MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?

Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?

Trisha Krishnan:  సౌత్ స్టార్ హీరోయిన్  త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో '44 ఏళ్లకే జీవితం మొదలవుతుంది' అనే వీడియోను షేర్ చేసి, 'ఆమెన్' అని రాశారు. సరిగ్గా ధనుష్ పుట్టినరోజున ఈ పోస్ట్ పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా? ఆమె ఏం చెప్పదలుచుకుంటుంది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 28 2026, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
త్రిష పెట్టిన ఆసక్తికరమైన పోస్ట్!
Image Credit : Instagram

త్రిష పెట్టిన ఆసక్తికరమైన పోస్ట్!

సౌత్  స్టార్ హీరోయిన్ త్రిష ఈమధ్య కాలంలో ఏదో ఒక రకంగా వైరల్ న్యూస్ అవుతూ వస్తోంది. మొన్నటి వరకూ దళపతి విజయ్ విషయంలో త్రిష పేరు ముడిపెడుతూ.. వార్తలు వచ్చాయి.. ఇక తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ పెద్ద చర్చకు దారి తీసింది. త్రిష సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఈసారి ఆమె షేర్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా, నటుడు ధనుష్ పుట్టినరోజున ఈ పోస్ట్ పెట్టడంతో చాలామందిలో ఆసక్తిని రేకెత్తించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి?
Image Credit : Instagram

ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి?

త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, ప్రపంచ ప్రఖ్యాత టీవీ హోస్ట్, మీడియా దిగ్గజం ఓప్రా విన్‌ఫ్రే మాట్లాడిన వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఓప్రాను 'మీకు మళ్లీ ఏదైనా వయసుకు వెళ్లే అవకాశం వస్తే, ఏ వయసును ఎంచుకుంటారు?' అని అడుగుతారు.

Related Articles

Related image1
Mrunal Thakur: తనకంటే 9 ఏళ్లు చిన్న క్రికెటర్‌తో డేటింగ్‌? మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
Related image2
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
37
జీవితంపై స్పష్టత వస్తుంది
Image Credit : Instagram

జీవితంపై స్పష్టత వస్తుంది

దానికి ఓప్రా విన్‌ఫ్రే బదులిస్తూ, 'నేను 30 ఏళ్లకు తిరిగి వెళ్లాలనుకోను. నిజానికి, అసలు జీవితం 44 ఏళ్లకే మొదలవుతుంది. ఆ వయసులోనే మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. ఇతరులను మెప్పించాలనే ఒత్తిడి తగ్గుతుంది. మన లక్ష్యం ఏంటి, దేనికోసం బతుకుతున్నాం అనే స్పష్టత వస్తుంది. ఇతరుల అంచనాల కోసం కాకుండా, మనకోసం బతకడం మొదలుపెట్టే సమయం అది' అని చెప్పారు.

ఓప్రా విన్‌ఫ్రే చెప్పిన '44 ఏళ్లకే జీవితం మొదలవుతుంది' అనే మాట ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకుంది. జీవితంలోని ప్రతి దశలోనూ మనుషులు తమను తాము కొత్తగా కనుగొనగలరని, వయసు పెరగడం అనేది ఎదుగుదలకు అడ్డంకి కాదని ఆ మాట నొక్కి చెబుతుంది. ముఖ్యంగా, వృత్తి, కుటుంబం, వ్యక్తిగత లక్ష్యాల మధ్య బ్యాలెన్స్ సాధించే కాలంగా మధ్య వయసును చాలామంది సైకాలజిస్టులు కూడా చెబుతారు.

47
ఇదే అసలు నిజం
Image Credit : Instagram

ఇదే అసలు నిజం

ఈ వీడియోనే త్రిష తన స్టోరీలో షేర్ చేసి, దానితో పాటు 'ఆమెన్' (Amen) అని ఒకే ఒక్క పదం రాశారు. సాధారణంగా 'ఆమెన్' అంటే 'అలాగే జరగాలి', 'నేను దీనికి పూర్తిగా అంగీకరిస్తున్నాను' లేదా 'ఇదే నిజం' అనే అర్థంలో వాడతారు. కాబట్టి, ఓప్రా అభిప్రాయంతో త్రిష పూర్తిగా ఏకీభవిస్తున్నారని అర్థం అవుతుంది. 

