ఇదీ యష్ సత్తా, పుష్పరాజ్ రికార్డు బద్దలు.. 'టాక్సిక్' తో మరో సంచలనం
యష్ నటించిన టాక్సిక్ సినిమా గ్లింప్స్ వీడియో విడుదలైన 13 గంటల్లోనే పుష్ప 2 గ్లింప్స్ వీడియో కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది.
పుష్ప 2 vs టాక్సిక్
పాన్ ఇండియా హీరోలుగా ఎదిగినవారు అంటే యష్, అల్లు అర్జున్. యష్ కేజిఎఫ్, అల్లు అర్జున్ పుష్ప సినిమాలతో పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ఈ రెండు సినిమాలకి ఒక సారూప్యత ఉంది. మొదటి భాగం కంటే రెండో భాగం సూపర్ హిట్. కేజిఎఫ్ 2 బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు వసూలు చేసింది. పుష్ప 2, 1800 కోట్లకు పైగా వసూలు చేసింది.
పుష్ప 2
కేజిఎఫ్ 2 తర్వాత యష్ నటిస్తున్న సినిమా టాక్సిక్. కీర్తి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కూడా యష్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు. యష్ పుట్టినరోజు సందర్భంగా టాక్సిక్ గ్లింప్స్ వీడియో విడుదలైంది. పబ్ లో అమ్మాయిలతో డాన్స్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రికార్డులు బద్దలు కొడుతోంది.
టాక్సిక్ సినిమా
24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్ వీడియోగా టాక్సిక్ రికార్డ్ సృష్టించింది. పుష్ప 2 హిందీ వెర్షన్ గ్లింప్స్ 24 గంటల్లో 27.67 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. ఈ రికార్డ్ ని టాక్సిక్ 13 గంటల్లోనే బద్దలు కొట్టింది.
టాక్సిక్ పుష్ప 2 రికార్డ్ బ్రేక్
టాక్సిక్ గ్లింప్స్ 13 గంటల్లోనే పుష్ప 2 కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. ప్రస్తుతం 50 మిలియన్ వ్యూస్ దాటింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్ గా టాక్సిక్ నిలిచింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.