MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Bigg Boss Telugu 7: అమర్ అలాంటి వాడు... గతమంతా తవ్వుతూ నోరు విప్పిన బిగ్ బాస్!

Bigg Boss Telugu 7: అమర్ అలాంటి వాడు... గతమంతా తవ్వుతూ నోరు విప్పిన బిగ్ బాస్!

అమర్ దీప్ టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరు. టైటిల్ బరిలో ఉన్నాడు. షోలో అమర్ దీప్ జర్నీ గురించి బిగ్ బాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 11 2023, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సీరియల్ హీరోగా అమర్ దీప్ కి బుల్లితెర ఆడియన్స్ లో ఓ ఫేమ్ ఉంది. డిజిటిల్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. ఆ హోదాలో బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టాడు. బిగ్ బాస్ తెలుగు 7 ఫైనలిస్ట్స్ లో ఒకడిగా ఉన్నాడు. శోభ ఎలిమినేట్ కాగా.. అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్, అర్జున్, యావర్, ప్రియాంక ఫైనల్ కి వెళ్లారు. 

 

28

అమర్ దీప్ టైటిల్ ఫేవరేట్ గా  అవుతున్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ అనూహ్యంగా అభిమానులను పెంచుకుని టైటిల్ రేసులో దూసుకుపోతున్నాడు. పల్లవి ప్రశాంత్ ని దాటి టైటిల్ అందుకోవడం అంత సులభం కాదు. అలాగే శివాజీ కూడా టైటిల్ రేసులో ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఒకరు విన్నర్ అవుతారనేది ఖాయం. 

38

చివరి వారం పెద్దగా గేమ్స్, టాస్క్స్ ఉండవు. టాప్ 6 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ జర్నీని అందంగా ఆవిష్కరిస్తారు. ఫస్ట్ ఛాన్స్ అమర్ దీప్ కి వచ్చింది. అమర్ దీప్ కోసం ఓ గదిని అందంగా డెకరేట్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో అమర్ దీప్ కి సంబంధించిన అరుదైన ఘట్టాలకు సంబంధించిన ఫోటోలు, వస్తువులను అక్కడ ఉంచారు. 

 

48

ఇక అమర్ దీప్ గురించి బిగ్ బాస్ తన మాటల్లో చెప్పాడు. అమర్ దీప్ అంటే ఆరిపోని దీపం అని అర్థం. ఎలాగైనా గెలవాలనే తపన మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మీలో కోపం, ఆవేశంతో పాటు, హ్యూమర్, వెటకారం కూడా ఉన్నాయి. 
 

58

నీ కోపం హద్దులు దాటేటప్పుడు ఎదుటివారికి హాని జరగకుండా నీ మిత్రులు కవచంగా మారి అడ్డుకున్నారు. అందరూ తప్పులు చేస్తారు. తెలుసుకుని సరిద్దిదుకున్నవాళ్ళే గొప్పవాళ్ళు.... అంటూ అమర్ దీప్ గురించి బిగ్ బాస్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అమర్ దీప్ జర్నీని తన మాటల్లో వర్ణించాడు. 


 

68

బిగ్ బాస్ ట్రీట్ కి అమర్ దీప్ ఫిదా అయ్యాడు. అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చాక చాలా సందర్భాల్లో అబాసుపాలయ్యాడు. ముఖ్యంగా మైండ్ గేమ్స్ లో చేతులెత్తేసేవాడు. మరీ ఇంత వెర్రివాడు ఏంటి అన్నట్లు అమర్ ప్రవర్తన ఉండేది. 

78

అమర్ దీప్ కి తనపై తనకు ఆత్మవిశ్వాసం ఉండదు. లక్ లేకనే ఓడిపోతున్నాను అనుకుంటాడు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేయడం కూడా అమర్ దీప్ కి మైనస్ అయ్యింది. జనాల్లో అతడికి నెగిటివిటీ తెచ్చిపెట్టింది. 
 

88

అమర్ దీప్ విమర్శించే పల్లవి ప్రశాంత్ ఖాతాలో అనేక విజయాలు ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ మొదటి కెప్టెన్, పవర్ అస్త్ర, అవిక్షన్ పాస్ కూడా గెలిచాడు. అమర్ నాగార్జున కారణంగా కెప్టెన్ అయ్యాడు. ప్రముఖ మీడియా సంస్థల అనధికారిక సర్వేలలో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. ఇక టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలి...

 

ప్రియాంక ఫ్యామిలీ మోసపోయింది, అందుకే ఇంత పేదరికం.. ట్రోలర్స్ కి చెక్ పెట్టిన బాయ్ ఫ్రెండ్
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతితో మీనా ఛాలెంజ్, సంజూని వణికించిన పూలగంప
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీప‌ అనాథ కాదన్న దశరథ-షాక్ అయిన జ్యో-దశరథ ఎమోషనల్-జ్యో డౌట్ క్లియర్?
Recommended image3
ఆకలి తీర్చినందుకే ఆ డైరెక్టర్ నన్ను హీరో చేశాడు.. రూ. 3 కోట్లతో సినిమా తీశాడు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved