- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: పార్టీలో డ్యాన్స్ చేస్తున్న సామ్రాట్, తులసిలు.. ఇంట్లో అనుమానంతో నందు, అనసూయలు!
Intinti Gruhalakshmi: పార్టీలో డ్యాన్స్ చేస్తున్న సామ్రాట్, తులసిలు.. ఇంట్లో అనుమానంతో నందు, అనసూయలు!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. తులసి సామ్రాట్ లు ఇద్దరూ కారులో నుంచి దిగుతారు అప్పుడు సామ్రాట్ కార్ టైర్ చూసి పంచర్ అయిందండి దగ్గరలో ఏమైనా ఉండడానికి ప్లేస్ లు ఉన్నాయి ఏమో చూస్తాను అని అంటాడు. అప్పుడు తులసి, ఆ దూరంగా కనిపిస్తున్న ఇంట్లో లైట్లు వేసి ఉన్నాయి. ఎవరో ఉన్నట్టున్నారు వస్తున్నప్పుడు కూడా చూశాను అని అనగా వాళ్ళిద్దరూ తడుచుకుంటూ ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ తలుపు కొట్టగానే అక్కడ ఇద్దరు అబ్బాయిలు వస్తారు. ఏమనుకోవద్దు మేము తడిసిపోయి వచ్చాము. కొంచెం ఇక్కడ తలదాచుకోవచ్చా అని సామ్రాట్ అనగా సారీ అండి కానీ తెలియని వ్యక్తులను మేము లోపలికి రానివ్వము. కావాలంటే మీకు కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేపించగలము అని అంటారు. దానికి సామ్రాట్ అలా కాదండి అనేలోగా తులసి, ఆపి వాళ్లు నిజమే చెప్పారు సామ్రాట్ గారు.
నేను కూడా నా పిల్లలకి అదే చెప్తాను తెలియని వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు అని. మీరు మంచి పనే చేశారు ఇలాంటి అప్పుడే ప్రమాదాలు తప్పుతాయి అని తులసి అంటుంది. అప్పుడు సామ్రాట్ మీకు నేను ఎవరో తెలియాలి కదా అని చెప్పి గూగుల్ లో తన పేరు కొట్టమని చెప్తాడు. అప్పుడు వాళ్ళు సామ్రాట్ పేరు కొట్టగానే ఆశ్చర్యపోయి వాళ్ళిద్దరిని లోపలికి పిలుస్తారు. మేము ఇక్కడ మా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నాము పెద్దవాళ్ళు ఎవరూ లేరు అందుకే బయట వాళ్ళు ఎవరైనా లోపలికి వస్తే భయమని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆ ఇద్దరూ లోపల ఉన్న మిగిలిన వాళ్ళందరికీ తులసి సామ్రాట్లను పరిచయం చేస్తారు. అప్పుడు తులసి ఫోన్ చేసుకోవచ్చా అని అనగా, మా ఫోన్లోనే సిగ్నల్ లేదు ఆంటీ ల్యాండ్ లైన్ ఉన్నది అని చెప్తుంది ఒక అమ్మాయి. అప్పుడు తులసి వెళ్లి ఫోన్ చేస్తుంది.
అప్పుడు ప్రేమ్ ఫోన్ ఎత్తగా ఎవరు అని అడుగుతాడు. నేను ప్రేమ్ అమ్మని అని అనగా అమ్మ అని ఫోన్ స్పీకర్లో పెడతాడు ప్రేమ్. అప్పుడు తులసి, ఇక్కడ చాలా పెద్ద తుఫాన్ లా ఉన్నది ప్రేమ్ మాకు దారిలో రాడానికి ఇబ్బంది అయింది అందుకే కార్ ఆపి ఇక్కడ ఒకరి ఇంట్లో నివాసం ఉంటున్నాము. చూస్తే ఇది ఇప్పుడు అప్పుడే తగ్గేలా లేదు నేను క్షేమంగానే ఉన్నాను అని అనగా వాళ్లు మాట్లాడుతూ, అమ్మ నువ్వేం భయపడొద్దు నువ్వు వర్షం తగ్గాకే రా!. రేపు వచ్చినా పర్లేదు జాగ్రత్తగా వస్తే చాలు అని చెప్తారు. కానీ అనసూయ ముఖం మాడిపోతుంది. ఇంతలో తులసి ఇంకా ఏదో మాట్లాడాలి అనే సమయానికి ఫోన్ సిగ్నల్ ఆగిపోతుంది. ఏమైంది అని చూసేసరికి ప్రేమ్ ఫోన్ స్విచాఫ్ అయిపోతుంది అప్పుడు పరంధామయ్య ఇంక వదిలే లేరా తులసి ఫోన్ చేసి చెప్పింది కదా అందరూ వెళ్లి మనశ్శాంతిగా పడుకోండి.
రేపు ఉదయానికి వచ్చేస్తారు అని అనగా అందరూ వెళ్తారు కానీ నందు, అనసూయ మాత్రం అక్కడే ఉండిపోతారు. పడుకో అమ్మ అని నందు అనగా నీకు నిద్ర పడుతుంది ఏమో నాకు అసలు నిద్ర పడటం లేదు వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉంటారేమో అని తెలుసుకోవడానికి భయం గా ఉన్నది అని అనసూయ అంటుంది. ఆ తర్వాత సీన్ లో తులసి సామ్రాట్ తో మనం మూలకి వెళ్లి కూర్చుందాము వీళ్ళందరూ పాపం పిల్లలు పార్టీ చేసుకుంటున్నారు కదా అంకుల్ ఆంటీ లాగా మనమెందుకు ఇక్కడ అని అనగా, ఎవరిని పట్టుకొని అంకుల్ అంటున్నారు అని సామ్రాట్ కోప్పడతాడు. మీరు అంకుల్ కాకపోయినా నేను ఆంటీ నే కదా అని అన వాళ్ళిద్దరూ సరదాగా గొడవ పడుతూ ఉండగా వాళ్ళందరూ వీళ్ళ వైపు చూసి మీరు ఎప్పుడూ ఇలాగే మాట్లాడుకుంటారా మీరు కూడా మాతో వచ్చి పార్టీ ఎంజాయ్ చేయండి అని వాళ్ళు అంటారు. వద్దు మీకు డిస్టర్బ్ గా ఉంటుంది కదా మీరేదో పార్టీ చేసుకుంటే మేము మధ్యలో వచ్చాము అని అంటుంది.
వాళ్ళు తులసి సామ్రాట్ కోలాటం వీడియో ఫోన్లో చూస్తూ మీరిద్దరూ కూడా బానే ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు రండి. అందరూ కలిసి పార్టీ చేసుకుందామని అనగా అంతలో ఒక అబ్బాయి మాట్లాడుతూ మా అమ్మ నాన్నలు బట్టలు ఆ గదిలో ఉన్నాయి ముందు వెళ్లి మార్చుకోండి పూర్తిగా తడిచి ఉన్నారు అని అంటారు. మరోవైపు పరంధామయ్య సామ్రాట్ వాళ్ళ బాబాయ్ కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పి అంతా బానే ఉన్నారు కంగారు పడొద్దు అని అంటాడు. ఆ తర్వాత సీన్ లో తులసి సామ్రాట్ లో బట్టలు మార్చుకోవడానికి వాళ్ళ వాళ్ళ గదిలోకి వెళ్తారు.
అక్కడున్న వాళ్ళందరూ సామ్రాట్ తులసీలు ఫోటోలు చూస్తూ వీళ్ళు కొత్తగా ఏదో ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టారు. బిజినెస్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ కూడానా అని ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో సామ్రాట్ అక్కడికి వస్తాడు. తులసి కూడా వస్తుంది. తులసి డ్రెస్ వేసుకుంటుంది. తలసి ని డ్రెస్ లో చూడడం సామ్రాట్ కి అదే మొదటిసారి. వాళ్ళు అలాగా కొద్దిసేపు డ్యాన్సులు వేస్తూ ఆడుకుంటూ ఉండగా ఆ గ్రూప్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. నేను నిన్ను మొదటి నుంచి నా స్నేహితురాలని అనుకున్నాను.
కానీ మనది స్నేహం కాదు అంతకుమించి ఏదో అది నాకు ఈ మధ్య తెలిసింది అని అనకా తను కూడా ఓకే అంటుంది. అప్పుడు తులసి అమ్మాయి దగ్గరికి వెళ్లి దాచుకున్న ప్రేమ దాచుకున్న బంగారం లాంటిది ఎప్పుడూ కాపాడుకో అని చెప్తుంది. తర్వాత వాళ్ళందరూ డాన్స్ వేస్తూ ఉండగా సామ్రాట్ కి ఆయాసం వచ్చి కూర్చుంటాడు. సామ్రాట్ గారు మీరు గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకోండి ఆయాసంగా ఉన్నట్టున్నది నేను వెళ్లి కాషాయం తీసుకొని వస్తాను అని అనగా ఇప్పుడు అవన్నీ వద్దు అని సామ్రాట్ అంటాడు. దానికి తులసి ఇంకేం చెప్పద్దు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది.
మరోవైపు నందు గడియారం ముళ్ళు వైపు చూస్తూ టైం తెల్లార్వారు జామున 3:00 అయింది. అయినా వాళ్ళు ఒకే గదిలో ఉంటారా భయంగా ఉన్నది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!