MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • విజయ్‌కి షాక్‌ ఇచ్చిన త్రిష.. పెళ్లిపై సంచలన స్టేట్‌మెంట్‌, సింగిల్‌గానే ఉండిపోతుందా?

విజయ్‌కి షాక్‌ ఇచ్చిన త్రిష.. పెళ్లిపై సంచలన స్టేట్‌మెంట్‌, సింగిల్‌గానే ఉండిపోతుందా?

నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ టీనేజ్‌ అమ్మాయిలా కనిపిస్తుంది త్రిష. ఇరవై ఏళ్ల క్రితం `అతడు` సినిమాలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే అప్పటి కంటే ఇప్పుడే అందంగా ఉంది. ఆ మధ్య సినిమాల పరంగా కొంత గ్యాప్‌ తీసుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ బిజీ అవుతుంది. వరుసగా సినిమాలతో మెప్పిస్తుంది. ఇటీవల `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` చిత్రంలో మెరిసింది. త్వరలో `థగ్‌ లైఫ్‌` మూవీతో రాబోతుంది. ఈ క్రమంలో త్రిష మ్యారేజ్‌ పై చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 20 2025, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
actress Trisha Krishnan

actress Trisha Krishnan

త్రిష.. తెలుగులో చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. కానీ తమిళంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఆమె ఇప్పుడు చిరంజీవితో `విశ్వంభర` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తమిళంలో అజిత్‌ సరసన బాక్‌ టూ బాక్‌ సినిమాలు చేసింది. ఆ మధ్య `పట్టుదల` చిత్రంలో నటించింది. అది పెద్దగా ఆడలేదు. ఇప్పుడు `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` మూవీ మంచి వసూళ్లని రాబడుతుంది. ఈ క్రమంలో కమల్‌ హాసన్‌, శింబు నటించిన `థగ్‌ లైఫ్‌` చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

`థగ్‌ లైఫ్‌` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రిష తన పెళ్లిపై స్పందించింది. మ్యారేజ్‌ పై ఒపీనియన్‌, పెళ్లిఎప్పుడు అనే ప్రశ్నకి త్రిష స్పందిస్తూ, సంచలన స్టేట్మెంట్‌ ఇచ్చింది. తనకు పెళ్లిపై నమ్మకం లేదని చెప్పింది. మ్యారేజ్‌ అయినా ఓకే, కాకపోయినా ఓకే అని చెప్పి షాకిచ్చింది. పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే దానికి తన వద్ద సమాధానం లేదని, పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తనకే తెలియదని చెప్పింది త్రిష. 
 

35
Trisha

Trisha

తన మ్యారేజ్‌పై ఓ సందర్భంలో మాట్లాడుతూ, తన మనసుకి నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా చేసుకుంటానని, తనని పెళ్లి చేసుకోబోయేవాడు జీవితాంతం తనకు తోడుగా ఉండాలనే నమ్మకం కలగాలని, అప్పుడే మ్యారేజ్‌ చేసుకుంటానని వెల్లడించింది. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం తనకు ఇష్టం లేదని, చాలా మంది మ్యారేజ్‌ చేసుకుని అసంతృప్తితో జీవిస్తున్నారు. అలాంటి లైఫ్‌ తనకు వద్దు అని చెప్పింది త్రిష. 
 

45
Trisha Krishnan

Trisha Krishnan

ఇదిలా ఉంటే త్రిష.. కోలీవుడ్‌ స్టార్‌ దళపతి విజయ్‌తో ప్రేమలో ఉన్నట్టు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య `ది గోట్‌` మూవీలో త్రిష ఐటెమ్‌ సాంగ్‌ కూడా అందుకే పెట్టారని అన్నారు. విజయ్‌ తన భార్యకి విడాకులిచ్చి త్రిషని మ్యారేజ్‌ చేసుకోబోతున్నాడనే రూమర్లు వచ్చాయి. విజయ్‌ రాజకీయాల్లోకి వెళ్లిన నేపథ్యంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు త్రిష చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చ అవుతున్నాయి. ఆమె విజయ్‌ని ఉద్దేశించే మాట్లాడిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 

55
thug life

thug life

త్రిష.. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న `థగ్‌ లైఫ్‌`లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె శింబుకి జోడీగా చేస్తున్నట్టు సమాచారం. శుక్రవారం ఈ మూవీ నుంచి పాట విడుదలయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో కమల్‌, శింబు, మణిరత్నంతోపాటు త్రిష కూడా పాల్గొంది. సినిమా విశేషాలను పంచుకుంది. ఈ మూవీ జూన్‌ 5న విడుదల కాబోతుంది. 

read  more: `ఓడెల 2`, `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ కలెక్షన్లు.. తమన్నాకి షాకిచ్చిన విజయశాంతి

also read: విడాకులపై నటి ప్రగతి డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అమ్మలా తాను మిగిలిపోకూడదని, పిల్లల కోసం అంత పని చేసిందా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
త్రిష
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image3
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved