పొన్నియన్ సెల్వం లో త్రిష నగలు చాలా ప్రత్యేకమట..? మణిరత్నం స్పెషల్ గా ఏం చేశారంటే..?
మణిరత్నం ఎన్నో ఏళ్ళ కృషికి దృష్యం రూపం పొన్నియన్ సెల్వం. ఈ మూవీ కోసం మణిరత్నం చాలా ఏళ్లు తపించారు. చివరికి ఎలాగో సాధించి.. ఒక భాగం సినిమాను రిలీజ్ చేశారు. తమిళంలో అద్భుతంగా నడుస్తున్న ఈసినిమా ఇతర భాషల్లో మాత్రం ఆడియన్స్ కు పెద్దగా ఎక్కలేదు.
ఈ సినిమా కోసం బాగా తపించారు మణిరత్నం చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో ముఖ్యంగా హీరోయిన్లు త్రిష, ఐశ్వర్య రాయ్ కి సబంధించిన మేకప్, కాస్ట్యూమ్స్..డైలాగ్స్ విషయంలో మణిరత్నం మార్క్ చూపించాడు. ముఖ్యంగా త్రిష విషయంలో మణరత్నం నిర్ణయం గురించి ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
ఈసినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. కథ, పాత్రలు, సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్, ఒక్కటేమిటీ ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్థ తీసుకున్నారు మణిరత్నం. అందులో త్రిష ధరించిన నగలకు చాలా ప్రముఖ్యత ఉందంటూ నెట్టింట్లో న్యూస్ వైరల్ అవుతోంది.
పొన్నియన్ సెల్వన్ సినిమా కాస్ట్యూమ్స్ తో పాటు.. మేకప్.. నగల పై రకరకాల చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష చోళా దేశపు రాజకుమారి కుందవై పాత్రలో నటించారు. ఈ పాత్రలో త్రిషను చూసి ప్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.
త్రిష చేసిన కుందవై పాత్రపై మణిరత్నం ఎక్కువ కేరింగ్ పెట్టారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ విషయంలో మణిరత్నం ఎంతో జాగ్రత్తగా ఉంటారని. తన కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డారని చెప్పారు. ఈ పాత్ర వేసుకునే నగలు నిజమైనవై ఉంటేనే ఖచ్చితంగా ఆ లుక్ వస్తుందని.. నిజంగా నగలు మంచి లుక్ ఇస్తాయని నమ్మి.. రియల్ గోల్డ్ తో ఆ నగలు చేయించారట మణిరత్నం
Trisha
కుందమై పాత్ర లో వేసుకున్న నగలు నిజమైనవేనట. కొన్ని సీన్స్ లో అయితే నిజమైన నగలే మణీరత్నం తెప్పించారని తెలిసి.. అంతా ఔరా అంటున్నారు. మణిరత్నం అనుకుంటే అది అనుకున్నట్టు చేసేవరకూ నిద్రపోరు. కొన్ని ఏళ్ళుగా పొన్నియన్ సెల్వన్ కథపై వర్కౌట్ చేశారు మణి.