Inaya Sulthana : ఇనయా సుల్తానా లేటెస్ట్ పోస్ట్... బిగ్ బాస్ బ్యూటీ లుక్ పై క్రేజీ కామెంట్లు!
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా (Inaya Sulthana) తన గ్లామర్ సీక్రెట్ ను రివీల్ చేసింది. ఎప్పుడూ ఫిట్ గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ డైలీ ఏం చేస్తుందో చెప్పుకొచ్చింది.
యంగ్ బ్యూటీ ఇనయా సుల్తానా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తన ఫొటోషూట్లతో నెట్టింట సెన్సేషన్ గా మారుతుంటుంది. బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది.
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 Bigg Boss Telugu 6 తో బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్ లో 14 వారాల పాటు ధీటుగా గేమ్స్ ఆడి మెప్పించింది. కొద్దిలో టైటిల్ మిస్ అయ్యింది.
నటిగా ఎదగాలనుకుంటున్న ఇనయా సుల్తానాకు నెట్టింట మాత్రం మంచి క్రేజ్ దక్కింది. ఈ బ్యూటీ పెట్టే ఇంట్రెస్టింగ్ పోస్టులతో మరింతగా ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. తాజాగా ఇనయా తన బ్యూటీ సీక్రెట్ ను రివీల్ చేసింది.
ఎప్పుడూ ఫిట్ గా, ప్రకాశవంతంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ అందం వెనకున్న రహస్యం చెప్పింది. అందేటో కాదు.. డైలీ వర్కౌట్స్ చేస్తుందని తన పోస్ట్ ద్వారా తెలియజేసింది. అలాగే వర్కౌట్స్ చేస్తూనే... ప్రాపర్ ఫుడ్ మోతాదులో తీసుకుంటున్నానని తెలియజేసింది.
పోస్ట్ వర్కౌట్ తర్వాత చిప్స్ లాంటివి తింటూ కనిపించింది. అయితే ఈ ముద్దుగుమ్మ వర్కౌట్ వేర్ లోనే ఫొటోలకు ఫోజులిచ్చింది. మేకల్ లేకుండా దర్శనమివ్వడంతో నెటిజన్లు క్రేజీ గా స్పందిస్తున్నారు. గ్లామర్ విందు చేయడానికే ఇలాంటి అవుట్ ఫిట్ లో ఫోజులిచ్చావు.. అంటూ పంచులు పేల్చుతున్నారు.
స్కిన్ షో చేయడానికే ఇలాంటి ఫొటోలను పెట్టావా? అంటూ ఫొటోలకు రిప్లై ఇస్తున్నారు. మరికొందరు మాత్రం ఫిట్ నెస్ కోసం ఎంతలా శ్రమిస్తున్నావో అంటూ పొగడ్తలతో ముంచేత్తారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.