- Home
- Entertainment
- Intinti gruhalakshmi: నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడమ్మా.. తులసిని ప్రశ్నించిన సామ్రాట్ బాబాయ్?
Intinti gruhalakshmi: నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడమ్మా.. తులసిని ప్రశ్నించిన సామ్రాట్ బాబాయ్?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సామ్రాట్, తులసి పాట గురించి తులసిని మెచ్చుకుంటాడు. ఇలాంటి గొంతు ఉండడం మీకు వారం కానీ మీరు మీ టాలెంట్ ని ఉపయోగించుకోలేదు. లేకపోతే ఇప్పటికీ మీరు పెద్ద స్టార్ అయ్యే ఉండేవారు అని అనగా తులసి గతంలో తను ఒక ప్రోగ్రాంలో పాట పాడి ,దానికి ఒక సినిమా ఆఫర్ వచ్చి, ఆ విషయం గురించి నందుకు చెప్తుంది. నందు తులసిని, నా సంపాదన సరిపోవడం లేదా?, నేను పెట్టే తిండి సరిపోవడం లేదా? అని తిడతాడు. ఆ సంగటన గుర్తుతెచ్చుకుంటూ నందు వైపు చూస్తుంది తులసి.
ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్, భర్త సహాయం ఉంటేనే భార్య ఎదగగలదు అని అనగా, లాస్య అచ్చo నందు లాగే ,నందు నాకు ఎంతో సపోర్ట్ చేస్తాడు. అలాగే నేను కూడా నందు కి సపోర్ట్ చేస్తాను. భార్యాభర్తలు అంటే ఇచ్చి పుచ్చుకోవడమే కదా! అని నందు గురించి గొప్పగా చెప్పుకుంటుంది. తులసి వాళ్ళ భర్త సమస్య ఏంటో మనకు తెలియదు కదా మనం ఎలా తప్పుపట్టగలము? అని లాస్య అనగా, సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అసలు ఏమైంది? నీకు మీ భర్తకి విడాకులు ఎందుకు అయింది? అని తులసిని అడగగా తులసి, సామ్రాట్ తో పార్టీకి పిలిచినందుకు థాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో పాటు వెళ్లిపోతుంది. తరువాత నందు, లాస్యలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఏ సమయంలో ఏం మాట్లాడగలో తెలియదా బాబాయ్? అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ని అంటాడు. దాని తర్వాత సీన్లో తులసి లాస్య అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈ లోగా ఇంట్లో వాళ్ళు ఏమైందమ్మా? బాధపడొద్దు అని అనగా, విడాకులైనప్పుడు, నీ భర్త ఎందుకు వదిలేసాడు? అని భార్యనే నింద మోస్తారు. కానీ భార్య ఎందుకు వదిలేసింది? అని భర్త దగ్గరికి ఎందుకు ఎవరూ వెళ్ళరు అని బాధపడుతూ ఉంటుంది. విడాకులు అయిన తర్వాత కూడా నా జీవితాన్ని నన్ను ఎందుకు బతకనివ్వడం లేదు? వద్దనుకున్న మనిషి తోనే ఎందుకు మళ్ళీ ఆ దేవుడు ముడి వేస్తున్నాడు? అని బాధపడుతూ ఉంటుంది తులసి.
అప్పుడు తులసి వాళ్ళ మామయ్య తులసి వేసుకున్న మంగళసూత్రాన్ని చూపిస్తూ, మీ గతాన్ని నువ్వే నీతో ఉంచుకుంటున్నావు అని అంటాడు. నువ్వు ఎందుకు పనికిరావు అన్న వ్యక్తే నీ దగ్గర ప్లాన్ కోసం ఒప్పించడానికి నాన్న తంతాలు పడుతున్నాడు. ఇదే నీ గెలుపమ్మ అని ప్రేమ్ అంటాడు. నీ గెలుపుని చూపించడానికి దేవుడు వాడిని నీ పక్కన ఉంచు ఇలా చేస్తున్నాడు అని ధైర్యం చెప్తారు. తర్వాత సీన్లో నందు ఇందాక జరిగిన సంఘటన గురించి కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోగ లక్కీ అక్కడికి వచ్చి ఒక బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. బొమ్మ ఎలా ఉంది అంకుల్? అని అనగా బాగుంది అని నందు అంటాడు.
ఇది నాకు సామ్రాట్ అంకుల్ కొనిచ్చారు చాలా కాస్ట్లీ అని అనగా, నందు కోపంతో ఆ బొమ్మని కింద కొట్టాలని చూస్తాడు. ఈలోగా లాస్య అక్కడికి వచ్చి చిన్న పిల్లాడి మీద ఎందుకు నీ కోప ప్రతాపాలు చూపిస్తున్నావు? అని తిట్టి లక్కీ నీ లోపలికి పంపించేస్తుంది. ఈ మధ్య నీకు కోపం ఎక్కువవుతుంది అని నందుని తిడుతుంది లాస్య. నందు కూడా తిరిగి తిడుతూ అసలు నువ్వు హాండ్రెస్టింగ్ గురించి ఎందుకు అక్కడ టాపిక్ తెచ్చావు అని తిడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!