- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 7: యావర్ ని ఏడిపించిన బిగ్ బాస్... ఫైనల్ వీక్ లో ఊహించని అనుభవం!
Bigg Boss Telugu 7: యావర్ ని ఏడిపించిన బిగ్ బాస్... ఫైనల్ వీక్ లో ఊహించని అనుభవం!
బిగ్ బాస్ సీజన్ 7 చివరి వారానికి చేరుకుంది. ఈ ఆదివారం టైటిల్ విన్నర్ డిసైడ్ కానున్నారు. ఫైనలిస్ట్స్ లో ఒకరైన యావర్ బిగ్ బాస్ మాటలకు కన్నీరు పెట్టుకున్నారు.

Bigg Boss Telugu 7
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలేకి సమయం ఆసన్నమైంది. కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శివాజీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక టాప్ 6లో ఉన్నారు వీరిని ఫైనలిస్ట్స్ గా నాగార్జున గత ఆదివారం ప్రకటించారు. వీరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ కానున్నారని సమాచారం.
Bigg Boss Telugu 7
ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ తో బయటకు వచ్చేస్తే టాప్ ఫైవ్ మిగులుతారు. ఆదివారం జరగనున్న ఫినాలే ఎపిసోడ్లో ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే పాల్గొంటారు. వీరిలో ఒకరు విన్నర్ అవుతారు.
Bigg Boss Telugu 7
టైటిల్ పోరు ప్రధానంగా ప్రశాంత్, అమర్, శివాజీ మధ్య ఉంటుందని తెలుస్తుంది. ఓటింగ్ లో వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టైటిల్ ఫేవరేట్స్ గా ఈ ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. అనధికారిక పోల్స్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దూసుకుపోతున్నాడు. మిగతా కంటెస్టెంట్స్ కంటే భారీ మార్జిన్ తో ప్రశాంత్ ముందంజలో ఉన్నాడు.
Bigg Boss Telugu 7
ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ ఇన్ని రోజులు పడ్డ కష్టం ఆవిరయ్యేలా జర్నీ వీడియోలు ఉంటున్నాయి. కంటెస్టెంట్స్ లైఫ్ టైం బిగ్ బాస్ షో అనుభవాన్ని గుర్తించుకునేలా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. ప్రతి కంటెస్టెంట్స్ అనుభవాలతో కూడిన ఫోటోలు, వస్తువులతో అలంకరించిన ప్రదేశం, గొప్ప అనుభూతిని ఇస్తుంది.
Bigg Boss Telugu 7
తాజాగా యావర్ వంతు వచ్చింది. యావర్ గురించి బిగ్ బాస్ చెప్పిన మాటలు అతన్ని భావోద్వేగానికి గురి చేశాయి. గెలవాలనే నీ పట్టుదల టాస్క్ లలో ప్రత్యర్థులను భయపడేలా చేసింది. నీ స్నేహితులు సాఫీగా సాగేలా చేశారు. నీ కోపం తప్పును ప్రశ్నించే ప్రతిచోటా కనిపించింది. అవిక్షన్ పాస్ గెలిచి, దాన్ని మరలా వెనక్కి తిరిగి ఇచ్చేశావు... అని బిగ్ బాస్ అమర్ ని ఉద్దేశించి చెప్పారు.
Bigg Boss Telugu 7
శివాజీ, ప్రశాంత్ ల గురించి మాట్లాడేటప్పుడు యావర్ బాగా ఏడ్చేశాడు. యావర్ బిగ్ బాస్ జర్నీ వీడియో వైరల్ అవుతుంది. యావర్ స్పై బ్యాచ్ లో ఒకడు. సీరియల్ బ్యాచ్ కి పోటీగా శివాజీ స్పై బ్యాచ్ ఏర్పాటు చేశాడు. శివాజీ, ప్రశాంత్, యావర్ పేర్లలో మొదటి అక్షరాలు కలిపి స్పై గ్రూప్ ఏర్పాటు చేశారు.
Bigg Boss Telugu 7: విన్నర్ ని డిసైడ్ చేయనున్న మిడ్ వీక్ ఎలిమినేషన్... సంచలనం రేపుతున్న సమీకరణాలు!