MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సౌత్ లో ఓ రేంజ్ లో ఊపేసి.. బాలీవుడ్‌లో బోల్తాకొట్టిన టాలీవుడ్ టాప్ హీరోయిన్లు.!

సౌత్ లో ఓ రేంజ్ లో ఊపేసి.. బాలీవుడ్‌లో బోల్తాకొట్టిన టాలీవుడ్ టాప్ హీరోయిన్లు.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాదిలో వెలుగొందిన టాప్ హీరోయిన్లు బాలీవుడ్ లో మాత్రం ఫ్లాప్ అయ్యారు. తెలుగు, తమిళం, మలయాళంలో రాణించినా.. హిందీలో మాత్రం నిలబడలేకపోయారు. ఈ వరుసలో అలనాటి నటి హీరోయిన్లతో పాటు..  స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 26 2022, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అలనాటి హీరోయిన్, తెలుగు నటి రంభ (Rambha) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 90లలో ఆడియెన్స్ ను వరుస చిత్రాలతో అలరించిన హీరోయిన్లలో రంభ ఒకరు. దాదాపు ఎనిమిది భాషల్లో నటనతో పాటు గ్లామర్ పరంగా కూడా మెప్పించింది.  రంభ 1995లో  ‘జల్లడ్’చిత్రంలో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salmaan Khan)తోనూ ‘జుద్వా’లో కలిసి నటించింది. 2004 వరకు హిందీలో నటించిన రంభ.. అక్కడ మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. వరుసగా ఆఫర్లు వచ్చినా సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. ఇక దక్షిణాది భాషల్లో నటించిన చిత్రాలకు మాత్రం విశేష ఆదరణ దక్కింది.
 

26

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) తన తొలిచిత్రాన్ని హిందీలో నటించింది. ‘క్యూ హో గయా నా’ చెల్లెలు పాత్రతో మెప్పించింది.  ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ సరసన ‘సింగం’తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో ‘స్పెషల్ 26’లోనూ నటించింది. అలాగే మధ్య మధ్యలో హిందీలో నటిస్తూ వస్తోంది. కానీ ఇంకా కాజల్ కు కూడా సరైన గుర్తింపు మాత్రం రాలేదు. 

36

టాలీవుడ్ బుట్టబొమ్మ, స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) పరిస్థితి కూడా అదేవిధంగా ఉందని చెప్పాలి. టాలీవుడ్ లో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ స్పీడ్ కు మాత్రం బాలీవుడ్ లో మాత్రం బ్రేక్ లు పడ్డాయి. గతంలో పూజా క్రేజ్ కు ఏకంగా బాలీవుడ్ గ్రీక్ వీరుడు హ్రుతిక్ రోషన్ సరసన ‘మెహంజో దారో’లో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ పూజాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ‘హౌజ్ ఫుల్ 4’లో మెరిసింది. ప్రస్తుతం వరుస  పెట్టి బాలీవుడ్ లోనే వరుస చిత్రాల్లో నటిస్తోంది. చూడాలీ మరీ ఇప్పటికైనా అక్కడా పాగా వేస్తుందోనన్నది. 

46

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ కేక్ లా మారిపోయిన హీరోయిన్ త్రిష క్రిష్ణణ్ (Trisha Krishnan) తెలుగు, తమిళంలో వరుపెట్టి చిత్రాల్లో నటించింది. తనకున్న క్రేజ్ తో బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ హిందీ ఒకే ఒక్క చిత్రంలో నటించింది త్రిష. అక్షయ్ కుమార్ సరసన ‘కట్టా మీఠా’లో నటించి కనుమరుగైంది. ఆతర్వాత కూడా త్రిషకు పెద్దగా ఆఫర్లు రాలేదు. 

56

సీనియర్ హీరోయిన్ శ్రియా సరన్ (Shriya Saran) కూడా సౌత్ లో ఊపూపి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. 2002లోనే హిందీ చిత్రంలో నటించిన శ్రియా కూడా అక్కడ ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ‘తుఝే మేరీ కసమ్’,‘తోడా తుమ్ బద్లో తోడా హమ్’,‘ఆవారన్’,‘ఎక్’,‘గలీ గలీ చోర్ హై’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ సౌత్ లో మెప్పించినంతగా అక్కడి ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. 

66

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannah Bhatia) ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంది. సౌత్ సినిమాల్లో కన్న బాలీవుడ్ లో ఎక్కువగానే అందాలు ఆరబోస్తున్నా.. తమన్నాకు మాత్రం కలిసి రావడం లేదు. అయినా వరుస పెట్టి చిత్రాల్లో నటిస్తోంది. తొలి చిత్రం హిందీలోనే నటించినా.. సౌత్ లోనే బాగా గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో మిల్క్ బ్యూటీ ‘చాంద్ సా రోషన్ చెహ్రా’,‘హిమ్మత్ వాలా’,‘హమ్ షకల్స్’,‘ఎంటర్ టైన్ మెంట్’ వంటి చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా ‘బబ్లీ బౌన్సర్’తో ఓటీటీలోకి వచ్చింది. కానీపెద్దగా ఆకట్టుకోలేకపోయింది.


 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Recommended image2
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image3
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved