మాటల మాంత్రికుడు, సెంటిమెంట్లకు బ్రాండ్, త్రివిక్రమ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..?
మాటల మాంత్రికుడు, డైలాగ్స్ రాయడంలో దిట్ట, గురువుగారు అనే పేరుకు నిర్వచనంగా నిలిచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.
టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. రైటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి..దర్శకుడిగా మారి.. స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. స్టార్ డైరెక్టర్ గా అవతారం ఎత్తాడు మాటలమాత్రికుడు. త్రివిక్రమ్ ఆయన రాసిన నువ్వు నాకు నచ్చావ్,మన్మధుడు, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి ఆయన దర్శకత్వంలో వచ్చిన నువ్వే నువ్వే, అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిపోయాయి
ప్రస్తుతం మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడ త్రివిక్రమ్ శ్రీనివాస్..మహేష్ సినిమా తరువాత అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఈ ఇద్దరు హీరోలతో చెరో మూడు సినిమాలు చేశాడు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ గురించి ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి అంటే.. ఇప్పుడు పెద్దగా ఫాలో అవ్వడం లేదు కాని.. ఆయన టైటిల్ సెంటిమెంట్ బాగా పాలించేవారు. టైటిల్స్ కు అ సెంటిమెంట్ ను బాగా ఫాలో అవుతాడు.
ఆయన చేసిన సినిమాల్లో ఎక్కుగా అతో స్టార్ట్ అయినవే ఎక్కువ, అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అఆ, అరవింద సమేత లాంటిసినిమాలు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ సెంటిమెంట్ తో చేసిన సినిమాలు త్రివిక్రమ్ కు ఎక్కువగా హిట్లను అందించాయి. దాంతో ఆయన ఎక్కువగా ఆ కలిసోచ్చేలా టైటిల్స్ ప్లాన్ చేసేవాడు. ఇప్పుడు అది కాస్త తగ్గిందనే చెప్పాలి.
Trivikram Srinivas
త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు.. అక్క చెల్లెలు పక్కాగా కనిపిస్తారు. వీలైతే.. అక్కను చూడటానికి వెళ్లి చేల్లిని చేసుకోవడం, లేదా స్నేహితురాలిని చేసుకోవడం.. ఇలాంటివి ఎక్కువగా త్రివిక్రమ్ సినిమాల్లో కనిపిస్తాయి. దానికి ఓ కథ కూడా ఉందట. అదేంటంటే.. త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నావిడ దివంగత రచయిత సీతారామశాస్త్రి గారి అన్నయ్య కూతురు. అయితే ఇక్కడే ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిదంట. ఆయన పెళ్లి చూపుల కోసం చూడడానికి వెళ్ళాడు. అక్కడ అక్క ని చూపిస్తే త్రివిక్రమ్ కి మాత్రం పక్కనే కూర్చున్న చెల్లెలు నచ్చిందట.
దాంతో పెద్దలను ఒప్పించి తనకు నచ్చిన చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు స్టార్ డైరెక్టర్. బహుశా త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే చిన్న అమ్మాయిని ప్రేమించడం అనేది ఆయన నిజ జీవితం ఆధారంగానే సినిమాల్లో రాసుకుంటారు ఏమో అని ఇండస్ట్రీ టాక్. కమెడియన్ సునిల్, త్రివిక్రమ్ రూమ్మెంట్స్. ఇద్దరు కలిసి సినిమా కష్టాలు అనుభవించారు.
రూమ్ లో సరిగ్గ తిండి కూడా లేకుండా నిళ్లు తాగి గడిపిన రోజులు కూడా ఉన్నాయట. అందుకే త్రివిక్రమ్ చేసిన ఏ సినిమాలో దరిద్రం కనిపించదు. హీరో ఎంత పేదవాడు అయినా.. పేదరికంలో కూడా రిచ్ నెస్ కనిపించేలా చూపిస్తాడు శ్రీనివాస్. కెరీర్ బిగినింగ్ లో విజయభాస్కర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమాలు వరుసగా వచ్చాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్ గా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు.
అయితే త్రివిక్రమ్ ఎప్పుడైతే డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాడో.. అప్పటినుంచి వీరిద్దరి కాంబినేషన్ కి బ్రేక్ పడింది ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో విజయ భాస్కర్ గారికి కథ రాయలేకపోయారు. ఆ తర్వాత విజయభాస్కర్ దర్శకుడుగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ దాంట్లో ఏ సినిమాలు పెద్దగా ఆడలేదని చెప్పాలి.
Bheemla Nayak
ఇండస్ట్రీలో 24 ఏళ్లు పూర్తి చేసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1971 నవంబర్ 7న జన్మించారు. అతని అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 'త్రివిక్రమ్' అనే తన కలం పేరుతోనే ప్రాచుర్యం పొందారు. 1999లో 'స్వయంవరం' సినిమాకు కథ-మాటలు అందించడంతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది.
త్రివిక్రమ్ ఇప్పటి వరకూ 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ డైలాగ్ రైటర్‌గా ఆరు నంది పురస్కారాలను అందుకున్న ఆయన.. ఉత్తమ దర్శకుడిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. అలానే భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 లో ఆయనకు బీఎన్ రెడ్డి జాతీయ అవార్డును ప్రధానం చేసింది.
త్రివిక్రమ్ పెన్నుకు పదునెక్కువ.. మాటలకు సూటితనం ఎక్కువ.. అందుకే ఆయన మాటల్లో చమత్కారాలు రాలుతుంటాయి. సామెతలు డొర్లుతుంటాయి. లాజిక్ లు బ్రేక్ డాన్స్ చేస్తుంటాయి. చిట్టి మెదళ్ళు కూడా చిక్కుముడులు విప్పి ఆనందించగలిగే పదాలు చెప్పడంతో త్రివిక్రమ్ సిద్దహస్తుడు. అశ్లీలం లేని..హాస్యం తెరపై చూపించడంతో.. త్రివిక్రమ్ అభినవ జంధ్యాల అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో హ్యాపీ బర్త్ డే త్రివిక్రమ్ శ్రీనివాస్.