- Home
- Entertainment
- షాకింగ్ రీజన్ తో హీరోయిన్ అంజలి పై ట్రోలింగ్.. ఆస్తుల చిట్టా వైరల్, అది కూడా ఆమె తప్పేనా ?
షాకింగ్ రీజన్ తో హీరోయిన్ అంజలి పై ట్రోలింగ్.. ఆస్తుల చిట్టా వైరల్, అది కూడా ఆమె తప్పేనా ?
తెలుగు బ్యూటీ అంజలి గురించి పరిచయం అవసరం లేదు. జర్నీ చిత్రంతో తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

తెలుగు బ్యూటీ అంజలి గురించి పరిచయం అవసరం లేదు. జర్నీ చిత్రంతో తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, మసాలా లాంటి చిత్రాలు అంజలి ఇమేజ్ పెంచాయి. గత ఏడాది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటించింది. అంజలి చివరగా నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రంలో మెరిసింది. రారా రెడ్డి అంటూ ఐటెం సాంగ్ లో చిందేసింది.
అంజలి తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచింది. జర్నీ మూవీ హీరో జైతో కొంతకాలం అంజలి సహజీవహం చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఊహించని విధంగా అంజలి ఆస్తుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమెపై కొందరు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
అంజలి దాదాపుగా 2006 నుంచి 15 ఏళ్ళకి పైగా నటిగా కొనసాగుతోంది. ఇన్నేళ్లు హీరోయిన్ గా కొనసాగిన నటి భారీగానే ఆస్తులు పోగేసుకుని ఉంటారు. కానీ అంజలికి ఆస్తులు అంతగా లేవట. ఆమె ఆస్తుల గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
చెన్నై, హైదరాబాద్ నగరాల్లో అంజలి మొత్తం ఆస్తుల విలువ రూ.10 కోట్లు అని అంటున్నారు. దాదాపు 15 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతున్న నటి ఆస్తులు ఇంతేనా అని నెటిజన్లు అంటున్నారు. సినిమాకి దాదాపు రూ 50 లక్షల నుంచి కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకునే అంజలి ఆస్తుల విలువ ఇంతేనా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అది కూడా ఆమె తప్పేనా అంటూ అంజలి ఫాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అంజలికి తన కుటుంబ సభ్యులతో ఆస్థి గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అంజలి పిన్నితో ఆస్తికి సంబంధించిన గొడవలు చాలా రోజుల క్రితం మొదలయ్యాయి. ఆస్థి గురించి తేల్చుకునేందుకు వీరు కోర్టుకి కూడా ఎక్కారు. కుటుంబ సభ్యులతో గొడవల తర్వాత ఎవరినీ నమ్మకూడదని డిసైడ్ అయినట్లు అంజలి గతంలో తెలిపింది.
ప్రస్తుతం అంజలి వివాదాలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం అంజలి శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ RC15 చిత్రంలో నటిస్తోంది. గతంలో మాదిరిగా అంజలికి పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలు రావడం లేదు.