మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ఎలా ఉంటుందో తెలుసా..? ఫస్ట్ టైమ్ ఆ పనిచేసిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ఎప్పుడైనా చూశారా..? ఆటోగ్రాఫ్ అన్న పదం వినగానే కొత్తగా ఉంది కదా.. ? 80స్.. 90స్ కిడ్స్ కు ఆటోగ్రాఫ్ అంటే పాత జ్జాపకాలు పొంగిపోర్లుతాయి. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటోగ్రాఫ్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది.
ఇప్పుడు స్టార్ హీరో కాని.. సినిమా తారలు ఎవరైనా కనిపిస్తే.. వెంటనే సెల్ఫీలకోసం ఎగబడుతున్నారు.. కాని ఒప్పుడు స్టార్స్ ఎదురైతే.. ఆటోగ్రఫ్ ల కోసం వెంట పడేవారు. ప్రస్తుతం ఆగోగ్రాఫ్ అన్న పదం కూడా ఈ జనరేషన్ ఆడియన్స్ కు తెలియకపోవచ్చు. కాని 90స్ కిడ్స్ కు మాత్రం ఆటోగ్రాఫ్ అంటే ఓ 20 ఏళ్లు వెనక్కి వెళతారు. ఆ పదమే కొత్త అనుభూతిని ఇస్తుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటోగ్రాఫ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
మనకు సూపర్ స్టార్ మహేష్ బాబ కనిపిస్తే ఏం చేస్తాం.. టక్కున ఫోటో దిగుతాం.. సెల్ఫీ అడుగుతాం.. కాని ఒ అభిమాని మాత్రం మహేష్ బాబు ను ఆటోగ్రాఫ్ అడిగాడు. మరి అడక్క అడక్క ఆటో గ్రాఫ్ అడిగినందుకో ఏమో.. మహేష్ బాబుకు ముచ్చటేసి.. లవ్ అని పెట్టి మరీ తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. తాజాగా మహేష్ బాబు జర్మనీ వెళ్ళాడు.. వెళ్తా వెళ్తా.. ఎయిర్ పోర్ట్ లో సోలోగా కనపడటంతో అక్కడ పలువురు అభిమానులు ఆయనతో ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ కోసం ఎగబడ్డారు.
దీంతో మహేష్ పలువురు అభిమానులకు ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ ఇవ్వగా అభిమానులు వాటిని తమ సోషల్ మీడియాల్లో షేర్ చేసుకున్నారు. ఓ అభిమానికి.. లవ్, మహేష్ బాబు అని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు సూపర్ స్టార్. అతను ఆ ఆటోగ్రాఫ్ ను పోటోగ్రాఫ్ గా మార్చి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం మహేష్ బాబు ఆటోగ్రాఫ్ వైరల్ అవుతుంది.
ఇక ఈ మధ్యే సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాతో అభిమానులు మందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. గుంటూరు కారం సినిమా ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకెళ్తుంది. త్వరలోనే గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ ని కూడా ప్లాన్ చేయబోతున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు సడెన్ గా జర్మనీకి వెళ్ళాడు. త్వరలో రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం ఆయన మరోలుక్ ను మార్చబోతున్నట్టు తెలుస్తోంది
మహేష్ బాబు ఫారెన్ టూర్లకు వెళ్లడం కామనే అయినా.. ఇప్పుడు మాత్రం జర్మనీ టూర్ కాస్త చిత్రమే అనుకోవాలి. ఎందుకంటే.. ఏటూర్ కి అయినా..మహేష్ బాబు ఒంటరిగా వెళ్లడు... ఫ్యామిలీని వెంటేసుకునివెళ్ళాల్సిందే. అంటువంటిది.. సూపర్ స్టార్ ఈసారి మాత్రం సింగిల్ గా జర్మనీ వెళ్ళాడు. అదే ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.