- Home
- Entertainment
- Mrunal Thakur: తనకంటే 9 ఏళ్లు చిన్న క్రికెటర్‌తో డేటింగ్? మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
Mrunal Thakur: తనకంటే 9 ఏళ్లు చిన్న క్రికెటర్‌తో డేటింగ్? మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
Mrunal Thakur: స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు రీసెంట్ గా ధనుష్‌తో వినిపించింది. ఇప్పుడు మరో కొత్త ప్రేమ వివాదంలో ఆమె చిక్కుకుంది. ఓ యంగ్ క్రికెటర్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? నిజమెంత?

మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
భారత్‌లో సినిమాకు, క్రికెట్‌కు మధ్య ఎప్పటినుంచో ఓ బంధం ఉంది. షర్మిలా ఠాగూర్-పటౌడీ కాలం నుంచి ఇప్పటి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ వరకు ఎన్నో జంటలు ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో కొత్త జంట పేరు గట్టిగా వినిపిస్తోంది. వారే 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్, భారత క్రికెట్ యువ సంచలనం యశస్వి జైస్వాల్!
బాంద్రా కేఫేలో ఏం జరిగింది?
ముంబైలోని బాంద్రా వెస్ట్ ఏరియాలో ఉన్న 'పూజీ కేఫే' ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఆ కేఫే బయట తీసిన ఓ చిన్న వీడియోనే. ఆ వీడియోలో, యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ కేఫే నుంచి బయటకు వస్తుండగా, నటి మృణాల్ ఠాకూర్ కేఫే లోపల కనిపించారు. ఇద్దరూ ఒకే సమయంలో ఒకే చోట ఉండటంతో నెటిజన్లు 'ఇక్కడ ఏదో జరుగుతోంది!' అని గుసగుసలాడటం మొదలుపెట్టారు.
ప్రేమకు వయసు అడ్డు కాదు అని కామెంట్స్
ఈ విషయం వైరల్ అవ్వగానే, నెటిజన్లు ఇద్దరి వయసు లెక్కలు తీయడం మొదలుపెట్టారు. మృణాల్ ఠాకూర్‌కు ప్రస్తుతం 33 ఏళ్లు. యశస్వి జైస్వాల్‌కు కేవలం 24 ఏళ్లే. ఈ 9 ఏళ్ల వయసు తేడా చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. 'ప్రేమకు వయసు అడ్డు కాదు' అని కొందరు సపోర్ట్ చేస్తుంటే, 'ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు' అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం
వైరల్ అయిన వీడియోలో ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడినట్లుగానీ, కాఫీ తాగినట్లుగానీ ఎలాంటి దృశ్యాలు లేవు. జైస్వాల్ సీరియస్‌గా బయటకు వస్తుంటే, మృణాల్ లోపల ఉన్నారు. అయినా, 'ఇద్దరూ ఒకే కేఫేకి ఎందుకు వెళ్లారు? రహస్యంగా కలిశారా?' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి ముందు, మృణాల్ పేరు తమిళ నటుడు ధనుష్‌తో వినిపించింది. కానీ ఇప్పుడు జైస్వాల్ పేరు తెరపైకి రావడంతో ఆ పాత వార్తలన్నీ మాయమయ్యాయి.
హాట్ టాపిక్‌గా కాఫీ డేట్' కథ
ఈ వైరల్ వీడియో, వస్తున్న వదంతులపై మృణాల్ గానీ, యశస్వి గానీ ఇప్పటివరకు స్పందించలేదు. సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేస్‌లలో కనిపించినప్పుడు ఇలాంటి వార్తలు రావడం సహజమే. బహుశా, ఇద్దరూ స్నేహితులు కావచ్చు లేదా పని విషయంలో అక్కడ కలిసి ఉండొచ్చు. కానీ, అభిమానులు అప్పుడే వీరికి ఓ జంట పేరు పెట్టేసి, 'కొత్త జంట' అంటూ సంబరాలు మొదలుపెట్టేశారు. మొత్తానికి, ఈ బాలీవుడ్ బ్యూటీకి, క్రికెట్ ప్రపంచంలోని 'యశస్వి' కి మధ్య నిజంగా ఏమైనా ఉందా? లేక ఇది కేవలం సోషల్ మీడియా సృష్టించిన తుఫానా? అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే. అప్పటివరకు ఈ 'కాఫీ డేట్' కథే హాట్ టాపిక్‌గా ఉంటుంది!
