MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tollywood Directors: బోయపాటి నుంచి రాజమౌళి వరకు..వాళ్ళ కెరీర్ లో బెస్ట్ మూవీస్ ఇవే, ఇలాంటివి ఇక తీయలేరేమో

Tollywood Directors: బోయపాటి నుంచి రాజమౌళి వరకు..వాళ్ళ కెరీర్ లో బెస్ట్ మూవీస్ ఇవే, ఇలాంటివి ఇక తీయలేరేమో

రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి అగ్ర దర్శకుల కెరీర్ లో ఉత్తమ చిత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఆ సినిమాలని మించే చిత్రాలు వీళ్ళు మళ్ళీ తీయగలరా లేదా అనే చర్చ అభిమానుల్లో ఉంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 02 2026, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
టాలీవుడ్ లో అగ్ర దర్శకులు
Image Credit : Asianet News

టాలీవుడ్ లో అగ్ర దర్శకులు

టాలీవుడ్ లో కొందరు అగ్ర దర్శకులు ఉన్నారు. ప్రతి దర్శకుడు తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు అందించటం సహజమే. కానీ ఆ దర్శకుడి పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చే బెస్ట్ మూవీ ఒకటి ఉంటుంది. ఆ విధంగా బోయపాటి శ్రీను, రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుల కెరీర్ లో బెస్ట్ మూవీస్ ఏంటి అనేది ఈ లిస్ట్ లో తెలుసుకుందాం.

29
బోయపాటి శ్రీను - భద్ర
Image Credit : Asianet News

బోయపాటి శ్రీను - భద్ర

నిస్సందేహంగా బోయపాటి కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే భద్ర అనే చెప్పాలి. భద్ర తర్వాత బోయపాటి మాస్ యాక్షన్ సినిమాలు తెరకెక్కించారు. కానీ అవన్నీ రొటీన్ అనే విమర్శలు ఉన్నాయి. కానీ భద్ర చిత్రంలో మాత్రం కథ, సంగీతం, తెరకెక్కించిన విధానం, ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్ సింక్ లో ఉంటాయి.

Related Articles

Related image1
Anushka Shetty: అనుష్క పాత్ర వల్లే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ ? అంతా అయిపోయాక క్లాసిక్ అంటూ ప్రశంసలు
Related image2
Biggest Flop Movie: ₹45 కోట్ల బడ్జెట్, ₹60 వేల కలెక్షన్! ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన సినిమా ఇది
39
శ్రీనువైట్ల - దూకుడు
Image Credit : Jiohotstar

శ్రీనువైట్ల - దూకుడు

శ్రీనువైట్ల దూకుడు కంటే ముందు ఎన్నో హిట్ సినిమాలు చేశారు. కానీ దూకుడు చిత్రం అతడి కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో మహేష్ నటన, బ్రహ్మానందం కామెడీ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. కానీ ఈ చిత్రంలో కామెడీని శ్రీను వైట్ల ఆ తర్వాత కూడా రిపీట్ చేయడం అతడికి మైనస్ అయింది.

49
హరీష్ శంకర్ - గబ్బర్ సింగ్
Image Credit : sun nxt

హరీష్ శంకర్ - గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ చిత్రం ఒక కల్ట్ మూవీగా నిలిచిపోయింది. అగ్ర హీరోల కంబ్యాక్ చిత్రాల్లో గబ్బర్ సింగ్ టాప్ ప్లేస్ లో ఉంటుంది.

59
కొరటాల శివ - శ్రీమంతుడు
Image Credit : our own

కొరటాల శివ - శ్రీమంతుడు

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ శ్రీమంతుడు. ఈ చిత్రం కొరటాల శివ ఇప్పటి వరకు తెరకెక్కించిన మూవీస్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు.

69
సుకుమార్ - రంగస్థలం
Image Credit : Mythri Movie makers

సుకుమార్ - రంగస్థలం

పుష్ప 2 చిత్రం పాన్ ఇండియా రికార్డులు తిరగరాసినప్పటికీ సుకుమార్ బెస్ట్ వర్క్ మాత్రం నిస్సందేహంగా రంగస్థలం చిత్రమే అని చెప్పాలి. ఈ మూవీలో సుకుమార్ 80 వ దశకంలో విలేజ్ పాలిటిక్స్ ని చూపించిన విధానం అద్భుతం.

79
త్రివిక్రమ్ శ్రీనివాస్ - అతడు
Image Credit : Athadu Movie\Jayabheri Creations

త్రివిక్రమ్ శ్రీనివాస్ - అతడు

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో మాయ చేసే దర్శకుడు. త్రివిక్రమ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే మహేష్ బాబు అతడు అనే చెప్పాలి. ఈ మూవీలో త్రివిక్రమ్ డైలాగులు ఇప్పటికీ ఫేమస్.

89
రాజమౌళి - బాహుబలి 2
Image Credit : instagram

రాజమౌళి - బాహుబలి 2

రాజమౌళి ప్రతి చిత్రానికి తన స్థాయిని అదే విధంగా తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నారు. రాజమౌళి కెరీర్ లో బెస్ట్ మూవీ అంటే ఒక్క సినిమా మాత్రమే చెప్పడం కష్టం. కానీ బాహుబలి 2ని ఉత్తమ చిత్రంగా ఎంచుకోవచ్చు. ఈ సినిమా వల్లే పాన్ ఇండియా సినిమాల ప్రభావం పెరిగింది.

99
పూరి జగన్నాధ్ - పోకిరి
Image Credit : instagram

పూరి జగన్నాధ్ - పోకిరి

పోకిరి చిత్రం టాలీవుడ్ రికార్డులని తిరగరాసింది. అప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా మాస్ అండ్ స్టైలిష్ స్టైలిష్ క్యారెక్టర్ లో పూరి మహేష్ బాబుని ప్రజెంట్ చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Giribabu: కృష్ణ ఓ రోజు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు.. అలా చెప్పడం ఏ హీరో వల్ల కాదు.!
Recommended image2
VV Vinayak: ఆ డైరెక్టర్‌ది బిందాస్ యాటిట్యూడ్.. అతడిలా ఒక్కరోజు బ్రతికితే చాలు..
Recommended image3
Biggest Flop Movie: ₹45 కోట్ల బడ్జెట్, ₹60 వేల కలెక్షన్! ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన సినిమా ఇది
Related Stories
Recommended image1
Anushka Shetty: అనుష్క పాత్ర వల్లే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ ? అంతా అయిపోయాక క్లాసిక్ అంటూ ప్రశంసలు
Recommended image2
Biggest Flop Movie: ₹45 కోట్ల బడ్జెట్, ₹60 వేల కలెక్షన్! ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన సినిమా ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved