MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వాల్తేరు వీరయ్య చూడడానికి 5 కారణాలు ఇవే.. మెగాస్టార్ చెలరేగితే విమర్శలు పటాపంచలు

వాల్తేరు వీరయ్య చూడడానికి 5 కారణాలు ఇవే.. మెగాస్టార్ చెలరేగితే విమర్శలు పటాపంచలు

సంక్రాంతి సందర్భంగా ఇద్దరు బడా హీరోలు పోటీ పడితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఆల్రెడీ బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్ర సందడి మొదలయింది. దీనితో ఇక వాల్తేరు వీరయ్య ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ మెగా అభిమానుల్లో ఉంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 12 2023, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి అంతా సిద్ధం అయింది.  మరి కొన్ని గంటల్లోనే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా సిల్వర్ స్క్రీన్ పై దర్శనం ఇవ్వబోతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఇద్దరు బడా హీరోలు పోటీ పడితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఆల్రెడీ బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్ర సందడి మొదలయింది. దీనితో ఇక వాల్తేరు వీరయ్య ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ మెగా అభిమానుల్లో ఉంది. వాల్తేరు వీరయ్య చిత్రాన్ని అభిమానులు ఎందుకు తప్పకుండా చూడాలో ఆ కారణాలు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిరంజీవి స్ట్రాంగ్ జోన్: 90 దశకంలో చిరంజీవి ఎలాంటి మాస్ చిత్రాలు చేశారో.. ఆ వైబ్స్ వాల్తేరు వీరయ్యలో కనిపిస్తున్నాయి. మాస్, కామెడీ, యాక్షన్ మిక్స్ చేసిన చిత్రం మెగాస్టార్ స్ట్రాంగ్ జోన్ అనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య ట్రైలర్ చూస్తే చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఏమేమి ఆశించవచ్చో అవి కనిపిస్తున్నాయి. 

36

రీమేక్స్ విమర్శ : చిరు రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150, రీసెంట్ గా గాడ్ ఫాదర్ అనే రీమేక్ చిత్రాల్లో నటించారు. దీనితో చిరు ఎక్కువగా రీమేక్ కథలు ఎందుకుంటున్నారు అనే విమర్శ మొదలైంది. వాల్తేరు వీరయ్య రిమేక్ కాదు. ఒరిజినల్ స్టోరీ. దర్శకుడు బాబీ ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

46

చిరు- రవితేజ : ఈ చిత్రంలో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న అంశం చిరంజీవి.. రవితేజ కాంబినేషన్. మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రంలో 40 నిమిషాల నిడివి ఉండే గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. వైజాగ్ లో గట్టి వేటగాడు లేక ఒక పులి పూనకాలతో ఊగుతోందట అంటూ రవితేజ ట్రైలర్ లో చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 2000 లో విడుదలైన అన్నయ్య తర్వాత చిరు, రవితేజ కలసి నటిస్తున్న చిత్రం ఇదే. 

56

ఆచార్య ప్రభావం : గత ఏడాది కొరటాల దర్శకత్వంలో చిరు నటించిన ఆచార్య చిత్రం ఎంతటి పరాజయం మూటకట్టుకుందో తెలిసిందే. ఆ ప్రభావం ఇంకా మెగా ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. ఆయా తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ రీమేక్ చిత్రం. సో చిరంజీవి తనదైన మార్క్ వాల్తేరు వీరయ్యలో చూపించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

66

బాబీ దర్శకత్వం: దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవికి డైహార్డ్ ఫ్యాన్. చిరు అభిమానిగా బాబీ ఈ చిత్రం కోసం ఎంత కష్టపడి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుంచి పూనకాలు లోడింగ్ అంటూ బాబీ అంచనాలు పెంచేస్తున్న సంగతి తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Raveena Tandon: జనరేటర్ వ్యాన్‌లో బట్టలు మార్చుకున్న హీరోయిన్.. ఆమె డెడికేషన్ కి స్టార్ హీరో ఫిదా
Recommended image2
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Recommended image3
Anna Lezhneva: పవన్ కళ్యాణ్ రెండేళ్ల జర్నీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్, మనసులో బాధను బయట పెట్టిన పవర్ స్టార్ భార్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved