MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: లాస్య నిజస్వరూపం తెలుసుకున్న నందు.. సంతోషంలో తులసి సామ్రాట్?

Intinti Gruhalakshmi: లాస్య నిజస్వరూపం తెలుసుకున్న నందు.. సంతోషంలో తులసి సామ్రాట్?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 29 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Nov 29 2022, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్ లో నందు ఆ పేపర్స్ చూసి షాక్ అవ్వగా వెంటనే తులసి ఏంటది నందగోపాల్ గారు అని అడగడంతో అప్పుడు లాస్య నందగోపాల్ గారు షాక్ లో ఉన్నారు మాట రావడం లేదు. ఇవి తులసి స్వచ్ఛందంగా ఈ ఇంటిని నా పేరు మీదకి రాసిచ్చిన డాక్యుమెంట్స్ అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తులసి నేను అత్తయ్య గారి పేరు మీద రాసిచ్చాను కదా అని అనగా లాస్య చెబితే నమ్మవు సంతకం పెట్టావు కానీ డాక్యుమెంట్స్ చదవలేదు కదా నందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు లాస్య నీ ఎమోషన్స్ తో నేను ఆడుకున్నాను తులసి అనగా అనసూయ ఇది మోసం అని అనడంతో వెంటనే అభి యు చీట్ అని అంటాడు.
 

25

 వెంటనే లాస్య మైండ్ యువర్ లాంగ్వేజ్ మీరందరూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ నన్ను ఒంటరిదాన్ని చేశారు అని అంటుంది. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఏ రోజు నువ్వు నా సొంతం అన్న ఫీలింగ్ నాకు కలగలేదు అందుకే మోసం చేసి ఈ ఇంటిని నా పేరు మీదికి రాయించుకున్నాను నన్ను క్షమించు నందు అని అంటుంది లాస్య. అందరూ షాక్ లో ఉంటారు. ఇప్పుడు తులసి కోపంతో ఛీ సిగ్గు లేకపోతే సరి మోసం చేసి మరి మాట్లాడుతున్నావు ప్రేమగా అడుక్కోవాల్సింది ముష్టి వేసేదాన్ని అని అనడంతో ఇప్పుడు లాస్య తులసి అని అరవగా ఇప్పుడు తులసి తన మాటలతో లాస్యకు బుద్ధి చెబుతుంది.
 

35

అప్పుడు లాస్య ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను అని అంటుంది. అప్పుడు మీరందరూ నా వాళ్లు అనడంతో వెంటనే నందు నువ్వు మా అమ్మ నాన్న ఎప్పుడైతే అవమానించావో అప్పుడు నువ్వు పరాయి దానివి అయ్యావు అని అంటాడు. అయినా ఇప్పుడు నేనేమీ తప్పు మాట్లాడటం లేదే అందరినీ ఇంటి లోపలికి రమ్మంటున్నాను అని అంటుంది లాస్య. ఇప్పుడు ప్రేమ్,అభి వాళ్ళందరూ మేము మా అమ్మ దగ్గరే ఉంటాము అని అనడంతో అప్పుడు తులసి మీరేమంటారు నందగోపాల్ గారు అని అనగా వెంటనే లాస్య అందరూ డిస్కస్ చేసుకుని నాకు మెసేజ్ చేయండి అని ఆ పేపర్ తీసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది.
 

45

 అప్పుడు నందు బాధపడుతుండగా వెంటనే తులసి మామయ్య మీ అబ్బాయి అంత బాధ పడుతున్నాడు మీరందరూ ఇక్కడే ఉండి ఆయనకు సపోర్ట్ చేయండి అని అంటుంది.ఆ తరువాత తులసి అందరినీ ఒకటి చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తులసి సామ్రాట్ ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు మీరు మావయ్యనీ తీసుకొని వచ్చి మంచి పని చేశారు అని తులసి అనడంతో అక్కడికి పిలుచుకొని వచ్చి నేను దేవుడి మీద భారం వేసాను తులసి గారు కానీ అంతా మంచికే జరిగింది అని అంటాడు సామ్రాట్.
 

55

అప్పుడు సామ్రాట్ తులసికి తన మాటలతో ధైర్యం చెబుతాడు. అప్పుడు తులసి బాధపడుతుండడంతో వెంటనే తులసికి పంచులు వేసి  నవ్విస్తాడు. ఆ తర్వాత తులసి సారీ చెప్పగా ఇంతలో కార్ ఆగిపోవడంతో సామ్రాట్ కార్ చెక్ చేస్తుండగా మీకే కాకుండా మీ కారు కూడా సారీ చెప్పమంటారా అనగా సామ్రాట్ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు తులసి సామ్రాట్ ఇద్దరూ కారు చెడిపోవడంతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇద్దరు ఫన్నీగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ రోడ్డుపై పాటలు పాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ మీద జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటుంది తులసి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image2
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Recommended image3
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved