MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: సంతోషంలో తులసి సామ్రాట్.. కళ్ళు తిరిగి పడిపోయిన అనసూయ?

Intinti Gruhalakshmi: సంతోషంలో తులసి సామ్రాట్.. కళ్ళు తిరిగి పడిపోయిన అనసూయ?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 30 2022, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో  సామ్రాట్, తులసి ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో అక్కడికి వెళ్తారు. అప్పుడు సామ్రాట్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది అని అనగా ఆ షాప్ అతను ఐస్ క్రీం లానే ఉంటుంది అనడంతో వెంటనే తులసి నవ్వుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తీసుకొని తింటుండగా సామ్రాట్ మీసాలకు అయ్యేవిధంగా తింటూ ఉండటంతో అతి తులసి ఫోన్లో ఫోటో తీసి చూపించి నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత సామ్రాట్ తన చేతిలో ఉన్న ఐస్క్రీం తులసికి ఇచ్చి అక్కడ బిల్ పే చేయడానికి చూడగా అప్పుడు సామ్రాట్ పర్స్ కారులో మర్చిపోయి ఉండడంతో అక్కడికి వెళ్తాను అని అనగా ఫస్ట్ ఈ ఐస్క్రీం తినండి ఆ తర్వాత చూద్దాం అని కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది తులసి.

27

ఇప్పుడు తులసి బిల్ కట్టాల్సిన అవసరం లేదు చిన్నతనం మాదిరే ఇప్పుడు ఐస్క్రీం బిల్ కట్టకుండా పారిపోదాము అని అంటుంది. ఇప్పుడు చిన్నప్పుడే దొరకలేదు ఇప్పుడు దొరుకుతామా అని అనగా వెంటనే సామ్రాట్ అతడు దొరికితే పట్టుకుంటే పరువు పోతుంది అని భయపడుతూ ఉంటాడు. అప్పుడు తులసి అంత పిరికితనం ఏంటండీ తాటి చెట్టులా ఎదిగారు ఆడదాన్ని నేనే ధైర్యంగా ఉన్నాను నాకు కంపెనీ ఇవ్వలేరా అని అంటుంది. ఇప్పుడు దేవుడా ఎలాగోలా రక్షించు పారిపోకపోతే ఈవిడ దగ్గర పరువు పోతుంది అనుకుంటూ ఉంటాడు. తులసి కామెడీగా మాట్లాడుతూ కౌంట్ డౌన్ చేస్తూ అక్కడ నుంచి పరిగెత్తు కుంటూ వెళ్ళిపోతుంది.

37

అప్పుడు సామ్రాట్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అన్ని తలుచుకుంటూ ఉండడంతో అది చూసి తులసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి అతనికి నేను డబ్బులు పే చేశాను మీరు ఐస్క్రీమ్ తింటుండగా అని అనడంతో అంటే డబ్బులు పే చేసి నాతో ఇలా రన్నింగ్ చేయిస్తారా అని అంటాడు సామ్రాట్. మరొకవైపు పరంధామయ్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అనసూయ అక్కడికి వచ్చి పరంధామయ్య కాళ్లు పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. మన ఇన్నేళ్ల కాపురంలో ఇది లాస్ట్ అవకాశం గా భావించి నన్ను క్షమించండి అని వేడుకుంటూ ఉంటుంది అనసూయ. అప్పుడు అనసూయ బాధపడుతూ నేను మిమ్మల్ని దారుణంగా అవమానించాను ఘోరమైన పాపం చేశాను అని బాధపడుతూ ఉంటుంది.
 

47

క్షమించకపోయిన కనీసం శిక్షించండి అని అనడంతో ఆ దేవుడు ఎప్పుడో శిక్షించాడు అనసూయ అని అంటాడు పరంధామయ్య. నువ్వు ఈ ఇంటి యజమానురాలివి కాలి మీద కాలు వేసుకుని కూర్చోవాలి అలాంటిది ఇప్పుడు ఎలా ఉన్నావో చూడు. రేపు నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని తలుచుకుంటే భయం వేస్తుంది అని అంటాడు పదందామయ్య. అప్పుడు వారిద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు పరంధామయ్య అక్కడ నుంచి వెళ్ళిపోతుండడంతో అప్పుడు అనసూయ చేతులు పట్టుకొని ఏవండీ మీరు నన్ను క్షమించరని తెలుసు. అయినా నేను మిమ్మల్ని రోజు క్షమించమని అడుగుతూనే ఉంటాను అని అంటుంది. ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాను.
 

57

ఏదో ఒక రోజు నా కన్నీళ్లు నా పాపాన్ని కడిగేస్తాయేమో అని అనుకుంటున్నాను అనడంతో పరంధామయ్య పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు అనసూయ ఏవండీ ఏవండీ అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అనసూయ అని గట్టిగా అరుస్తాడు పరంధామయ్య. మరొకవైపు తులసి సామ్రాట్ ఇద్దరు నవ్వుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. నేనేం చెప్పినా మీరు కాదు అంటారు అని అనగా వెంటనే సామ్రాట్ అందుకు ఒక దురాశ ఉంది. మీరు చెప్పినదానికి నేను అవును అంటే ఆ టాపిక్ అంతటితో ఆగిపోతుంది లేకపోతే మాట్లాడుకుంటూ ఉండవచ్చు కదా అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు.
 

67

 అప్పుడు తులసి వాళ్ళ ఇల్లు రావడంతో సామ్రాట్ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తులసికి ప్రేమ్ ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు అనసూయ కి అభి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి నందు వస్తాడు. అప్పుడు తులసి అక్కడికి వస్తుంది. అప్పుడు అనసూయకు మెలుకువ వచ్చి తులసిని అక్కడికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు తులసి తో మాట్లాడుతూ లాస్య అని పిలవగానే నేను ఇక్కడే ఉన్నాను అత్తయ్య అనడంతో నువ్వు బయటికి వెళ్ళు అని అంటుంది అనసూయ. అప్పుడు ఏంటి అత్తయ్య మీ ఉద్దేశం ఫ్యామిలీ అన్నప్పుడు నేను ఉండాలి కదా అనడంతో నందు బయటికి వెళ్ళు అనగా సరే నేను వెళ్తాను మరి ఫ్యామిలీ అన్నప్పుడు తను ఇక్కడ ఎందుకు ఉంది అంటూ నందుతో వాదిస్తుంది లాస్య.
 

77

అప్పుడు నందు కోప్పడి లాస్య అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడంతో లాస్య వెళ్ళిపోతుంది. నన్ను క్షమించు తులసి మీ మావయ్యని తప్పుగా మాట్లాడి పెద్ద తప్పు చేశాను. అప్పుడు చేతులు జోడించి అనసూయ నమస్కరిస్తూ అందరిని క్షమించమని వేడుకుంటుంది. అప్పుడు తులసి అత్తయ్య మేము మీ కంటే చిన్నవాళ్ళము మమ్మల్ని దీవించాల్సింది పోయి ఇలా చేతులు పెట్టి దండం పెట్టడం ఏంటి అని అంటుంది. వయసులో మీకంటే పెద్దదాన్ని అయినా బుద్ధిలో మీకంటే చాలా చిన్నదాన్ని అంటూ తాపత్రయం పడుతూ బాధపడుతూ ఉంటుంది అనసూయ.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ పోతినేని కి పెళ్లంటే ఇష్టం లేదా..? బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడా? మ్యారేజ్ పై ఎనర్జిటిక్ స్టార్‌ కామెంట్స్..
Recommended image2
OTT: జీవితానికి రీసెట్ బటన్ ఉండదు.. ఈ తరం వారి కళ్లు తెరిపించే సినిమా. ఓటీటీలో స్ట్రీమింగ్
Recommended image3
Dacoit Collections: వీకెండ్‌లో సూపర్, మరి సోమవారం అడివి శేష్ డెకాయిట్ కలెక్షన్ రిపోర్ట్ సంగతేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved