- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: అడ్డంగా దొరికిపోయిన లాస్య, రాజ్యలక్ష్మి.. నిజం చెప్పమంటూ భార్యపై చెయ్యెత్తిన నందు!
Intinti Gruhalakshmi: అడ్డంగా దొరికిపోయిన లాస్య, రాజ్యలక్ష్మి.. నిజం చెప్పమంటూ భార్యపై చెయ్యెత్తిన నందు!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇంటింటికి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. కొత్త ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టి కష్టాల పాలవ్వబోతున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మా ఇద్దరి మధ్య ఎప్పుడూ చదువుకు సంబంధించిన టాపిక్ రాలేదు. మేము ఇప్పుడు ఎంత హాయిగా ఉన్నామో, జీవితాంతం అంతే హాయిగా ఉంటామన్న నమ్మకం మాకుంది. అయినా నువ్వు నర్స్, సంజయ్ డాక్టర్ అయినా మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు కదా అలాగే మేము కూడా అంటుంది దివ్య. పిచ్చి పిల్ల మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంటుంది.నాకేమో నిజం చెప్పటానికి నోరు పెగలడం లేదు అని బాధపడుతుంది ప్రియ. ఇంతలో వాళ్ళ అత్తగారి పిలవడంతో దివ్యతో కాసేపు గడిపితే చూడలేక పోతుంది అని తిట్టుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది ప్రియ.
మరోవైపు ఆటోలో వెళ్తున్న తులసి, దివ్య వంటింట్లో ఎలాంటి పాట్లు పడుతుందో అంటూ నవ్వుతుంది. పెళ్ళైన కొత్తలో ప్రతి ఆడపిల్లకి ఉండే పాట్లే అంటుంది రాములమ్మ. ఇదే మా వియ్యపురాలి హాస్పిటల్ అని రాములమ్మ కి చూపిస్తుంది తులసి. కారు దిగి రాజ్యలక్ష్మి హాస్పిటల్ కి వెళ్తున్న లాస్యని చూసి లాస్యమ్మ ఇక్కడ పని చేస్తున్నారా అని అడుగుతుంది రాములమ్మ. అలాంటిదేమీ లేదు పదా చూద్దామని లాస్యని ఫాలో అవుతారు రాములమ్మ, తులసి. మరోవైపు తను వండిన వంట మంచి సువాసన రావడంతో ఆనందంతో పొంగిపోతుంది దివ్య.
ఆ వాసనకి విక్రమ్ కూడా వంట గదిలోకి వస్తాడు. వాసన అదిరిపోతుంది, బయటికి వెళ్తున్న నన్ను ఇటు వైపు లాక్కుని వచ్చింది అంటూ కూరని టేస్ట్ చేస్తాడు. ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతాడు. ఏమైంది అని కంగారుగా అడుగుతుంది దివ్య. ఏమీ లేదు కూర చాలా టేస్టీగా వచ్చింది, ఈ కూర ఎవరికీ పెట్టకు నాకు మాత్రమే దాచిపెట్టు అంటాడు విక్రమ్.అదేంటి ఈ కూర అంటే అత్తయ్య గారికి కూడా ఇష్టమే కదా అంటుంది దివ్య. కావాలంటే వాళ్లకోసం శాంతను వండమందాము అంటాడు విక్రమ్.
ఎందుకు అలా అంటున్నావు అంటూ విక్రమ్ వారిస్తున్నా వినకుండా కూరని టేస్ట్ చేసి బిత్తరపోతుంది దివ్య. ఇంత చేదుగా ఉంటే అలా లొట్టలేసుకొని ఎలా తింటున్నావు, అయినా అన్ని అమ్మ చెప్పినట్లే చేశాను, అయినా ఎక్కడ తేడా వచ్చింది అంటుంది దివ్య. వంకాయల్ని ఉప్పు నీటిలో కడిగావా అని అడుగుతాడు విక్రమ్. లేదు అంటుంది దివ్య. అందుకే చేదు వచ్చింది అంటాడు విక్రమ్. హాస్పిటల్ కి వచ్చిన తులసి వాళ్ళు లాస్య ని వెతుకుతూ ఉంటారు. అంతలోనే ఒక సిస్టర్ పలకరించి లాస్య మేడం కూడా వచ్చారు ఎండి మేడం రూమ్ లో ఉన్నారు అని చెప్తుంది. మరోవైపు దివ్య, ప్రియ వద్దని చెప్తున్నా వినకుండా మామగారికి భోజనం తినిపించడానికి వెళ్తుంది.
