200 కోట్ల కలెక్షన్స్ నాలుగైదు రోజుల్లోనే సాధించిన టాప్ 10 పాన్ ఇండియా సినిమాలు
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచే భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియాను శాసిస్తున్నాయి. ఈక్రమంలో రిలీజ్ అయిన నాలుగైదు రోజుల్లోనే 200 కోట్లు కలెక్షన్ మార్క్ దాటిన సినిమాలు ఏవో తెలుసా?

పుష్ప: ది రూల్ - పార్ట్ 2
అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్ప2. 2024లో విడుదలైన పుష్ప: ది రూల్ - పార్ట్ 2 కేవలం 3 రోజుల్లో 200.7 కోట్లు వసూలు చేసింది.
జవాన్
2023లో విడుదలైన జవాన్ కేవలం 4 రోజుల్లో 252.08 కోట్లు వసూలు చేసింది. రీ ఎంట్రీలో అదరగోట్టిన షారుఖ్ ఖాన్.. వెయ్యి కోట్ల సినిమాలతో రచ్చ రచ్చ చేశాడు.
యానిమల్
2023లో విడుదలైంది యానిమల్ మూవీ. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్ది వంగ డైరెక్ట్ చేసిన ఈమూవీ కేవలం 4 రోజుల్లో 216.64 కోట్లు వసూలు చేసింది.
పఠాన్
షారుఖ్ ఖాన్ హిట్ సినిమాల వరుసగా పఠాన్ కూడా ఒకటి. 2023లో విడుదలైన పఠాన్ కేవలం 4 రోజుల్లో 212.5 కోట్లు వసూలు చేసింది.
స్త్రీ 2
2024లో విడుదలైన స్త్రీ 2 కేవలం 5 రోజుల్లో 229.55 కోట్లు వసూలు చేసింది. ఈసినిమా సైలెంట్ గా వచ్చి బాలక్సాఫీస్ ను షేక్ చేసింది.
గదర్ 2
2023లో విడుదలైన గదర్ 2 కేవలం 5 రోజుల్లో 229.08 కోట్లు వసూలు చేసింది. హిట్లు లేక ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ కు ఊరటనిచ్చింది.
KGF చాప్టర్ 2
2022లో విడుదలైన KGF చాప్టర్ 2 కేవలం 5 రోజుల్లో 219.56 కోట్లు వసూలు చేసింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమాతో కన్నడ ఇండస్ట్రీ వెలుగులోకి వచ్చింది.
బాహుబలి 2
టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్ళిన సినిమా బాహుబలి. ప్రభాస్, అనుష్క జంటగా 2017లో విడుదలైన బాహుబలి 2 కేవలం 6 రోజుల్లో 224.25 కోట్లు వసూలు చేసింది.
ఛావా
2025లో విడుదలైన ఛావా కేవలం 7 రోజుల్లో 219.25 కోట్లు వసూలు చేసింది. శివాజీ మహారాజ్ తనయుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈసినిమా భారత దేశ ప్రజలను ఎమోషనల్ గా టచ్ చేసింది.
టైగర్ 3
2023లో విడుదలైన టైగర్ 3 కేవలం 7 రోజుల్లో 214.25 కోట్లు వసూలు చేసింది. కాని ఫైనల్ రన్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.