బిగ్ బాస్ 9 తెలుగు 12 వారం ఎలిమినేట్ అయ్యింది వీరే, ఈ వారం ఇద్దరు ఔట్
బిగ్ బాస్ తెలుగు 9 పదకొండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ముందు నుంచి ఊహించినట్టు ఈ వారం క్రేజీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ తెలుగు 9 ..12వ వారం ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం(12వ వారం) నామినేషన్‌లో రీతూ చౌదరీ తప్ప మిగిలిన వారంతా ఉన్నారు. తనూజ, కళ్యాణ్, భరణి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజనా, దివ్య, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ ఓటింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నారు. భరణి, సుమన్ శెట్టి, సంజనా, దివ్య ఓటింగ్‌లో బాటమ్‌లో ఉన్నారు. వీరిలోనూ సంజనా, దివ్య, సుమన్ శెట్టి మరీ లీస్ట్ లో ఉన్నారు. మరి వీరిలో ఈ వారం ఎవరు హౌజ్‌ని వీడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
దివ్య ఎలిమినేషన్?
ఈ నేపథ్యంలో తాజాగా ఎలిమినేషన్ అప్ డేట్ వచ్చింది. ఈ వారం ఊహించినట్టుగానే ఎలిమినేషన్ జరిగిందట. బిగ్ బాస్ హౌజ్ నుంచి దివ్య ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఆమె ఎలిమినేషన్ కన్ఫమ్ అయినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు బిగ్ బాస్ ఫాలోవర్స్. అయితే ఓటింగ్ ప్రకారం కూడా దివ్యనే లీస్ట్ లో ఉన్నారు. గత వారంలోనూ ఆమె లీస్ట్ లోనే ఉన్నారు. ఎలిమినేట్ కూడా కావాల్సింది. కానీ ఇమ్మాన్యుయెల్ వద్ద ఉన్న పవన్ అస్త్రని ఉపయోగించి ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశాడు. దీంతో దివ్య సేవ్ అయ్యింది. కానీ ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పలేదని తెలుస్తోంది.
కామన్ మేన్ కేటగిరిలో హౌజ్‌లోకి వచ్చిన దివ్య
ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడే దివ్య ఎలిమినేషన్‌కి సంబంధించిన షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దివ్య బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఓపెనింగ్‌లో రాలేదు. మిడ్ వీక్‌లో ఎంట్రీ ఇచ్చింది. దివ్య కామన్‌మేన్ కేటగిరిలో హౌజ్‌లోకి రావడం విశేషం. ఈ కేటగిరిలో వచ్చిన శ్రీజ, ప్రియా, హరిత హరీష్, మర్యాద మనీష్‌లు ఎలిమినేట్ అయ్యారు. డీమాన్ పవన్, కళ్యాణ్‌తోపాటు దివ్య కూడా ఇన్నాళ్లు బిగ్ బాస్ హౌజ్‌లో సర్వైజ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు దివ్య హౌజ్‌ని వీడాల్సి వచ్చింది.
దివ్య ఎలిమినేషన్‌కి కారణమిదేనా?
దివ్య కామన్ మేన్ కేటగిరిలో హౌజ్‌లోకి వచ్చినా చాలా స్ట్రాంగ్‌గా కంటెస్టెంట్‌గా పేరుతెచ్చుకున్నారు. గేమ్స్, టాస్క్ కూడా బాగా ఆడారు. వాదించే విషయంలో తన వాదనలను బలంగా వినిపించారు. ఇతరులను బాగా డామినేట్ చేశారు. మరోవైపు భరణితో రిలేషన్ విషయంలోనూ హైలైట్ అవుతూ వస్తున్నారు. అయితే ఆమె వాదనలు క్రమంగా నెగటివ్ సైడ్ తీసుకుంటున్నాయి. దీనికితోడు భరణితో రిలేషన్ విషయంలోనూ నెగటివిటీ మూటగట్టుకుంటూ వస్తోంది. అది ఇప్పుడు ఎలిమినేషన్‌కి దారితీసిందని చెప్పొచ్చు.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్
ఇదిలా ఉంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. గత వారం ఎలిమినేషన్ లేకపోవడంతో 12 వారం ఇద్దరు కంటెస్టెంట్లని హౌజ్ నుంచి పంపబోతున్నారట హోస్ట్ నాగార్జున. దివ్య తర్వాత సుమన్ శెట్టి, సంజనా లీస్ట్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా వరకు సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మరి కాసేపట్లో తేలనుంది.

