MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • TV
  • Bigg Boss 7 Grand Finale: ఈసారి టైటిల్ విన్నర్ బ్యాడ్ లక్... 50 లక్షల్లో చేతికి వచ్చేది కేవలం ఇంతే!

Bigg Boss 7 Grand Finale: ఈసారి టైటిల్ విన్నర్ బ్యాడ్ లక్... 50 లక్షల్లో చేతికి వచ్చేది కేవలం ఇంతే!

బిగ్ బాస్ షోకి వెళ్లాలని లక్షల మంది కలలుగంటారు. కొందరికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ఆ షోకి వెళ్లాలని టెంప్ట్ చేసే అంశాల్లో ప్రైజ్ మనీ ప్రధానమైనది. పేరుకే యాభై లక్షలు కానీ, చేతికి వచ్చేది చాలా తక్కువ. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 17 2023, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటి. కోన్ బనేగా కరోడ్ పతి తర్వాత భారీ ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తున్న షో. పలు భాషల్లో ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ షో విన్నర్ కి రూ. 50 లక్షలు ప్రైజ్ మనీగా ఇస్తారు. వీటితో పాటు మరో రూ. 20 లక్షల విలువైన బహుమతులు ఉంటాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే విన్నర్ ప్రైజ్ మనీలో భారీ కోతలు ఉంటాయి. ప్రైజ్ మనీ రూపంలో ఓ వ్యక్తి గెల్చుకున్న మొత్తంపై భారీగా టాక్స్ వేస్తారు. అది లాటరీ కావచ్చు, రియాలిటీ షోలో గెలుచుకున్న మొత్తం కావచ్చు. టీడీఎస్ రూపం 31.2% చెల్లించాలి. జీఎస్టీతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఛార్జులు ఉంటాయి. గతంలో బిగ్ బాస్ విన్నర్ రూ. 50 లక్షలు గెలుచుకుంటే టాక్స్ కటింగ్స్ పోను రూ. 37 లక్షలు చేతికి వచ్చేవి. 

 

36
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

గత రెండు సీజన్స్ నుండి కేవలం రూ. 23 లక్షలు వస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సీజన్ 5 విన్నర్ సన్నీ తెలియజేశాడు. గెలిచింది నేను డబ్బులు తీసుకుంది గవర్నమెంట్ అని సెటైర్ వేశాడు. గెలిచిన ప్రైజ్ మనీ, బహుమతుల నుండి నాకు మిగిలింది ఏమీ లేదు. టాక్స్ ల రూపంలోనే మొత్తం పోయిందని సన్నీ అన్నాడు. 

46
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఇక లేటెస్ట్ సీజన్ 7 విన్నర్ రెమ్యూనరేషన్ మరింత దారుణం అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకుని టాప్ 3 నుండి తప్పుకున్నాడట. ఆ పదిహేను లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ నుండి తగ్గిస్తారు. మిగిలింది రూ. 35 లక్షలు. టాక్స్ కటింగ్స్ పోను రూ. 16 లక్షలు విన్నర్ చేతికి వస్తాయని సమాచారం. 


 

56

యాభై లక్షలు ఎక్కడ పదహారు లక్షల ఎక్కడ?. ప్రైజ్ మనీతో పాటు విన్నర్ కి ఒక మారుతీ సుజుకీ బ్రీజా, రూ. 15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ ఇవ్వనున్నారు. వీటి మీద కూడా టాక్స్ పడుతుంది. ఆ పదహారు లక్షల నుండి టాక్స్ చెల్లిస్తే ఈ రెండు బహుమతులు సొంతం అవుతాయి. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అని గట్టిగా ప్రచారం అవుతుంది. 

 

66
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

కాబట్టి టైటిల్ విన్నర్ గా ఆయనకు పెద్దగా ఒరిగింది ఏం లేదని అంటున్నారు. అయితే ఎంత మొత్తం గెలిచినా ప్రశాంత్ అది పేద రైతులకు ఇచ్చేస్తానని చెప్పాడు. కాబట్టి పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాడో చూడాలి... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved