- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: నిజం తెలుసుకున్న తులసి.. లాస్య నందుకు చుక్కలు చూపించే పనిలో గృహలక్ష్మి!
Intinti Gruhalakshmi: నిజం తెలుసుకున్న తులసి.. లాస్య నందుకు చుక్కలు చూపించే పనిలో గృహలక్ష్మి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో గాయత్రి(gayathtri)దగ్గరికి లాస్య, భాగ్య ఇద్దరు వెళ్లి తులసి నష్టపోయిన 20 లక్షల డబ్బుకి అంకిత షూరిటీ సంతకం పెట్టింది అనడంతో గాయత్రీ రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు లాస్య, లాస్య ఇద్దరు తులసి(tulasi) గురించి లేనిపోని మాటలు అన్నీ చెప్పి గాయత్రి ఇంకా రెచ్చగొడతారు. మరొకవైపు పరంధామయ్య దంపతులు, దివ్య, అంకితలు ఒకచోట కూర్చొని ఉంటారు.
అప్పుడు పరంధామయ్య(paramdamayya), అంకితతో షూరిటీ,ఎందుకు సంతకం పెట్టావ్ అమ్మ అని అనగా అప్పుడు అంకిత(ankitha)ఆంటీ పరువు పోతుంది ఆ సమయంలో నాకు నేను సూటిగా ఉండటం తప్పు అనిపించలేదు అని అంటుంది అంకిత. ఇంతలోనే అక్కడికి తులసి వేడి వేడి మిర్చి బజ్జీలు తీసుకొని వస్తుంది. అప్పుడు అంకిత వాటిని తిని బాగా రుచిగా ఉన్నాయి అని అనడంతో వెంటనే గాయత్రి అక్కడికి వచ్చి బాగానే ఉంటాయి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.
అప్పుడు గాయత్రీ (gayathtri)తన తల్లి మాటలకు భయపడుతుంది. అదే అదునుగా భావించిన గాయత్రీ మాటలతో రెచ్చిపోతుంది. తులసి పై విరుచుకుపడుతూ తులసిని నానా రకాల మాటలు అంటుంది. అసలేం జరిగిందో చెప్పకుండా ఎందుకు అలా నాపై అరుస్తున్నారు అని అనడంతో వెంటనే గాయత్రీ అసలు విషయం చెప్పడంతో తులసి(tulasi) షాక్ అవుతుంది.
అప్పుడు తులసి నేను అలా షూరిటీ సంతకం చేయించుకోలేదు అని చెబుతూ ఉంటుంది. అప్పుడు అంకిత(ankitha)తులసికి ఎక్కడ నిజం తెలిసి పోతుందో అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు తులసి గాయత్రి మాటలకు ఎమోషనల్ అవుతూ నీకు ఎలా చెప్పాలి కావాలంటే నా బిడ్డ మీద ఓటు వేస్తాను అని దివ్య(divya) మీద ఒట్టు వేస్తూ ఉండగా ఇంతలో అంకిత ఆపండి అంటూ షూరిటీ సంతకం విషయం గురించి చెప్పడంతో తులసి షాక్ అవుతుంది.
ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అంటూ తులసి (tulasi)అంకితను నిలదీయడంతో మీకోసమే అని అంటుంది అంకిత. కానీ గాయత్రి మాత్రం అంకిత చేసే పనికి తులసి పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ ఉంటుంది. అప్పుడు తులసి గాయత్రీ(gayathtri)కి నీ కూతురు డబ్బులు కాకుండా నా సొంతంగా డబ్బులు తీసుకు వస్తానని మాట ఇస్తుంది.
మరొకవైపు నందు లాస్య(lasya) తన ఫ్రెండ్ దంపతులకు పార్టీ ఇస్తూ ఉంటారు. తులసి రంజిత్ కాల్ లిస్ట్ గురించి ఎంక్వయిరీ చేయడంతో ప్రతి కాల్ లాస్య నెంబర్ ఉందని అనటంతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు తులసి(tulasi) ఈసారి ఎలా అయినా లాస్య ను వదిలేది లేదు అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది తులసి.