ఎన్నాళ్లు ఇలా చీకట్లో ఉంటారు బయటకు రమ్మంటే నా మాట వినట్లేదు. ఉండండి నా చేతులతోనే ముద్దులు కలిపి పెడతాను అంటూ చీకటి గదిలో లైట్ వేస్తుంది దివ్య. నువ్వు నాకు దగ్గరవుతున్నావంటే ఆ రాక్షసి నిన్ను ప్రశాంతంగా ఉంచదు అనుకుంటాడు ప్రకాష్. ఒక్కసారిగా మొహం మీద వెలుతురు పడేసరికి విపరీతంగా కోప్పడతాడు. ఆ కోపానికి బెదిరిపోయి గబగబా బయటికి వచ్చేస్తుంది దివ్య. మరోవైపు తులసి వాళ్ళకి రాజ్యలక్ష్మి, లాస్య నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం కనిపిస్తుంది. వీళ్ళిద్దరికీ ఇప్పుడే పరిచయం కదా ఇంతలాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఏంటి అనుకుంటారు తులసి రాములమ్మ.
రాజ్యలక్ష్మి, లాస్యకి డబ్బులు ఇవ్వటం చూసి షాక్ అవుతారు. వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటుంది తులసి. మీ వియ్యపురాల్ని అడిగేస్తే సరిపోతుంది కదా అంటుంది రాములమ్మ. అలా అడిగితే బాగోదు, ఎలా తెలుసుకోవాలో అలాగే తెలుసుకుంటాను అంటుంది తులసి. మరోవైపు మామగారు గురించి ఆలోచిస్తూ ఉంటుంది దివ్య. అంతలోనే అక్కడికి వచ్చిన విక్రమ్ తో నేను మీ నాన్నగారి గురించి మాట్లాడాలి అంటుంది. మాట్లాడేది ఏముంది ఆయన గురించి నీకు అన్ని తెలుసు కదా అంటాడు విక్రమ్. ఏదో బాధ ఉంది అది నువ్వు ఇప్పుడు అడగలేదా లేకపోతే నీకు అర్థం కాలేదా..
అయినా ఏదో జరగకపోతే ఆయన ఎందుకు అందరికీ దూరంగా జరుగుతారు అంటుంది దివ్య. మొదటి భార్య మీద బెంగతో అయినా నిరాశకి గురవుతున్నారు, మందులు కూడా వేసుకోవటం లేదు. మేము ఎంత చెప్పినా వినటం లేదు ఒకవేళ మాది ప్రయత్నలోపం అని నీకు అనిపిస్తే ఆయనని మార్చటానికి ప్రయత్నించు. నీవల్ల మా నాన్నగారు బాగుపడితే మా అమ్మ నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది అంటాడు విక్రమ్.
తరువాయి భాగంలో లాస్యని పిలిచి హాస్పిటల్ కి ఎందుకు వెళ్లావు అంటూ నిలదీస్తుంది తులసి. క్యాజువల్ గా వెళ్ళాను అంటుంది లాస్య. క్యాజువల్ గానే లక్షల డబ్బులు పుచ్చుకున్నావా అంటుంది తులసి. ఆమె దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావో చెప్పు అంటూ కోపంతో కొట్టడానికి చేయత్తుతాడు నందు. మరోవైపు రాజ్యలక్ష్మి దగ్గరికి వెళ్లిన నందు దంపతులు లాస్య అంతా చెప్పేసింది అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అవుతుంది రాజ్యలక్ష్మి.