- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: దిక్కుతోచని స్థితిలో తులసి.. నిజం చెప్పి కోడలికి షాకిచ్చిన రాజ్యలక్ష్మి!
Intinti Gruhalakshmi: దిక్కుతోచని స్థితిలో తులసి.. నిజం చెప్పి కోడలికి షాకిచ్చిన రాజ్యలక్ష్మి!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటికి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో మంచి టీఆర్పీ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. భర్తని బ్లాక్ మెయిల్ చేసి తన దారిలోకి తెచ్చుకున్న ఒక శాడిస్ట్ భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నా నుంచి నువ్వు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్పు అంటాడు నందు. మనిద్దరం కలిసి ఉండాలి అదే విషయాన్ని కోర్టులో చెప్పు ఆ తర్వాత మనిద్దరం కలిపి వేరు కాపురం పెట్టాలి అంటుంది లాస్య. ఈ ఒక్క విషయాన్ని ఒప్పుకోను అంటాడు నందు. మనం కలిసి ఉండడం వాళ్లకి ఇష్టం లేదు కలిసి ఉండి కొట్టుకోవడం కంటే విడిగా ఉండే వాళ్లకి కావాల్సినవన్నీ సమకూర్చితే వాళ్ళు మనం అందరం హ్యాపీగా ఉంటాము అని నచ్చ చెప్తుంది లాస్య. వేరే దారి లేకపోవడంతో అన్ని కండిషన్స్ కి ఒప్పుకుంటాడు నందు.
మరోవైపు దివ్య దగ్గరికి వచ్చిన విక్రమ్ మీ అమ్మ నా గురించి ఏమనుకుంటుంది నా చేతులు పట్టుకొని బ్రతిమాలి నన్ను విలన్ని చేద్దామనుకుంటుందా అని గొడవపడతాడు. మధ్యలో మా అమ్మ ఏం చేసింది అయినా కూతురు కోసం తపనపడటం నీకు తప్పుగా అనిపిస్తుందా అంటూ దివ్య కూడా తిరగబడుతుంది. ఇద్దరూ మాటకి మాట అనుకోవటంతో కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. మరోవైపు బయటికి వెళ్తున్న నందుతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు పరంధామయ్య దంపతులు.
ఎక్కడికి వెళ్తున్నావు కాదు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగండి ఎందుకు మా ఇద్దరినీ వేరు చేసి మాట్లాడుతారు అని అప్పుడే వచ్చిన లాస్య అత్తమామల్ని అడుగుతుంది. మళ్లీ తనే ఇద్దరం కలిసి కెఫీకి వెళ్తున్నాము అంటుంది. అదేంటి కేఫ్ కి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పావు కదా అంటాడు పరంధామయ్య. నేను చెప్పానా మనిద్దరిని కలిసి కేఫ్ కి వెళ్తున్నాము అంటేనే ఇంత రియాక్షన్ ఇస్తున్నారు అలాంటిది మనం విడిగా కలిసి ఉండబోతున్నాము అంటే ఇంకెంత రియాక్షన్ ఇస్తారో అని వెటకారంగా మాట్లాడుతుంది లాస్య.
అవునా నందు లాస్య చెప్పేది నిజమేనా ఇది తన నిర్ణయమా నీ నిర్ణయమా అని అడుగుతాడు పరంధామయ్య. ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం అని చెప్తాడు నందు. నందు మాటలకి షాక్ అవుతారు తులసి ఆమె అత్తమామలు. వాడిని బలవంతంగా లొంగ తీసుకున్నట్లు ఉన్నావు అని గట్టిగా మాట్లాడుతుంది అనసూయ. మీ మీ మొగుడు పెళ్ళాలు ఇద్దరు గొడవపడి మామయ్య ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతే మీరు సర్దుబాటు చేసి ఇంట్లోకి తీసుకు రాలేదా.
మీరు చేస్తే ఒప్పు నేను చేస్తే తప్పు నా అంటూ నిలదీస్తుంది లాస్య. తులసి తో నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు భర్తని ప్రేమతో లొంగ తీసుకోవాలి అని చెప్పావు కదా ఇప్పుడేమంటావు అంటుంది లాస్య. లాస్యని ఏమి అనలేక కోపంగా లాస్యని అక్కడ నుంచి తీసుకెళ్లి పోతాడు నందు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత నువ్వు ఏమి మాట్లాడవు తెలిసి వాడిని లాస్య బలవంతంగా తన వైపు తిప్పుకుంది.
మేము మాట్లాడినప్పుడు నువ్వు నాకు సపోర్ట్ గా మాట్లాడి ఉంటే బాగుండేది కదా అంటారు పరంధామయ్య దంపతులు. ఆయన నిర్ణయాన్ని ముందుగా మీతో చెప్పారా మామయ్య.. ఆయన మనసులో ఏముందో చెప్పకపోతే మనం మాత్రం ఏం చేస్తాము. అక్కడ దివ్య పరిస్థితి అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది తెగించి ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. ఏం చేయటానికి దిక్కుతోచటం లేదు అని తల పట్టుకుంటుంది తులసి.
మరోవైపు మామగారికి భోజనం తీసుకు వెళుతుంది దివ్య. అప్పటికే తాతయ్య ప్రకాశానికి భోజనం తినిపిస్తూ కనిపిస్తాడు. అదేంటి తాతయ్య మీరు భోజనం పెట్టడం నేను ఉన్నాను కదా అంటుంది దివ్య. ఎవరి మీద ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకోకూడదమ్మ ఎవరు ఎన్ని రోజులు ఎక్కడ ఉంటారో తెలియదు కదా అందుకే మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకని మాకు ఈ చీకటి బ్రతుకులు అలవాటే అంటూ నిష్టూరంగా మాట్లాడుతాడు తాతయ్య.
ఎందుకు తాతయ్య నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతారు ఈ బాధ్యత నాకు లేదా నేను మావయ్యని వదులుకుంటానా అంటుంది దివ్య. నువ్వు భర్తనే వదులుకోవటానికి సిద్ధపడుతున్నావు అంటాడు తాతయ్య.ఆ మాటలకి షాక్ అవుతుంది దివ్య నేను ఏం చేశాను అని అంటుంది. నువ్వు అనుకున్నది సాధించాలంటే ప్రణాళిక, పట్టుదల కావాలి అంటాడు తాతయ్య.
తరువాయి భాగంలో మేము కోర్ట్ కి వెళ్తున్నాము అక్కడ తీర్పు ఇచ్చిన తర్వాత అట్నుంచి అటే వేరుగా వెళ్ళిపోతున్నాము అని పరంధామయ్య దంపతుల దగ్గర ఆశీర్వచనం తీసుకుంటారు నందు దంపతులు. మరోవైపు రాజ్యలక్ష్మి కొడుకుతో మీ మామగారు లాస్య తో కలిసి వేరే కాపురం పెడుతున్నారు పాపం దివ్యకి ఇకమీదట తండ్రిని చూసి అవకాశం ఉండదు అని చెప్పింది. ఆ మాటలు విన్న దివ్య షాక్ అవుతుంది.