందింది.
Bigg Boss Telugu 7
ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకుని రేసు నుండి తప్పుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యావర్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు డబ్బు తీసుకుని రేసు నుండి తప్పుకున్నాడు. ఇక టైటిల్ రేసులో అమర్ దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్ మిగిలారు.
Bigg Boss Telugu Season 7
మొదటి నుండి వీరిలో ఒకరికి టైటిల్ అని ప్రచారం అయ్యింది. అనుకున్నట్లే టాప్ 3లో శివాజీ, అమర్, ప్రశాంత్ ఉన్నారు. శివాజీకి 3వ స్థానం దక్కగా.. అమర్ రన్నర్, ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. మొదటిసారి ఒక కామనర్ టైటిల్ విన్నర్ అయ్యాడు.
Bigg Boss Telugu 7
ఇక ఈ షో సామాన్యులనే కాకుండా సెలెబ్రిటీలను కూడా విపరీతంగా ఆకర్షిస్తుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కూడా బిగ్ బాస్ షోని ఫాలో అవుతారట. చిరంజీవి, సురేఖ బిగ్ బాస్ షో మిస్ అవ్వరట. ఈ విషయాన్ని శివాజీ స్వయంగా వెల్లడించాడు.
వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న శివాజీ మాట్లాడుతూ... నేను నటించిన వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఓ ఈవెంట్ కి హాజరయ్యాను. అక్కడ చిరంజీవి అన్నయ్య ఉన్నారు. నేను పలకరించాను.
అప్పుడు చిరంజీవి అన్నయ్య... నీ కోసం నేను సురేఖ రోజూ బిగ్ బాస్ షో చూసేవాళ్ళం. చాలా బాగా అడావు, అన్నారు. ఏంటన్నయ్యా... నా కోసం మీరు బిగ్ బాస్ షో చూశారా? అని ఆశ్చర్యంగా అడిగాను. అవును... అని చిరంజీవి సమాధానం చెప్పారు, అని శివాజీ చెప్పుకొచ్చాడు.