పెళ్లి వార్తలపై త్రిష షాకింగ్ పోస్ట్.. మీ వెనుకున్నది ఎవరో తెలుసంటూ దిమ్మతిరిగే కౌంటర్..
అందాల తార త్రిష.. పెళ్లి చేసుకోబోతుందనే వార్తల ఇటీవల ఊపందుకున్నాయి. ఓ నిర్మాతని పెళ్లి చేసుకుంటుందని నెట్టింట న్యూస్ వైరల్ అవుతుంది. తాజాగా దీనిపై స్పందించిన త్రిష పెద్ద షాకిచ్చింది.
నాలుగు పదులు దాటినా తరగని అందం త్రిష సొంతం. ఇరవై ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమె అందం మరింత పెరిగింది. ఇప్పుడు సూపర్ స్టార్స్ తో జోడీ కడుతూ బిజీగా ఉన్న త్రిష.. త్వరలో పెళ్లిచేసుకోబోతుందనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన నిర్మాతని త్రిష మ్యారేజ్ చేసుకోబోతుందని, త్వరలోనే ఆమె పెళ్లి పీఠలెక్కబోతుందని అంటున్నారు. ఈ సారి రూమర్ బలంగా చక్కర్లు కొడుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా త్రిష రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో వేదిక(ఎక్స్-ట్విట్టర్) ద్వారా ఆమె పెళ్లి రూమర్స్ కి సమాధానం చెప్పకనే చెప్పింది. అయితే ఇందులో చాలా స్ట్రాంగ్‌గా ఆమె ఆన్సర్ ఇవ్వడం విశేషం. కూల్‌గా పోస్ట్ తో మంట పెట్టేంతటి పని చేసింది. మీ వెనక ఉన్నది ఎవరో తెలుసంటూ ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమె ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఇందులో త్రిష చెబుతూ, మీరు, మీతోపాటు ఉన్న మీ టీమ్ ఎవరో మీకు తెలుసు. కూల్‌గా ఉండండి, ఇంతటితో ఈ పుకార్లని ఆపేయండి, చీర్స్` అంటూ త్రిష పోస్ట్ పెట్టింది. కొందరు మీతో ఈ పుకార్ పుట్టించారని, అది ఎవరో మీకు తెలుసు అని, ఎందుకు చేశారో తెలుసని ఆమె పరోక్షంగా రూమర్ క్రియేట్ చేసిన వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. అయితే ఆమె `లియో` చిత్రంలోని కొటేషన్స్ ని వాడుతూ ఈ పోస్ట్ పెట్టడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అటు తన సినిమాని, ఇటు రూమర్స్ కి కౌంటర్ ఇవ్వడం విశేషం.
Trisha Krishnan
అయితే ప్రస్తుతం త్రిష కొంత గ్యాప్ తర్వాత ఫుల్ బిజీగా ఉంది. `పొన్నియిన్ సెల్వన్`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది త్రిష. ఇప్పుడు దళపతి విజయ్‌తో `లియో` చిత్రంలో నటిస్తుంది. అలాగే అజిత్‌తో ఓ సినిమాకి కమిట్ అయ్యింది. దీంతోపాటు తెలుగులోనూ చిరంజీవితో సినిమా చేయబోతుందని సమాచారం. ఈ నేపథ్యంలో పడని వారు ఈ రూమర్ క్రియేట్ చేశారని అంటున్నారు. వారిని గుర్తించిన తర్వాతే త్రిష ఇలా రియాక్ట్ అయ్యిందని సమాచారం.
ఇదిలా ఉంటే త్రిష ఎనిమిదేళ్ల క్రితమే పెళ్లికి సిద్ధమైంది. ఆమె చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థాలతో ఈ ఇద్దరు ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ఆ టైమ్‌లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఈ రూమర్ ఊపందుకోవడం గమనార్హం. మరోవైపు త్రిష.. రానాతో క్లోజ్‌గా ఉందని, ఇద్దరు డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. రానా మ్యారేజ్ చేసుకోవడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది.