- Home
- Entertainment
- టాప్ 10 రిచ్ హీరోలలో ఇద్దరు తెలుగు స్టార్స్, సెకండ్ ప్లేస్ లో టాలీవుడ్ హీరో ? ఫస్ట్ ప్లేస్ ఎవరిది?
టాప్ 10 రిచ్ హీరోలలో ఇద్దరు తెలుగు స్టార్స్, సెకండ్ ప్లేస్ లో టాలీవుడ్ హీరో ? ఫస్ట్ ప్లేస్ ఎవరిది?
Top 10 Wealthiest Indian Actors: ఇండియాలో ఎక్కువ ఆస్తి కలిగిన టాప్ 10 సినిమా సెలబ్రిటీల లిస్ట్ రిలీజ్ అయ్యింది. సినిమాల్లో నటిస్తూన కోట్లు సంపాదిస్తున్న ఈ స్టార్ హీరోలు ఎవరంటే?

Top 10 Wealthiest Indian Actors: సినిమా ప్రపంచం డబ్బుతో నిండి ఉంది. ఇతర రంగాల కంటే సినిమా రంగంలోనే రెమ్యునరేషన్లు ఎక్కువ, సంపాదన కూడా ఎక్కువే. అయితే సినిమా హీరోల ఆస్తులు, వారి విలాసాల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడు ఆస్తక్తిగానే ఉంటుంటారు. ప్రస్తుతం భారతదేశంలోని టాప్ 10 రిచ్చెస్ట్ హీరోలు ఎవరు? వారి ఆస్తుల విలువ ఎంత. ఈ వివరాలు తాజాగా వెల్లడి అయ్యాయి. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు.
నాగార్జున
నటుడు షారుఖ్ ఖాన్ ఆస్తులు రూ.7300 కోట్లు అని సమాచారం. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా షారుఖ్‌దే. ఐపీఎల్ పోటీల్లో పాల్గొనడం వల్లనే షారుఖ్ ఖాన్ ఆస్తులు పెరిగాయని చెబుతున్నారు. షారుఖ్‌కు ఒక్కో సినిమాకు దాదాపు రూ.250 కోట్లు పారితోషికం ఇస్తున్నారట. ఇది కాకుండా సొంతంగా నిర్మాణ సంస్థను నడుపుతూ దాని ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు షారుఖ్.
టాప్ 10 ధనవంతుల నటులు
ధనవంతుల నటుల జాబితాలో రెండో స్థానంలో ఎవరున్నారో తెలిస్తే షాక్ అవుతారు. బాలీవుడ్ నటులను వెనక్కి నెట్టి తెలుగు నటుడు నాగార్జున రెండో స్థానంలో నిలిచాడు. నాగార్జున మొత్తం ఆస్తుల విలువ రూ.3310 కోట్లు. దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడు కానప్పటికీ, ఆయనకు సినిమాల కంటే వ్యాపారంలోనే ఎక్కువ ఆదాయం వస్తుందట. దాంతో నాగార్జున ఈ లిస్ట్ లో రెండేో స్తానంలో నిలిచాడు.
2025లో అత్యంత ధనవంతులైన భారతీయ సినీ నటుల జాబితా
ప్రకటనలు, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయం కూడా పెద్ద ఆస్తిగా మారుతుంది. సొంతంగా నిర్మాణ సంస్థలు ఉన్న చాలా మంది నటులు భారతదేశంలో ఉన్నారు. ఈ జాబితాలో తెలుగు నుంచి మరో హీరో కూడా ఉన్నారు. ఆయనే మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ ఆయన ఈ లిస్ట్ లో 8వ స్థానం సాదించాడు. 1370 ఆస్తి కలిగి ఉన్నారు రామ్ చరణ్. ఇక విచిత్రం ఏంటంటే..ఈ జాబితాలో రజినీకాంత్ 10వ స్థానంలో ఉండటం.
టాప్ 10 ఇండియన్ రిచ్ హీరోల లిస్ట్ :
1. షారుఖ్ ఖాన్ - 7300 కోట్లు
2. నాగార్జున అక్కినేని - 3310 కోట్లు
3. సల్మాన్ ఖాన్ - 2900 కోట్లు
4. అక్షయ్ కుమార్ - 2500 కోట్లు
5. హృతిక్ రోషన్ - 2000 కోట్లు
6. అమీర్ ఖాన్ - 1862 కోట్లు
7. అమితాబ్ బచ్చన్ - 1600 కోట్లు
8. రామ్ చరణ్ - 1370 కోట్లు
9. సైఫ్ అలీ ఖాన్ - 1200 కోట్లు
10. రజనీకాంత్ - 450 కోట్లు