త్రిష షేర్ చేసిన ఈ ఒక్క స్టోరీ, కేవలం సోషల్ మీడియా పోస్ట్ మాత్రమే కాదు, జీవితం గురించి లోతైన ఆలోచనను అభిమానుల్లో రేకెత్తించింది. 'వయసు పెరగడం ముఖ్యం కాదు; అనుభవంతో మనల్ని మనం అర్థం చేసుకుని, మనకోసం బతకడం మొదలుపెట్టే క్షణమే నిజమైన కొత్త జీవితానికి నాంది' అనే ఓప్రా విన్‌ఫ్రే అభిప్రాయాన్ని త్రిష తన 'ఆమెన్' అనే ఒక్క మాటతో బలంగా చెప్పినట్టయింది.

57
సంతృప్తే అసలైన సంపద
Image Credit : Asianet News

సంతృప్తే అసలైన సంపద

గత మే నెలలో తన 43వ పుట్టినరోజు జరుపుకున్న త్రిష, ఇప్పుడు తన జీవితంలోని కొత్త దశను చాలా పాజిటివ్‌గా చూస్తున్నారని ఈ పోస్ట్ ద్వారా తెలుస్తోందని అభిమానులు  కామెంట్ చేస్తున్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, అనుభవం, ఆత్మవిశ్వాసం, సంతృప్తి జీవితానికి అసలైన సంపద అని ఈ పోస్ట్ పరోక్షంగా చెబుతోంది.

67
దానికి, దీనికి సంబంధం లేదు?
Image Credit : Instagram

దానికి, దీనికి సంబంధం లేదు?

ఈ పోస్ట్ పెట్టిన రోజు నటుడు ధనుష్ పుట్టినరోజు కావడంతో, సోషల్ మీడియాలో ఇది మరింత ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. అయితే, త్రిష పోస్ట్ నేరుగా ధనుష్‌ను ఉద్దేశించి కానీ, అతని పుట్టినరోజుకు సంబంధించి కానీ పెట్టలేదు. కానీ ఇద్దరూ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో, ఈ పోస్ట్ వచ్చిన టైమింగ్ వల్ల అభిమానులు  రకరకాల కోణాల్లో చర్చించుకుంటున్నారు.

77
సౌత్ ఇండియాలో ఫుల్ బిజీగా ఉండే హీరోయిన్..
Image Credit : Instagram

సౌత్ ఇండియాలో ఫుల్ బిజీగా ఉండే హీరోయిన్..

త్రిష ప్రస్తుతం తమిళంలోనే కాకుండా, సౌత్ ఇండియాలోనే అత్యంత బిజీయెస్ట్ నటీమణులలో ఒకరిగా ఉన్నారు. ఆమె వరుసగా అగ్ర దర్శకులు, స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన కెరీర్‌లో కొత్త శిఖరాలను అందుకుంటున్నారు. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, ఇండస్ట్రీలో, అభిమానుల్లో  ఆమెకున్న క్రేజ్ తగ్గకపోవడం విశేషం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Malaika Arora Skincare: 52 ఏళ్ల వయసులో మెరిసిపోతున్న మలైకా.. ఆమె నైట్ స్కిన్‌కేర్ సీక్రెట్ ఇదే!
Recommended image2
Reality Show: బిగ్ బాస్ ని మించిన వింత, కాంట్రవర్షియల్ రియాలిటీ షోలు.. ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
Recommended image3
Sreeleela: అందానికే అసూయ పుట్టించేలా మహేష్ బాబు హీరోయిన్ లేటెస్ట్ లుక్! రాధలా మారిన శ్రీలీల..
Related Stories
Recommended image1
Mrunal Thakur: తనకంటే 9 ఏళ్లు చిన్న క్రికెటర్‌తో డేటింగ్‌? మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
Recommended image2
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved