- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 7: ఎవిక్షన్ పాస్ గెలిచి ఇరుకునపడ్డ పల్లవి ప్రశాంత్... నెక్స్ట్ ఏం జరగనుంది!
Bigg Boss Telugu 7: ఎవిక్షన్ పాస్ గెలిచి ఇరుకునపడ్డ పల్లవి ప్రశాంత్... నెక్స్ట్ ఏం జరగనుంది!
ఎవిక్షన్ పాస్ విషయంలో హౌస్లో అనేక ట్విస్ట్స్ చోటు చేసుకున్నాయి. చివరికి అది పల్లవి ప్రశాంత్ చేతికి చిక్కింది. కష్టపడి ఫిజికల్ టాస్క్ లో గెలిచి ఎవిక్షన్ పాస్ అందుకున్నాడు.

Bigg Boss Telugu 7
ప్రతి సీజన్ లో బిగ్ బాస్ ఎవిక్షన్ పాస్ ఇస్తాడు. కంటెస్టెంట్స్ లో ఒకరు దాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది. గెలిచిన కంటెస్టెంట్ దాన్ని ఎలిమినేషన్ లో వాడుకోవచ్చు. లేదంటే ఎలిమినేట్ అవుతారనుకున్న మరొక కంటెస్టెంట్ ని సేవ్ చేయవచ్చు.
Bigg Boss Telugu 7
ఈ వారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ తో పాటు అతడు ప్రేమించే శివాజీ, యావర్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ ఎవరికైనా వాడుతాడా లేదా? అండ్ సందేహాలు కలుగుతున్నాయి. పల్లవి ప్రశాంత్ కి ఉన్న ఫాలోయింగ్ రీత్యా అతడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఫైనల్ బెర్త్ ఖాయం.
Bigg Boss Telugu 7
కాబట్టి ఎవిక్షన్ పాస్ తనకు ఇష్టమైన వాళ్లకు ఉపయోగించే అవకాశాలే ఎక్కువ. పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ గెలిచిన వెంటనే తన ఫ్రెండ్స్ యావర్, శివాజీ మెదళ్లలో సందేహాలు మొదలయ్యాయి. యావర్ అయితే ఓపెన్ గా చెప్పేశాడు. శివాజీ కోసం వాడితే వాడు, నాకు మాత్రం నీ ఎవిక్షన్ పాస్ ఉపయోగించకు అని అన్నాడు.
Bigg Boss Telugu 7
నిజానికి యావర్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. అది గెలిచేందుకు యావర్ ఫౌల్ గేమ్ ఆడాడు అని తేలింది. ఈ విషయం నాగార్జున వీడియోలతో సహా బయటపెట్టాడు. దాంతో యావర్ తాను గెలుచుకున్న ఎవిక్షన్ పాస్ త్యజించాడు. మరలా ఫ్రెష్ గా పెట్టిన పోటీలో 10 మంది పోటీపడ్డారు. పల్లవి ప్రశాంత్ గెలిచి ఎవిక్షన్ పాస్ అందుకున్నాడు.
Bigg Boss Telugu 7
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది. పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ వాడాల్సి వస్తుందేమో అనే సందేహాలు ఉన్నాయి. చూడాలి మరి రైతు బిడ్డను బిగ్ బాస్ ఎలా ఇరుకున పెట్టనున్నాడో. ఈ పాస్ గెలిచేందుకు పల్లవి ప్రశాంత్ గేమ్ ఆడిన తీరు అద్భుతం. ఓర్పు, దృష్టి పెట్టి గేమ్ గెలిచాడు.
Bigg Boss Telugu 7: టైటిల్ ఫేవరేట్స్ శివాజీ, ప్రశాంత్ లకు ఊహించని దెబ్బ, ఆ ఇద్దరు ఎలిమినేట్!