- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 7: మూడు రోజుల్లో ఫైనల్ అనగా ఆగిపోయిన షో... నిరాశలో బిగ్ బాస్ ఫ్యాన్స్!
Bigg Boss Telugu 7: మూడు రోజుల్లో ఫైనల్ అనగా ఆగిపోయిన షో... నిరాశలో బిగ్ బాస్ ఫ్యాన్స్!
బిగ్ బాస్ షోని పిచ్చగా చూసేస్తున్నారు ఫ్యాన్స్. కొందరైతే హాట్ స్టార్ లో రోజంతా లైవ్ స్ట్రీమింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. ఎపిసోడ్ అంటే జనాలు టీవీ అతుక్కుపోతున్నారు. గతంలో ఓ సెక్షన్ ఆడియన్స్ బిగ్ బాస్ షోని ఇష్టపడేవాళ్లు కాదు. మెల్లగా వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. వయసులో పెద్దవాళ్ళు కూడా రోజూ బిగ్ బాస్ షోని ఎంజాయ్ చేస్తున్నారు. తమ ఫేవరెట్ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు.
Bigg Boss Telugu 7
ఇక టైటిల్ రేసులో ముగ్గురు ఉన్నారు. ప్రశాంత్, అమర్, శివాజీ పోటీపడుతున్నట్లు సమాచారం. అనధికారిక ఓటింగ్ పరిశీలిస్తే పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. అతనికి యాభై శాతం ఓట్లు పోల్ అవుతున్నాయి. నెక్స్ట్ పొజీషన్ కోసం అమర్, శివాజీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. టైటిల్ విన్నర్ ఎవరనే ఉత్కంఠ ఆడియన్స్ లో ఉంది.
Bigg Boss Telugu 7
అయితే సడన్ గా హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. ఫైనల్ మరో మూడు రోజులనగా లైవ్ ఎందుకు ఆపేశారనే సందేహాలు మొదలయ్యాయి. సాధారణంగా శని, ఆదివారాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉండదు. ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందుగానే లీక్ కాకుండా వీకెండ్ ఎపిసోడ్స్ లైవ్ లో చూపించరు. అయితే నేడు గురువారం కాగా రెండు రోజుల ముందే ఆపేశారు.
Bigg Boss Telugu 7
సీజన్ 6లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కి ముందు లైవ్ స్ట్రీమింగ్ ఆపేశారు. అప్పుడు ఫైనలిస్ట్స్ ని ప్రకటించలేదు. శ్రీసత్య ఎలిమినేట్ అయ్యాక రేవంత్, శ్రీహాన్, కీర్తి, రోహిత్, ఆదిరెడ్డిలను ఫైనలిస్ట్స్ గా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఈ సీజన్లో శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్ లను ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు.
Bigg Boss Telugu 7
వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అర్జున్ ని ఎలిమినేట్ చేయాలనేది బిగ్ బాస్ ప్లాన్ గా తెలుస్తుంది. అతడు ఫినాలే టికెట్ గెలిచి నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. అందుకే ఆరుగురిని బిగ్ బాస్ ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు. లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అలా అని ఖచ్చితంగా చెప్పలేం అంటున్నారు.
కారణం ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోవడంతో బిగ్ బాస్ లవర్స్ నిరాశకు గురవుతున్నారు. అంటే మరో గురువారం ఎపిసోడ్తో పాటు మరో మూడు ఎపిసోడ్స్ తో బిగ్ బాస్ తెలుగు 7 షోకి తెరపడుతుంది. మరో ఏడాది వరకు వేచి చూడాల్సి ఉంటుంది. సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఉండే ఆస్కారం కలదు.