త్రిష, ఐశ్వర్యరాయ్, షారుఖ్, సినిమా స్టార్స్ పాస్‌పోర్ట్ ఫోటోలు ఎప్పుడైనా చూశారా..? ఇలా ఉన్నారేంటి..?
భారతీయ సినిమా నటుల పాస్‌పోర్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నయనతార: లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల్లో ఎన్ని గెటప్‌లు వేసుకున్నా, పాస్‌పోర్ట్ ఫోటోలో సింపుల్‌గా కనిపిస్తున్నారు. 15 ఏళ్ల కిందటి ఫోటోలా ఉండటంతో.. అప్పటికి ఇప్పటికి నయన్ లో మార్పును గమనించారు ఫ్యాన్స్.
త్రిష: చెన్నై బ్యూటీ త్రిష ఏజ్ బారు అవుతున్నా.. హీరోయిన్ గా కొనసాగుతూనే ఉన్నారు. 20 ఏళ్లుగా అభిమానుల మనసు దోచుకుంటున్న ఈ బ్యూటీ... పాస్‌పోర్ట్ ఫోటోలో సాధారణ సల్వార్‌లో కనిపిస్తున్నారు. 40 ఏళ్లైనా యంగ్ లుక్‌లోనే ఉన్నారు త్రిష. ఇదే అభిప్రాయాన్ని నెటిజన్లు కూడా వెల్లడిస్తున్నారు.
ఐశ్వర్య రాయ్: మాజీ విశ్వసుందరి, బచ్చన్ ఫ్యామిలీ కోడలు ఐశ్వర్య రాయ్ పాస్‌పోర్ట్ ఫోటోలో చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అసలు అప్పటి ఐశ్ కు.. ఇప్పటి ఐశ్వర్య రాయ్‌కి, ఆ ఫోటోకి చాలా తేడా ఉంది. ఏమాత్రం పోలిక లేకుండా కనిపిస్తున్నారు.
సన్నీ లియోన్: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కొన్నేళ్లుగా దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే ఆమె మాత్రం పాస్‌పోర్ట్ ఫోటోలో కాస్త లావుగా కనిపిస్తున్నారు.
కంగనా: బాలీవుడ్, కోలీవుడ్‌లలో ఫేమస్ నటి కంగనా రనౌత్. తలైవి, చంద్రముఖి 2 సినిమాలు ఫ్లాప్ అయినా బాలీవుడ్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. పాస్‌పోర్ట్ ఫోటోలో కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు.
షారుఖ్ ఖాన్: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పాస్‌పోర్ట్ ఫోటో ఇప్పటిలాగే ఉంది. ,అయితే ఈ ఫోటోలు షారుఖ్ ను చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు.. ఉయిరే సినిమా షారుఖ్ ఎలా ఉన్నారో... ఈ పాస్ పోర్ట్ లో ఉన్న షారుఖ్ కూడా అలానే ఉ న్నాడు అంటున్నారు ఫ్యాన్స్.