5 సెకండ్లకు అన్నికోట్లా...? మహేష్ బాబు రెమ్యూనరేషన్ మైండ్ బ్లోయింగ్....?
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి తెలిసిందే. స్టార్ డమ్ తో పాటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా తన మార్క్ చూపిస్తున్నాడు సూపర్ స్టార్ . ప్రస్తుతం షాకింగ్ రెమ్యూనరేషన్ తో .. నిజంగానే షాకిస్తున్నాడు మహేష్.
సూపర్ స్టార్ కృష్ట ఏడాదికి 15 సినిమాలు చేసిన రికార్డ్ సాధిస్తే.. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు మాత్రం ఏడాదికో సినిమా మాత్రమే చేస్తారు. పరిస్థితులు అనుకూలించకపోతే.. ఆ సినిమా కూడా ఉండదనే చెప్పాలి. ఎక్కువ టైమ్ ను తన కుటుంబానికి కేటాయించడానికి మహేష్ ఇష్టపడతాడు.
అయితే సినిమాలు చేయకపోయినా..వరుసగా యాడ్ ఫిల్మ్స్ మాత్రం చేస్తూ వెళ్తున్నాడు మహేష్. యాడ్స్ ద్వారా సినిమాలకంటే కూడా ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 25 బ్రాండ్స్ ను ప్రమోట్ చేశాడు మహేష్ బాబు. వాటి నుంచి కోట్లరూపాయలు వెనకేశాడు. అయితే అలాన అని ఆయనకు డబ్బు పిచ్చి ఏమీ లేదు. ఈ యాడ్స్ ద్వారా వచ్చిన కోట్ల రూపాయలను ఆయన చిన్నారుల వైద్యానికి ఉపయోగిస్తున్నారు.
ఇప్పటికే వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడు మహేష్ బాబు. ఇక తాజాగా మరో కమర్షియల్ యాడ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఇక్కడ ఆయన రెమ్యూనరేషన్ ప్రస్తుతం వైరల్ న్యూస్ అవుతోంది. ప్రస్తుతం 25 బ్రాండ్స్ ను ప్రమోట్ చేసిన మహేష్ బాబు.. తాజాగా మరోకటి యాడ్ చేసుకున్నారు. ప్రముఖ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్‌పే (Phone Pe) స్మార్ట్ స్పీకర్లకు మహేష్ తన గొంతుని ఇస్తున్నారు.
ఫోన్ పే నుంచి మనీ సెండ్ చేసినప్పుడు.. మనీ రీసివ్డ్ అంటూ ఓ వాయిస్ వస్తుంది కదా..? ఆ వాయిస్ కంప్యూటర్ జెనెరేటెడ్ వినిపించేది గతంలో. కాని ఇప్పుడు ఆ వాయిస్ కి బదులు మహేష్ బాబు వాయిస్ వినిపించబోతుంది. అయితే ఫోన్‌పే కూడా ఇంతకుముందు లావాదేవీల కోసం కంప్యూటర్ వాయిస్‌ను వాడుకునేది. కానీ తాజాగా ఫోన్‌పే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో టైఅప్ అయ్యింది. అయితే దీనికోసం మహేష్ బాబు ఏకంగా సెకండ్ కు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్.
దీంతో ఫోన్ పే ద్వారా మనం చెల్లింపు చేస్తే.. మహేశ్ బాబు వాయిస్ వినిపించనుంది. ఉదాహరణకు.. ఫోన్ పేలో చెల్లింపు చేస్తే.. ఇప్పుడు 50 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్సాఫ్ గురువుగారు అంటూ మహేశ్ బాబు చెబుతాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీని కోసం మహేష్ బాబు 5 సెకండ్ల వాయిస్ కోసం 5 కోట్లు తీసుకున్నారట. అయితే ఇది కొత్తగా వచ్చింది కాదు. గతంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ సైతం ఇదే తరహాలో వాయిస్‌ను అందించారు. ఆ తర్వాత వాయిస్ ఇచ్చిన నటుడు మహేష్ బాబు కావడం విశేషం.
ఇక ఇక్కడ విశేషం ఏంటంటే..ఈ ఐదు సెకన్ల వాయిస్ కోసం మహేష్ కు ఫోన్ పే సంస్థ ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ సినిమాల విషయానికి వస్తే..? రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా పొంగల్ హిట్ గా నిలిచింది. ఇక నెక్ట్స్ టాలీవుడ్ జక్కన్న.. పాన్ వరల్డ్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈసినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఇండోనేషియన్ భామ మహేష్ సరసన నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ అడ్వెంచరస్ మూవీగా ఇది తెరకెక్కుతున్నట్టు సమాచారం.