- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: ప్రేమ్‌కు మళ్లీ అవమానం.. సింగింగ్ కాంపిటీషన్ గురించి శ్రుతికి చెప్పిన తులసి!
Intinti Gruhalakshmi: ప్రేమ్‌కు మళ్లీ అవమానం.. సింగింగ్ కాంపిటీషన్ గురించి శ్రుతికి చెప్పిన తులసి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జులై 2 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... భాగ్య ముందరే ఫోన్ వచ్చినట్టు నటిస్తూ పక్కా ప్లాన్ ప్రకారం తులసి, దివ్య, అంకిత పక్కకు వస్తారు.. అప్పుడు భాగ్య వెంటనే బయటకు వచ్చి మాటలు వింటుంది. ఇక తులసి ఫోన్ లో మాట్లాడుతూ ఆ బ్యాంక్ బ్రోకర్ రంజిత్ దొరికిపోయినట్టు ఒక అడ్రెస్స్ చెప్తుంది. ప్లాన్ అని తెలియని భాగ్య ఆ అడ్రెస్స్ నోట్ చేసుకుంటుంది.
ఇక రంజిత్ దొరికితే మా పరిస్థితి అంతే అని భాగ్య భయపడుతుంది. ఇక భాగ్యను ఇన్ డైరెక్ట్ గా ఫుల్ గా తిడుతూ వాళ్ళని జైల్లో వేపించి చిప్ప కుడు తినిపిస్త అని అంటుంది. అది విన్న భాగ్య వెంటనే లాస్యకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. రంజిత్ దొరికిపోయాడని.. అడ్రెస్ తెలిసిపోయిందని చెప్పగానే షాక్ అవుతుంది లాస్య.
ఇక వెంటనే భాగ్యను మనం ఒక పని చెయ్యాలి. రంజిత్ అడ్రెస్ నీకు తెలుసు కదా అక్కడికి వెళదాం అంటే వాడికి ఫోన్ చెప్పు అని భాగ్య అంటుంది. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యమని చెప్పను అని లాస్య అంటుంది. ఇక లాస్య టెన్షన్ పడేది నందు చూసి ఎందుకు టెన్షన్.. ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయు.. జాబ్ మానెయ్యు అని చెప్తాడు. అది విని లాస్య షాక్ అవుతూనే సరే అని తలా ఊపుతుంది.
మరో సీన్ లో తులసి తన ప్లాన్ ను దివ్య, అంకితతో పంచుకుంటుంది. అప్పుడే తులసి ''మ్యూజిక్ లవర్స్ అసోసియేషన్'' నిర్వహించే సింగింగ్ కాంపిటిన్ గురించి వచ్చిన ప్రకటన చూస్తుంది. వెంటనే ఆ విషయాన్నీ శృతికి చెప్పాలని ఫోన్ చేసి చెప్తుంది. కాంపిటిషన్ గురించి చెప్పి ప్రేమ్ ను పాల్గొనమని చెప్పు అని అంటుంది.
ఇక మరోవైపు ప్రేమ్ గిటార్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ బాస్ వచ్చి ప్రేమ్ ను అవమానిస్తాడు.. ఛాన్స్ ఛాన్స్ అని వెంటపడ్డావ్ కదా ఇప్పుడు ఇస్తున్న తీసుకో అని అంటూనే వేరే ఆర్టిస్ట్ వస్తాడు అని చెప్తాడు.. ప్రేమ్ బాధగా గిటార్ వాయిస్తే నీకు రాదు పెట్టదు వురికే వెంట పడుతావ్ అని తిడుతాడు. నీకంటే ఆడుకునే వాళ్ళు మేలు అని తిడుతాడు.
ఇక మరో సీన్ లో లాస్య స్కూటీ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. వెనకున్న భాగ్య భయపడుతుంది. ఇక వెనకాల తులసి వాళ్ళు ఆటోలో వెంబడిస్తుంటారు.. అప్పుడే బైక్ పడవుతుంది. దీంతో వెంటనే పరిగెత్తుతూ వెళ్తుంది. భాగ్య, లాస్య పరుగులు చూసి తులసి, దివ్య, అంకిత నవ్వుతారు. కరెక్ట్ గా ప్లేస్ చేరే సరికి ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి.