- Home
- Entertainment
- TV
- రాహుల్ సిప్లిగంజ్ తో రతిక ప్రేమాయణం బయటపెట్టిన సింగర్ దామిని... వాడుకున్నాడని సంచలన ఆరోపణలు!
రాహుల్ సిప్లిగంజ్ తో రతిక ప్రేమాయణం బయటపెట్టిన సింగర్ దామిని... వాడుకున్నాడని సంచలన ఆరోపణలు!
బిగ్ బాస్ షో వేదికగా రాహుల్ సిప్లిగంజ్, రతిక ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సింగర్ దామిని రాహుల్ సిప్లిగంజ్ ఫ్రెండ్ కాగా వారి ఎఫైర్ కి సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Bigg Boss Telugu 7
రతిక రోజ్ అత్యంత నెగిటివిటీ మూటగట్టుకున్న కంటెస్టెంట్. పీఆర్ టీమ్ ని సిద్ధం చేసుకుని హౌస్లోకి వెళ్లిన రతిక మొదటి రోజును నుండి ఎలా ఆడాలో ముందుగానే ప్లాన్ వేసుకుంది. హౌస్లో ఎఫైర్ పెట్టుకోవాలి అనేది కూడా ఆమె ప్రణాళికలలో భాగం. అందుకే మొదట పల్లవి ప్రశాంత్ ని గెలికింది. పల్లవి ప్రశాంత్ కూడా ఆమె ట్రాప్ లో పడ్డాడు.
అనూహ్యంగా రైతుబిడ్డగా హౌస్లోకి వచ్చి ఏం పీకావు అంటూ రివర్స్ అయ్యింది. ప్రశాంత్ ని నామినేట్ చేసింది. అనరాని మాటలు అంది. ఇది ఆమెకు చాలా మైనస్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ కి దూరమయ్యాక యావర్ కి వల విసిరింది. అతగాడిని లైన్లో పెట్టింది.
Bigg Boss Telugu 7
రతిక గేమ్లో భాగంగా ఆడిన మరో నాటకం... సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఎఫైర్. ఈ విషయాన్ని తనకు ఫేవర్ గా వాడుకోవాలని, సింపతీ రాబట్టాలని ప్లాన్ చేసింది. తనకు ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. అతడు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాడు. అతన్ని చాలా మిస్ అవుతున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంది. బిగ్ బాస్ కి పేరు చెప్పకున్నా, హౌస్ మేట్స్ తో తన మాజీ లవర్ రాహుల్ గురించి రతిక మళ్లాడేదట.
రతిక హౌస్లో బ్రేకప్ మేటర్ లీక్ చేయగానే... ఆమె పీఆర్ టీమ్ రతిక-రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై రాహుల్ సిప్లిగంజ్ మండిపడ్డాడు. రతిక గేమ్ ని నమ్ముకోకుండా ఇతరుల ఫేమ్ వాడుకుని గెలవాలి అనుకుంటుందని సోషల్ మీడియాలో పరోక్ష పోస్ట్లు పెట్టాడు. ఇది కూడా రతికకు మైనస్ అయ్యింది. నాలుగో వారం ఆమె ఎలిమినేట్ అయ్యింది.
కాగా రాహుల్-రతిక ప్రేమ వ్యవహారం గురించి ఎలిమినేటైన సింగర్ దామిని వెల్లడించింది. దామిని మూడో వారం ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఆమె బయటకు వెళ్ళగానే రాహుల్ సిప్లిగంజ్ ఫోన్ చేశాడట. తనను కలిశాడట. రాహుల్ వ్యక్తిగత విషయాలు ఎవరితో పంచుకోడు. కాకపోతే రతిక హౌస్లో చేసిన పనికి నాతో అన్ని విషయాలు మాట్లాడాడు అని దామిని అన్నారు.
Bigg Boss Telugu 7
వారు గతంలో డేటింగ్ చేసిన విషయం నిజమే. వ్యక్తిగత కారణాలతో విడిపోయారని దామిని అన్నారు. బిగ్ బాస్ హౌస్లో రతిక తనకు రాహుల్ సిప్లిగంజ్ తో జరిగిన లవ్ మేటర్ గురించి తరచుగా చెప్పేదట. అది స్ట్రాటజీలో భాగం అని నేను అనుకోలేదని దామిని అన్నారు.
నేను ఎలిమినేట్ కావాల్సింది కాదు. కానీ బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడని దామిని అన్నారు. రతికను మరలా హౌస్లోకి తెచ్చేందుకు శుభశ్రీని నన్ను బిగ్ బాస్ వాడుకున్నాడని ఆమె అసహనం వ్యక్తం చేసింది. శుభశ్రీ, తన కంటే తక్కువ ఓట్లు పడిన రతికను రీఎంట్రీకి ఎంపిక చేసుకున్నాడని ఆమె అన్నారు. దామిని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.