పవన్ కళ్యాణ్ పొట్టపై ట్రోలింగ్, చరిత్ర బయటకి తీస్తూ తిప్పి కొడుతున్న ఫ్యాన్స్
ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పాల్గొన్న సంగతి తెలిసిందే. త్రివేణి సంగమంలో పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ, మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి పుణ్య స్నానాలు ఆచరించారు.

Pawan Kalyan
ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పాల్గొన్న సంగతి తెలిసిందే. త్రివేణి సంగమంలో పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ, మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి పుణ్య స్నానాలు ఆచరించారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
పవన్ కళ్యాణ్ సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. పవన్ కళ్యాణ్ తన బాడీలో ఫిట్ నెస్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పొట్ట ఎక్కువగా కనిపించింది. దీనితో కొందరు పవన్ ని ట్రోల్ చేస్తూ ఫ్యామిలీ ప్యాక్ అని కామెంట్స్ చేస్తున్నారు. పవర్ స్టార్ ఇలా అయిపోయాడు ఏంటి అని సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ.. మహా కుంభమేళాలో స్నానం చేస్తున్న ఫోటోలు వైరల్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పొట్ట గురించి కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా తగ్గడం లేదు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ తగ్గించి చాలా కాలం అవుతోంది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలపై, ఫిట్ నెస్ పై బాగా ద్రుష్టి తగ్గించారు. నిర్మాతలకు డేట్లు ఇచ్చినప్పుడు షూటింగ్ ముగించుకుని వెళుతున్నారు. అంతే తప్ప తన ఫిట్ నెస్ ని పట్టించుకోవడం లేదు.
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక షూటింగ్స్ కి డేట్లు ఇవ్వడం కూడా కష్టం అయిపోయింది. ఇక ఫిట్నెస్ మైంటైన్ చేయడం కోసం టైం ఎక్కడిది అని పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలపైనే ఫోకస్ తో ఉన్న సమయంలో ఆయన ఫిట్నెస్ ఎవరికీ లేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ తెలుసు. చాలా చిత్రాల్లో షర్ట్ లేకుండా రిస్క్ తో కూడిన స్టంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
స్టైల్, ఫిట్నెస్ విషయంలో అప్పటి యువతకి పవన్ అంటే పిచ్చ క్రేజ్ ఉండేది. కానీ ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్న టైంలో బాడీ గురించి ట్రోల్స్ చేయడంలో అర్థం లేదు అని ఫ్యాన్స్ అంటున్నారు. అది కూడా సాంప్రదాయ బద్దంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్న దృశ్యాలతో ఇలాంటి ట్రోల్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఆయన చేస్తున్న రాజకీయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చూడకుండా.. పొట్టని మాత్రం గమనించి ట్రోల్ చేయడం సిగ్గు చేటు అంటూ పవన్ అభిమానులు ట్రోలర్స్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.