- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 7: లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్స్: వెనకబడ్డ టైటిల్ ఫెవరేట్, టాప్ లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 7: లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్స్: వెనకబడ్డ టైటిల్ ఫెవరేట్, టాప్ లో ఎవరున్నారంటే?
బిగ్ బాస్ తెలుగు 7 ఓటింగ్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పలు మీడియా సంస్థల సర్వేలను పరిశీలిస్తే ఫైట్ ఆసక్తికరంగా ఉందని తెలుస్తుంది.

Bigg Boss Telugu 7
బిగ్ బాస్ రియాలిటీ షోలో తెలుగు ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. సీజన్స్ పెరిగేకొద్దీ ఆదరణ మరింత పెరుగుతుంది. ఒకప్పుడు పెద్దవాళ్లకు బిగ్ బాస్ షో ఎక్కేది కాదు. చూసే కొద్దీ అందులోని మజా తెలిసి వచ్చింది. సీరియల్స్ ఆడియన్స్ కూడా బిగ్ బాస్ షోని వదిలిపెట్టకుండా చూస్తున్నారు.
Bigg Boss Telugu 7
ఇక సీజన్ 7 అతిపెద్ద హిట్. విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. షోని కొత్తగా డిజైన్ చేశారు. నాగార్జున హోస్టింగ్ బాగుంది. కంటెస్టెంట్స్ కూడా నువ్వా నేనా అంటూ పోటీపడ్డారు. ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు. కాగా మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 7 ముగియ నుండి. టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ జరుగుతుంది.
Bigg Boss Telugu 7
పలు మీడియా సంస్థల సర్వే ఆధారంగా ఫలితాలు చూస్తే ఆశ్చర్య పరుస్తున్నాయి. కారణం టైటిల్ ఫేవరేట్ అనుకున్నవారు కిందపడిపోయారు. ఇక ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే... పల్లవి ప్రశాంత్ టాప్ లో దూసుకుపోతున్నాడు. అతనికి 40-50 శాతం ఓట్లు పోల్ అవుతున్నాయి.
Bigg Boss Telugu 7
మొదట్లో పల్లవి ప్రశాంత్ టైటిల్ రేసులో లేడు. శివాజీ పేరు వినిపించింది. తర్వాత వారాల్లో ప్రశాంత్ తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. టాస్క్స్ లలో అదరగొట్టిన ప్రశాంత్ హౌస్ కి మొదటి కెప్టెన్ అయ్యాడు. పవర్ అస్త్ర, అవిక్షన్ పాస్ కూడా గెలిచాడు. శివాజీ, యావర్ తో అత్యంత సన్నిహితంగా ఉండే ప్రశాంత్ మిగతా కంటెస్టెంట్స్ ని కూడా గౌరవించేవాడు.
Bigg Boss Telugu 7
మాటతీరుతో కూడా మెప్పించిన ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. ఒక రెండో స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. అమర్ దీప్ సీరియల్ హీరో. అతనికి బుల్లితెర ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉంది. అలాగే సెలెబ్రిటీలు అమర్ కి సపోర్ట్ చేస్తున్నారు. అమర్ గేమ్, ప్రవర్తన విమర్శలపాలైంది. అయినా అతడు టాప్ 2లో కొనసాగుతున్నాడు.
ఇక మూడో స్థానంలో శివాజీ ఉన్నారు. ఐడి ఊహించని పరిణామం. ఫస్ట్ నుండి టైటిల్ ఫేవరేట్ గా ఉన్న శివాజీ రేసులో వెనుకబడ్డారు. గత రెండు వారాలుగా అతనికి నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. శోభను తిట్టడం మైనస్ అయ్యింది. ఈ కారణాలతో శివాజీ మూడో స్థానానికి పడిపోయారు. అయితే అమర్-శివాజీ మధ్య పెద్దగా ఓట్ల వ్యత్యాసం లేదు.
Bigg Boss Telugu 7
నాలుగో స్థానంలో యావర్ ఉన్నాడు. స్పై బ్యాచ్ లో ఒకడైన యావర్ టైటిల్ రేసులో లేదని తేలిపోయింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. అర్జున్ 5వ స్థానంలో ఉండగా, ప్రియాంక 6వ స్థానంలో ఉంది. యావర్, అర్జున్, ప్రియాంకలలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా కావొచ్చు అంటున్నారు.
Bigg Boss Telugu 7
కాబట్టి ప్రధానంగా టైటిల్ పోరు ప్రశాంత్, శివాజీ, అమర్ మధ్య జరగనుంది. అనధికారిక ఓటింగ్ ప్రకారం ప్రశాంత్ విన్నర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అయితే హాట్ స్టార్ ఓటింగ్, మిస్డ్ కాల్ ఓటింగ్ ఫలితాలు ఏమిటనేది ఎవరికీ తెలియవు.