OTT లోకి మమ్ముట్టి యాక్షన్ ఫిల్మ్ ‘టర్బో’..ఎందులో, ఎప్పటి నుంచి
రూ.23 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.75 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
మమ్ముట్టి (Mammootty) హీరో గా మలయాళంలో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘టర్బో’. వైశాఖ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజనా జయ ప్రకాశ్, రాజ్ బి.శెట్టి, శబరీష్ వర్మ, సునీల్, కబిర్ దుహాన్ సింగ్‌లు కీలక పాత్రలు పోషించారు. మే 23న మలయాళంలో విడుదలైన ‘టర్బో’ బాక్సాఫీస్ వద్ద యాక్షన్ అభిమానులకు నచ్చింది. రూ.23 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.75 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
Mammootty hit Turbo
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ మమ్ముట్టి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా టర్బో సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది సోనీ లివ్. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సూపర్ హిట్ స్ట్రీమింగ్ కానుంది.
Actor Mammootty Turbo film ott release update
టర్బో సినిమా థియేటర్లలో మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఓటీటీలోకి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ డబ్బింగ్ వెర్షన్‍లను కూడా సోనీలివ్ అందుబాటులోకి తీసుకొస్తోంది.
Mammoottys Turbos
చిత్రం కథేంటంటే:
అరవిపురతు జోసీ అలియాస్ టర్బో జోసీ (మమ్ముట్టి) కేరళలోని ఇడుక్కిలో జీపు డ్రైవర్. తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. స్నేహితుల కోసం ఎంత వరకైనా, ఎవరితోనైనా గొడవపడేందుకు రెడీ అంటాడు. ఓ వేడుకలో స్నేహితుడు జెర్రీ (శబరీష్)ను గుర్తు తెలియని వ్యక్తులు చంపబోతే కాపాడతాడు. ఆ దాడి చేసింది జెర్రీ ప్రేమించిన అమ్మాయి ఇందులేఖ (అంజనా జయప్రకాశ్) కుటుంబ సభ్యులని తెలిసి, ఆమెను చెన్నై నుంచి జెర్రీ ఇంటికి తీసుకువస్తాడు.
Actor Mammoottys Turbo film
అయితే, ఇంట్లో వాళ్లకు భయపడి జెర్రీ ఆ అమ్మాయి ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తాడు. దీంతో కోపమొచ్చి ఇందులేఖ తిరిగి చెన్నై వెళ్లిపోతుంది. బ్యాంకు ఉద్యోగి అయిన జెర్రీ కూడా చెన్నై వెళ్లి తన ఉద్యోగంలో చేరిపోతాడు. సడెన్‌గా ఒక రోజు జెర్రీ ఆత్మహత్య చేసుకున్నాడని టర్బోకు తెలుస్తుంది. చెన్నై వచ్చిన టర్బోకు జెర్రీది ఆత్మహత్య కాదని, హత్య అని తెలుస్తుంది. దీని వెనుక వెట్రివేల్ షణ్ముగ సుందర (రాజ్ బి.శెట్టి) ఉన్నాడని గుర్తిస్తాడు. ఇంతకీ జెర్రీని వెట్రివేల్ ఎందుకు హత్య చేశాడు? దానిని టర్బో ఎలా కనిపెట్టాడు?ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది చిత్ర కథ.
Mammoottys Turbos
టర్బో మూవీకి మమ్ముట్టినే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. తన సొంత మమ్ముట్టి కంపెనీ బ్యానర్ పైనే ఈ సినిమాను రూపొందించారు. క్రిస్టో గ్జేవియర్ ఈ సినిమాకు స్వరాలు అందించగా.. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ మధ్యన మమ్ముట్టి సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.