బన్నీ, త్రివిక్రమ్ మూవీ స్టోరీ ఇదేనా.. మహాభారతం మీద పడ్డ మాటల మాంత్రికుడు, కానీ
త్రివిక్రమ్ తన కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. వందల కోట్ల బడ్జెట్ లో విజువల్ వండర్ ని తీర్చిదిద్దెందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు బన్నీ కెరీర్ లో మెమొరబుల్ మూవీస్ గా నిలిచాయి. అందరిలో ఉత్కంఠ పెంచుతూ వీరిద్దరి కాంబినేషన్ లో నాల్గవ చిత్రాన్ని అనౌన్స్ చేశారు .
ఇప్పటి పాన్ ఇండియా చిత్రాల ట్రెండుకి తగ్గట్లుగా అనౌన్స్ మెంట్ అదిరిపోయింది. ఇప్పటి వరకు త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీస్ జోలికి పోలేదు. కానీ ఆయన సత్తా ఏంటో అందరికి తెలిసిందే. ఇటీవల త్రివిక్రమ్ ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలతోనే మ్యాజిక్ చేస్తూ వచ్చారు. బన్నీ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం పుష్ప 2 సిద్ధం అవుతోంది. పుష్ప 2 తర్వాత బన్నీ నటించే మూవీ అంతకంటే భారీ స్థాయిలో ఉండాలి.
అందుకు తగ్గట్లుగానే త్రివిక్రమ్ తన కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. వందల కోట్ల బడ్జెట్ లో విజువల్ వండర్ ని తీర్చిదిద్దెందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. అంత భారీ చిత్రం తెరకెక్కించడానికి త్రివిక్రమ్ ఎలాంటి కథ సిద్ధం చేశారు ? అనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ చిత్ర కథకి సంబందించిన లీకులు మొదలయ్యాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పురాణాలపై మంచి పట్టు ఉంది. కానీ ఎప్పుడూ ఆ కథలతో చిత్రాలు ప్రయత్నించలేదు. తన ప్రసంగాల్లో మాత్రం త్రివిక్రమ్ తరచూ మహాభారతం, రామాయణం గురించి చెబుతుంటారు. అయితే తొలిసారి త్రివిక్రమ్ మహాభారతంలోని ఓ పర్వం తీసుకుని దానితో సోసియో ఫాంటసీ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఇది పౌరాణిక చిత్రం కాదు.. అలాగని జానపద చిత్రమూ కాదు. మహాభారతంలోని ఆమె అంశాన్ని తీసుకుని విజువల్ వండర్ గా తీర్చిదిద్దగలిగే ఫాంటసీ కథని సిద్ధం చేశారట. దేశం మొత్తం ఈ చిత్రం వైపు చూసేలా భారీ బడ్జెట్ లో కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రం ఉండబోతోందని టాక్. రానున్న రోజుల్లో ఈ చిత్రంపై మరింత క్లారిటీ రానుంది.
హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే బన్నీ పుష్ప 2 ఫినిష్ కాగానే ఈ చిత్రం పట్టాలపైకి వెళుతుంది. ఇంతలోపు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుంటాయి.