- Home
- Entertainment
- ఇన్నాళ్లకు మళ్లీ దర్శనం.. చుడీదార్ లో మెరిసిపోతున్న త్రిష.. ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ.!
ఇన్నాళ్లకు మళ్లీ దర్శనం.. చుడీదార్ లో మెరిసిపోతున్న త్రిష.. ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ.!
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) తెలుగు ఆడియెన్స్ కు దూరమై చాలా కాలమైంది. మళ్లీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’తో తెలుగు వెర్షన్ తో అలరించనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా త్రిష ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది.

టాలీవుడ్ లో కొన్నేండ్ల పాటు వెలుగొందిన హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఒకరు. తెలుగులో బడా స్టార్స్ సరసన నటించిన త్రిష ఐదారేండ్లుగా తెలుగు ఆడియెన్స్ కు దూరమైంది. ఆమె చిత్రాలు రాకపోవడంతో అభిమాననులు కాస్తా అప్సెట్ అయ్యారు. కానీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ చిత్రంతో మళ్లీ అలరించనుంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేశారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన PS1లో త్రిష ‘కుందవై పిరత్తియార్’ రాణి పాత్రలో నటిస్తోంది. తమిళ బ్యూటీ త్రిషకు ఈ భారీ చిత్రంలో అవకాశం రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. యువరాణి పాత్రలో నటిస్తుండటంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా త్రిష కృష్ణన్ కూడా తనవంతుగా ప్రమోషన్స్ లో పాలుపంచుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఫొటోల్లో త్రిష సంప్రదాయ దుస్తుల్లో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తోంది. గోల్డ్ కలర్ చూడీదార్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. కొన్నేండ్లుగా తెలుగులో ఎలాంటి సినిమాలు రాకపోవడంతో అభిమానులు కాస్తా అప్సెట్ అచయ్యారు. ‘పీఎస్ 1’తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘పీఎస్ 1’ను తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడలోనూ రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రం ఆడియెన్స్ ను అలరించబోతోంది. తమిళ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం.
త్రిష చివరిగా తెలుగులో ‘నాయకీ’తో అలరించింది. 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇప్పటికీ నేరుగా తెలుగులో ఒక్క చిత్రంలోనూ నటించలేదు. కానీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తెలుగు వెర్షన్ తో అభిమానులను, ప్రేక్షకులను అలరించింది. తమిళంలో మాత్రం ఈ బ్యూటీ వరుస పెట్టి చిత్రాలు చేస్తోంది.
‘వర్షం’తో యంగ్ రెబల్ స్టార్ సరసన నటించి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు ఆడియెన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, అల్లరి బుల్లోడు, పౌర్ణమి, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, క్రిష్ణ, బుజ్జిగాడు, కింగ్, నమో వెంకటేశా’ చిత్రాల్లో నటించి తెలుగు వారికి మరింత దగ్గరైంది. ఈ క్రమంలో టాలీవుడ్ కు త్రిష రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. త్రిష తన సినీ కేరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు పాలిటిక్స్ లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో ప్రోత్సాహంతో భవిష్యత్ లో రాజకీయాల్లోకి రాబోతున్నదని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ త్రిష తల్లి మాత్రం ఇప్పట్లో అలాంటి ఆలోచన తనకు లేదని చెప్పింది.