- Home
- Entertainment
- TV
- గజిని సినిమా కోసం సూర్య ఫస్ట్ ఛాయిస్ కాదా? బ్లాక్ బస్టర్ హిట్ మూవీని మిస్ అయిన హీరో ఎవరు?
గజిని సినిమా కోసం సూర్య ఫస్ట్ ఛాయిస్ కాదా? బ్లాక్ బస్టర్ హిట్ మూవీని మిస్ అయిన హీరో ఎవరు?
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సంచలన సంచలనం సృష్టించిన సినిమా 'గజినీ'. ఈ సినిమాలో హీరోగా సూర్య కంటే ముందు అనుకున్నది ఎవరినో తెలుసా? ఈ సినిమా దర్శకుడు మురుగదాస్ చెప్పిన సీక్రేట్ ఏంటి?

సూర్య కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా
సౌత్ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమా గజిని. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సంజయ్ రామస్వామి, గజినీ అనే రెండు పాత్రల్లో సూర్య అదరగొట్టాడు. హీరోయిన్ గా ఆసిన్ అద్భుతంగా నటించి మెప్పించింది. కానీ ఈ సినిమా కథ సూర్య కోసం రాయలేదంటే నమ్ముతారా? కానీ అదే నిజం. ఈ సినిమా కథను మరో హీరో వద్దనుకున్న తర్వాత సూర్య నటించారు. గజినీ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్న ఆ హీరో ఎవరో తెలుసా?
KNOW
అజిత్ చేయల్సిన సినిమా
గజిని సినిమాలో సూర్యకంటే ముందు అనుకున్న హీరో మరెవరో కాదు.. అజిత్. ఈ విషయాన్ని దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గజిని సినిమాను అజిత్ తో చేయాలి అనుకున్నాడు మురగదాస్. కాని అదే టైమ్ లో నాన్ కడవుళ్ సినిమా కోసం అజిత్ జుట్టు పెంచడం వల్ల గజినీ కోసం గుండు చేయించుకోవడం కుదరలేదట. అందుకే ఈసినిమాను అజిత్ వదిలుకోేవలసి వచ్చింది. ఈ అవకాశం సూర్యను చేరడం, అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అందరికి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని శివ కార్తికేయన్ నటిస్తున్న 'మద్రాసి' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మురుగదాస్ మాట్లాడారు. అజిత్‌తో మిరట్టల్ అనే టైటిల్‌తో సినిమా చేయాలనుకున్నానని, అదే తర్వాత గజినీగా మారిందని ఏ.ఆర్.మురుగదాస్ చెప్పారు.
హిందీలో కూడా హిట్ కొట్టిన మురగదాస్
"గజినీ సినిమాలో మొదట అజిత్ నటించాల్సింది. కానీ అప్పుడు ఆయన వేరే సినిమాల్లో నటిస్తున్నారు. ఆర్యా నటించిన నాన్ కడవుళ్ సినిమాలో మొదట నటించాల్సింది అజిత్. ఆ సినిమా కోసం ఆయన జుట్టు పెంచడం వల్ల గజినీ కోసం తల గొరిగించుకోలేకపోయారు. ఇదే ప్రధాన కారణం. సంజయ్ రామస్వామి పాత్రలో ఆయన రెండు రోజులు నటించిన సన్నివేశాలు నా దగ్గర ఇంకా ఉన్నాయి." అని మురుగదాస్ అన్నారు. 2005లో విడుదలైన గజినీ బ్లాక్ బస్టర్ హిట్. తర్వాత హిందీలో ఆమిర్ ఖాన్‌తో మురుగదాస్ ఈ సినిమాను రీమేక్ చేశారు. అక్కడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
శివ కార్తికేయన్ నటిస్తున్న మద్రాసి సినిమాలో బిజు మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. విద్యుత్ జమ్వాల్, విక్రాంత్, రుక్మిణి వసంత తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక శివ కార్తికేయన్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన నటించిన అమరన్ సినిమా 2024లో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 334 కోట్లు వసూలు చేసింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ నటించారు. సాయి పల్లవి, పూవన్, రాహుల్ బోస్, లల్లూ, శ్రీకుమార్, ష్యామ్ ప్రసాద్, ష్యామ్ మోహన్, గీతూ కైలాష్, వికాస్ బంగర్, మీర్ సల్మాన్ తదితరులు నటించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.